Samantha(Image Source: Instagram)
స్టార్ హీరోయిన్ సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏ మాయ చేసావే సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన ఈ చిన్నది ఇప్పటికీ స్టార్ గానే కొనసాగుతోంది.
Samantha(Image Source: Instagram)
అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత.. నాలుగేళ్ల తరువాత విభేదాల వలన విడిపోయింది. ప్రస్తుతం ఒంటరిగా నివసిస్తుంది.
Samantha(Image Source: Instagram)
ఇక సామ్.. మయోసైటిస్ అనే వ్యాధితో పోరాడుతున్న విషయం తెల్సిందే. నిత్యం ఆమె ఏదో ఒక చికిత్స తీసుకుంటూనే ఉంటుంది.
Samantha(Image Source: Instagram)
ఇక ఒక ఏడాది సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సామ్.. ఈ మధ్యనే మళ్లీ సినిమాలను స్టార్ట్ చేసింది. ఇప్పటికే సిటాడెల్ హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Samantha(Image Source: Instagram)
సిటాడెల్ తెలుగు ప్రేక్షకులను అలరించలేకపోయింది. ప్రస్తుతం సామ్ చేతిలో ఎక్కువ సినిమాలు లేవు. బాలీవుడ్ లోనే ఆమె మరో సినిమా ప్లాన్ చేస్తుందని సమాచారం
Samantha(Image Source: Instagram)
సినిమాల విషయం పక్కన పెడితే నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది సమంత
తాజాగా సమంత పికిల్ బాల్ చెన్నై టీమ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న విషయం విదితమే. తాజాగా చెన్నై సూపర్ ఛాంప్స్ ప్లేయర్స్ ను మీట్ అయ్యింది.
Samantha(Image Source: Instagram)
ఇక ఈ ఈవెంట్ లో సామ్ వైట్ కలర్ ట్రాన్స్పరెంట్ కుర్తా, బ్లూ జీన్స్ లో కనిపించింది. ఆ డ్రెస్ పై ఆమె ధరించిన గోల్డ్ చైన్స్ మరింత అందాన్ని పెంచేసాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే కొందరు అయ్యో సామ్ ఇలా మారిపోయిదేంటి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.