Sakshi Agarwal: తక్కువ సమయంలో బాగా పాపులర్ అయ్యింది హీరోయిన్ సాక్షి అగర్వాల్. పేరుకే తమిళనాడు కేరాప్ గానీ, పుట్టిందంతా నార్త్‌లో.
పదేళ్ల కిందట గ్లామర్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అమ్మడు, ట్రెండ్‌కు తగ్గట్టుగా ఫాలో అవుతోంది.
ఓ వైపు అభిమానులు, మరోవైపు వెండితెర.. ఇంకో వైపు బుల్లితెర ఇలా ఏ మాత్రం తగ్గేదే లేదంటోంది.
రాజా రాణి మూవీతో అడుగుపెట్టిన సాక్షి వెను దిరిగి చూసుకోలేదు. కన్నడ, మలయాళం యూత్‌ని ఆకట్టుకుంది.
కాకపోతే టాలీవుడ్‌లో అడుగుపెట్టాలనే కోరిక మరింత బలంగా ఉంది. తన సోయగాలతో యూత్‌కు కునుకు లేకుండా చేస్తోంది కూడా.
తాను చేసిన ప్రతీది గ్లామర్ ఇండస్ట్రీలో భాగమేనని చెప్పుకునే ప్రయత్నం చేసింది.. చేస్తోంది కూడా.
బిగ్‌బాస్ ద్వారా మరింతగా ఫేమస్ అయ్యింది సాక్షి అగర్వాల్. లేటెస్ట్‌గా కాసింత అందంగా ఫోటోషూట్ ఇచ్చేసింది. తన ఎత్తుపల్లాలను ఎరగా వేసి జస్ట్ తానింకా 20 అని చెప్పే ప్రయత్నం చేసింది.
ఫాలోవర్స్ డైవర్ట్ కాకుండా ఈ రేంజ్‌లో ఎవరూ లేరని చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఆమెకి సంబంధించి లేటెస్ట్ ఫోటోలపై ఓ లుక్కేద్దాం.