OTT Movie : ఓటిటిలో ఇప్పుడు మలయాళం మూవీస్ ట్రెండ్ నడుస్తోంది. మలయాళం ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా లెవెల్ మూవీస్ ను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తో ఒక మూవీ ప్రేక్షకులను మెప్పించి ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో విజయం సాధించి ఓటిటిలో కూడా హల్చల్ చేస్తోంది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
నెట్ ఫ్లిక్స్( Netflix)
ఇప్పుడు మనం చెప్పుకోబోయే మలయాళం మూవీ పేరు “కప్పేలా” (Kappela). ఈ మూవీ ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. రాంగ్ కాల్ తో ఫోన్లో మాట్లాడిన అమ్మాయి ఒక వ్యక్తితో ప్రేమలో పడి ఆమె ఎదుర్కొన్న సమస్యలతో ఈ మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్( Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
జెస్సి ఇంటర్ ఫెయిల్ అవ్వడంతో ఇంట్లోనే తల్లికి తోడుగా ఉంటూ ఆమెకు సహాయం చేస్తూ ఉంటుంది. ఒకరోజు అనుకోకుండా జెస్సి రాంగ్ కాల్ చేస్తుంది. పొరపాటున ఆ నెంబర్ విష్ణు అనే ఆటో డ్రైవర్ కి వెళుతుంది. ఆ తర్వాత ఆ కాల్ కట్ చేసినా కూడా అతను పదేపదే చేస్తూ ఉంటాడు. అయితే కొద్ది రోజులకు వీళ్ళు మాట్లాడుకోవడం మొదలు పెడతారు. అలా ఒకరిని ఒకరు ఇష్టపడతారు. అదే ఊరిలో జెస్సి ని బిన్నీ అనే వ్యక్తి ప్రేమిస్తాడు. అది వన్ సైడ్ లవ్ కావడంతో కుటుంబంతో సహా వెళ్ళి జెస్సిని తనకిచ్చి పెళ్లి చేయమని అడగడానికి వస్తారు. వాళ్లు పేదవాళ్లు కావడంతో ఆ ఇంటిని చూసి బెన్నీ తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకోరు. అలా జరిగినందుకు జెస్సీ చాలా సంతోషపడుతుంది. విష్ణు ని కలవడానికి ఇంట్లో నుంచి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతుంది.
సిటీకి వచ్చినాక జెస్సీ విష్ణు ని కలుస్తుంది. విష్ణు కదలికలపై అనుమానం వచ్చిన ఒక వ్యక్తి వీళ్ళని ఫాలో చేస్తూ ఉంటాడు. ఎందుకు ఫాలో చేస్తున్నావని అతనిపై ఒకసారి గొడవ కూడా పెట్టుకుంటారు. ఇది ఇలా ఉండగా జెస్సిని ఒక రూమ్ లో ఉంచి వేరే అమ్మాయితో సీక్రెట్ గా మాట్లాడుతూ ఉంటాడు విష్ణు. జెస్సీకి అనుమానం రావడంతో నేను ఇంటికి వెళ్ళిపోతానని చెప్తుంది. అందుకు విష్ణు ఆమెను కొట్టి బలవంతం చేయబోతాడు. విష్ణు అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్లను వేరే వాళ్లకు అమ్మేస్తూ ఉంటాడు. ఈ విషయం తెలియని జెస్సీ మోసపోయి ఉంటుంది. అప్పుడు అక్కడికి ఆ అపరిచిత వ్యక్తి వచ్చి ఆమెను కాపాడి తన వెంట తీసుకువెళ్తాడు. చివరికి ఆ అపరిచిత వ్యక్తి నుంచి జెస్సికి ఏమైనా సమస్యలు వస్తాయా? తిరిగి ఆమె ఇంటికి వెళ్ళగలుగుతుందా? విష్ణుని పోలీస్ లు పట్టుకుంటారా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ “కప్పేలా” (Kappela) లవ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని చూడాల్సిందే.