BigTV English

Garelu Recipes: మినప్పప్పు అవసరం లేకుండా గారెలు.. ఇదిగో ఇలా చేస్తే క్షణాల్లో సిద్ధం

Garelu Recipes: మినప్పప్పు అవసరం లేకుండా గారెలు.. ఇదిగో ఇలా చేస్తే క్షణాల్లో సిద్ధం
Garelu Recipes: మీకు గారెలు తినాలనిపిస్తే అప్పటికప్పుడు గారెలను ఎలా చేసుకోవాలో తెలుసుకోండి. దీనికి మినప్పప్పు అవసరం లేదు, రవ్వ ఉంటే సరిపోతుంది.
గారెలు పేరు చెబితేనే నోరూరిపోతుంది. కానీ అప్పటికప్పుడు చేసుకోవాలంటే కుదరదు అనుకుంటారు. ఎందుకంటే గారెల కోసం మినప్పప్పును నాలుగు గంటల ముందే నానబెట్టుకోవాలి, అలా నానబెట్టుకున్నాకే క్రిస్పీ గారెలు వండుకోవచ్చు. అయితే మినప్పప్పు నానబెట్టాల్సిన అవసరం లేకుండా ఇన్స్‌స్టెంట్‌గా అప్పటికప్పుడు గారెలు ఎలా చేసుకోవాలో ఇక్కడ ఇచ్చాము. కేవలం ఉప్మా రవ్వ ఉంటే చాలు టేస్టీ గారెలు రెడీ అయిపోతాయి. ఇవి చాలా క్రంచీగా, క్రిస్పీగా ఉంటాయి. పిల్లలకు కూడా ఎంతో బాగా నచ్చుతాయి. ఈ గారెలను కొబ్బరి చట్నీలో ముంచుకుని తింటే రుచి అదిరిపోతుంది. చికెన్ కర్రీతో తిన్నా టేస్టీగా ఉంటుంది. ఇక మా రవ్వతో గారెలు ఎలా చేయాలో తెలుసుకోండి.
ఉప్మా రవ్వ గారెలు రెసిపీకి కావలసిన పదార్థాలు
ఉప్మా రవ్వ – రెండు కప్పులు
ఉల్లిపాయ తరుగు – అర కప్పు
అల్లం తరుగు – ఒక స్పూను
పచ్చిమిర్చి తరుగు – ఒక స్పూను
కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు
కరివేపాకులు – గుప్పెడు
పుదీనా తరుగు – రెండు స్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా
పెరుగు – ఒక కప్పు
నీరు – సరిపడినంత
బేకింగ్ సోడా – చిటికెడు
ఉప్మా రవ్వ ఇడ్లీ గారెలు రెసిపీ
1. ఒక గిన్నెలో ఉప్మా రవ్వను, పెరుగులో వేసి బాగా కలపండి.
2. అందులోనే రుచికి సరిపడా ఉప్పును వేయండి.
3. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లి తరుగు, జీలకర్ర, అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు, పుదీనా తరుగు వేసి బాగా కలుపుకోండి.
4. అర గ్లాసు నీళ్లు వేసి బాగా కలపండి. మరీ పలుచగా కాకుండా చూసుకోండి.
5. గారెలకు ఎంత మందంగా కావాలో అంత గట్టిగా పిండి వచ్చేలా చూసుకోండి.
6. పైన మూత పెట్టి పావుగంట పాటు పక్కన వదిలేయండి.
7. ఆ తరువాత బేకింగ్ సోడా చిటికెడు వేసి మళ్ళీ కలపండి.
8. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేయండి.
9. ఆ నూనెలో ఈ పిండిని తీసుకొని చేత్తోనే గారెల్లా ఒత్తుకొని మధ్యలో చిల్లు పెట్టుకుని నూనెలో వేసుకోండి.
10. రెండు వైపులా రంగు మారేవరకు వేయించుకొని తీసి టిష్యూ పేపర్ మీద పెట్టండి.
11. ఈ గారెలతో పాటు తినేందుకు పక్కన చికెన్ గ్రేవీ ఉంటే రుచి అదిరిపోతుంది.
12. శాకాహారులకైతే కొబ్బరి చట్నీ టేస్టీగా ఉంటుంది. ఇలా అరగంటలోనే గారెలను సులువుగా చేసుకోవచ్చు. ఇవి మినప్పప్పుతో చేసే గారెలు లాగే టేస్టీగా ఉంటాయి.మినప్పప్పులో పోషకాలు అధికమే కాబట్టి ఎక్కువ మంది ఆ గారెలను ఇష్టపడతారు. అయితే అప్పుడప్పుడు ఇలా ఉప్మా రవ్వతో కూడా గారెలు చేసుకోవచ్చు. ఉప్మా రవ్వ కూడా ఆరోగ్యానికి మంచిదే. మనం ఇందులో మైదా లాంటి పదార్థాలు ఏమి వాడలేదు. కాబట్టి ఈ గారెలు ఎన్ని తిన్నా మంచిదే. ఇందులో పెరుగు, ఉల్లిపాయ, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకులు, పుదీనా వంటి ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలనే వాడాము. చివరిలో బేకింగ్ సోడా వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేకుంటే ఇవి క్రిస్పీగా కాకుండా గట్టిగా వచ్చే అవకాశం ఉంది. బేకింగ్ సోడా వేయడం వల్ల ఇవి క్రిస్పీగా క్రంచిగా వస్తాయి. ఒకసారి ఈ ఉప్మా గారెలు ప్రయత్నించి చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతాయి.


Related News

Ghost In Dreams: నిద్రకు ముందు ఇలాంటి పనులు చేస్తే.. దెయ్యాలు కలలోకి వస్తాయ్, జర భద్రం!

Sleep on Side: గుండె సేఫ్ గా ఉండాలంటే ఏ సైడ్ పడుకోవాలి? డాక్టర్లు ఏం చెప్తున్నారంటే?

Diet tips: రాగి ముద్ద తినడం వల్ల కలిగే ఆరోగ్య రహస్యాలు.. శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు

Shocking Facts: రాత్రి 7 తర్వాత భోజనం చేస్తారా? మీ ఆరోగ్యానికి షాక్ ఇచ్చే నిజాలు!

Heart Problems: రాత్రిపూట తరచూ గురక.. నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన 5 ఆరోగ్య సమస్యలు

Thyroid Disease: థైరాయిడ్ ఉన్న వారు.. పొరపాటున కూడా ఇవి తినొద్దు !

Easy Egg Recipes: ఎగ్స్‌తో తక్కువ టైంలో.. సింపుల్‌గా చేసే బెస్ట్ రెసిపీస్ ఇవే !

Dondakaya Fry: పక్కా ఆంధ్రా స్టైల్ దొండకాయ ఫ్రై.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్

Big Stories

×