BigTV English

Dirtiest Trains In India: దేశంలో అత్యంత చెత్త రైళ్లు ఇవే.. ముక్కు మూసుకుని జర్నీ చేయక తప్పదు!

Dirtiest Trains In India: దేశంలో అత్యంత చెత్త రైళ్లు ఇవే.. ముక్కు మూసుకుని జర్నీ చేయక తప్పదు!

Indain Railways: భారతీయ రైల్వే సంస్థ గత దశాబ్దకాలంగా అత్యాధునిక హంగులను అద్దుకున్నాయి. రైల్వే స్టేషన్ల నుంచి మొదలుకొని రైళ్ల వరకు అద్భుతంగా రూపొందుతున్నాయి. గతంతో పోల్చితే ఇప్పుడు రైళ్లే స్టేషన్లతో పాటు రైళ్లు కూడా చాలా నీట్ గా ఉంటున్నాయి. అయితే, ఇప్పటికీ కొన్ని రైళ్లు అత్యంత మురిగా ఉన్నాయి. వీటిలో శుభ్రత అనేది మచ్చుకైనా కనిపించదు. ఇలాంటి రైళ్లలో ప్రయాణించాలంటే నరకం కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ముక్కు మూసుకుని మరీ ప్రయాణించక తప్పని పరిస్థితి ఉంటుంది. ఈ రైళ్లలో ఒక్కసారి ప్రయాణించారంటే, మళ్లీ జీవితంలో వీటి ముఖం కూడా చూడరు. రైళ్లలో చెత్త పేరుకుపోయి దుర్వాస వస్తుంటుంది. రైల్వే అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే పరిస్థితి లేదనేది ప్రయాణీకులు ఆరోపిస్తుంటాయి. ప్యాసింజర్ల కంప్లైంట్స్ ఆధారంగా దేశంలోనే అత్యంత చెత్త రైళ్లుగా కొన్నింటిని గుర్తించారు రైల్వే అధికారులు. ఇంతకీ అవేంటంటే..


⦿ సహర్స-అమృత్ సర్ గరీబ్ రథ్

బీహార్- పంజాబ్ రాష్ట్రాలను కలిగే ముఖ్యమైన రైళ్లల సహర్స-అమృత్ సర్ గరీబ్ రథ్ ఒకటి. దేశంలోనే అత్యంత మురికి రైళ్లలో ఇది టాప్ ప్లేస్ ను దక్కించుకుంది. ఈ రైల్లో ఒక్కసారి ప్రయాణించారంటే, ఇక రైలు ప్రయాణం మీదే విరక్తి కలుగుతుందంటారు ప్రయాణీకులు.


⦿ ఆనంద్ విహార్- జోగ్బాని సీమాంచల్ ఎక్స్‌ ప్రెస్

దేశంలో అత్యంత మురికి రైళ్లలో ఇది రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఇది ఢిల్లీలోని ఆనంద్ విహార్- జోగ్బాని రూట్ లో నడుస్తుంది. ఈ రైలు పరిశుభ్రత గురించి ప్రయాణీకుల నుంచి రైల్వే అధికారులకు బోలెడు కంప్లైంట్స్ వస్తుంటాయి. ఈ రైలులో చెత్త పేరుకుపోయి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నామని ఫిర్యాదులు అందుతుంటాయి. అయినప్పటికీ రైల్వే అధికారులు ఆ సమస్యలను క్లియర్ చేయలేకపోతున్నారు. పరిస్థితి రోజు రోజుకు మరింత అధ్వాహ్నంగా తయారవుతోంది.

⦿ వైష్ణోదేవి – బాంద్రా స్వరాజ్ ఎక్స్‌ప్రెస్

ఈ రైలు కూడా అత్యంత మురికి రైళ్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఏడాది కాలంలో ఏకంగా 61కి పైగా ఫిర్యాదులు వచ్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు. దేశంలోని చెత్త రైళ్లలో దీన్ని కూడా చేర్చినట్లు వివరించారు.

Read Also: సరికొత్త డబుల్ డెక్కర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్.. పైన ప్యాసింజర్లు, మరి కింద?

⦿ ఫిరోజ్‌ పూర్- అగర్తలా త్రిపుర సుందరి ఎక్స్‌ ప్రెస్

దేశంలోని మురికి రైళ్లలో రైలు కూడా స్థానాన్ని సంపాదించుకుంది. ఈ రైళ్లో ప్రయాణించే ప్యాసింజర్ల నుంచి నిత్యం ఫిర్యాదులు వస్తూనే ఉంటాయి. రైలు పేరు బాగున్నా, లోపల అంతా కంపే అంటున్నారు ప్రయాణీకులు. ఈ రైల్లో ఒక్కసారి ప్రయాణించినా జీవితాంతం మర్చిపోలేరని చెప్తున్నారు.

⦿ అజ్మీర్- జమ్మూ తావి పూజా ఎక్స్‌ ప్రెస్

ఈ రైలు గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. టాయిలెట్స్ కంపుతో రైలు బోగీలన్నీ నిండిపోతాయి.  తప్పిని పరిస్థితులలో మాత్రమే ప్రయాణీకులు ఈ రైల్లో వెళ్తారు. ఏమాత్రం అవకాశం ఉన్నా, ఇందులో జర్నీ చేయకూడదని భావిస్తారు.

Read Also: వందే భారత్ స్లీపర్ రైల్‌కు బుల్లెట్ ప్రూఫ్ విండోలు? రైల్వేశాఖ ఏం చెప్పిందంటే?

Related News

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డ్.. ఒక్క రోజులోనే ఇంత మంది ప్రయాణికులా?

Mumbai Coastal Road: రూ. 12 వేల కోట్లతో మలుపుల రోడ్డు.. లైఫ్ లో ఒక్కసారైనా జర్నీ చేయండి!

Dirtiest railway stations: దేశంలోనే అత్యంత మురికిగా ఉన్న రైల్వే స్టేషన్లు ఇవేనట.. మీ స్టేషన్ కూడా ఉందా?

Railway history: ఈ రైలు వయస్సు 170 ఏళ్లు.. నేటికీ ట్రాక్ పై పరుగులు.. ఎక్కడో కాదు మన దేశంలోనే!

Railway passenger rules: రైల్వేలో ఈ రూల్ ఒకటి ఉందా? తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బందే!

Vande Bharat Train: జర్నీకి పావుగంట ముందు.. IRCTCలో వందేభారత్ టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి!

Big Stories

×