BigTV English

Kidney Transplant: హైదరాబాద్‌లో డాక్టర్ల అరాచకం.. ఏకంగా మనిషి కిడ్నీలనే..?

Kidney Transplant: హైదరాబాద్‌లో డాక్టర్ల అరాచకం.. ఏకంగా మనిషి కిడ్నీలనే..?

Kidney Transplant: హైదరాబాద్‌లోని సరూర్ నగర్ లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కిడ్నీ రాకెట్ దందా కొనసాగస్తున్నారు. ఆస్పత్రిలో డాక్లర్ల గురించి సంచలన విషయాలు బయటపడుతున్నాయి. సరూర్‌నగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడులు జరుగుతున్నట్టు పోలీసులకు ఫిర్యాదు రావడంతో వారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి రంగంలోకి దిగడంతో విషయం బయటపడింది. ఎప్పటి నుంచి ఈ వ్యవహారం కొనసాగుతోంది..? ఎంత మందికి కిడ్నీ మార్పిడి చేశారనే కోణాల్లో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.


ఎలాంటి అనుమతి లేకుండా డాక్టర్లు నలుగురికి కిడ్నీ మార్పిడి చేశారు. ఈ సమాచారంతో ఎల్‌బీ నగర్‌ ఏసీపీ కృష్ణయ్య, రంగారెడ్డి జిల్లా డీఎం అండ్ హెచ్‌వో, డిప్యూటీ డీఎంహెచ్‌వో, సరూర్ నగర్ పీహెచ్‌సీ వైద్యురాలు, జీహెచ్ఎంసీ అధికారులు, సరూర్ నగర్ పోలీసులు హాస్పిటల్‌కు చేరుకుని తనిఖీలు చేపట్టారు. అమాయకుల్ని ఆసరాగా చేసుకొని ఆ ప్రైవేట్ ఆస్పత్రి కిడ్నీ రాకెట్ దందా కొనసాగిస్తుంది.

పక్క రాష్ట్రాలకు చెందిన వ్యక్తులకు డబ్బులు ఆశ చూపి.. పక్క రాష్ట్రానికి సంబంధించిన డాక్టర్లు తీసుకొచ్చి ఈ హాస్పిటల్ వాళ్ళతో కుమ్మక్కై కిడ్నీలను విక్రయించి డబ్బులు దండుకుంటున్నారు. ఈ విషయం బయటికి వెలుగు చూడడంతో మెడికల్ ఆఫీసర్ హాస్పిటల్ వద్దకు చేరుకుని పోలీసుల సహకారంతో విచారణ చేపట్టారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు పేషెంట్స్‌ను గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. వీళ్లంతా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులుగా ప్రాథమిక సమాచారం తెలుస్తోంది. అమాయకులను టార్గెట్ చేస్తూ.. కీడ్నీలు మారుస్తున్నారు.


Also Read: Railway Jobs: 32438 రైల్వే గ్రూప్-డీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది..

ఆసుపత్రిలో చిన్నపాటి వైద్య చికిత్సలకు మాత్రమే అనుమతి ఉండగా ఇది తొమ్మిది పడకల ఆసుపత్రిగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అయితే ఇక్కడ కిడ్నీ శస్త్ర చికిత్సలు వంటి వాటికి అనుమతి లేదని పోలీసులు గుర్తించారు. అయినప్పటికీ అక్రమంగా డబ్బు ఆశ చూసి పక్క రాష్ట్రాలకు చెందిన వారికి అక్రమంగా శస్త్ర చికిత్సలు చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆసుపత్రిని అధికారులు సీజ్‌ చేశారు. ఈ వ్యవహారంలో ఆసుపత్రి ఇన్‌చార్జితో పాటు మరొకొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ఆసుపత్రిపై కూడా పోలీసులు కేసు నమోదు చేయనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని నిజాలు తెలియాల్సి ఉంది.

Related News

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Mallareddy: మల్లారెడ్డి యూటర్న్.. రాజకీయాల్లో నో రిటైర్మెంట్

Telangana rains: మళ్ళీ ముంచెత్తనున్న వర్షాలు.. ఆగస్టు 14 నుండి 17 వరకు జాగ్రత్త!

Big Stories

×