E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today march 19th: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీపకు నిజం చెప్పిన కార్తీక్

Karthika Deepam 2 Serial Today march 19th: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీపకు నిజం చెప్పిన కార్తీక్
Advertisement

Karthika Deepam 2  serial today Episode: పారిజాతం, దీప దగ్గరకు వెళ్లి శౌర్య  కనపించడం లేదంటా కార్తీక్‌ నీకు చెప్పలేదా అని చెప్పగానే.. దీప షాక్‌ అవుతుంది. వెంటనే హాస్పిటల్‌ నుంచి వెళ్లిపోతుంటే.. డాక్టర్ హారిక ఎదురవుతుంది. దీప ఎక్కడికి వెళ్తున్నావు అని అడగుతుంది. దీంతో దీప నేను అర్జెంట్‌గా బయటకు వెళ్లాలి డాక్టర్‌ అని చెప్పగానే.. అదేంటి సుమిత్రగారు వచ్చేశారు, నేను నీ కోసమే వస్తున్నాను. ఆపరేషన్‌కి అంతా రెడీ చేశాను. ఈ టైంలో నువ్వు ఎక్కడికి వెళ్లకూడదు అంటూ డాక్టర్‌ చెప్పడం పారిజాతం వింటుంది. వెంటనే అనుమానంగా సుమిత్ర  ఆపరేషన్‌ కు దీపకు ఏంటి సంబంధం డాక్టర్‌ అని ప్రశ్నించడంతో డాక్టర్‌ షాక్‌ అవుతుంది. పారిజాతానికి ఏం చెప్పాలో అర్థం కాక ఇబ్బంది పడుతుంది. కార్తీక్ ఎక్కడున్నారని అడుగుతుంది..

బయటకు వెళ్లాడని పారిజాతం  చెప్పగానే.. డాక్టర్  ఇంకా టెన్షన్‌ పడుతుంది. చెమటలతో ముఖం మాడిపోతుంది.. పారిజాతం మళ్లీ సుమిత్ర ఆఫరేషన్‌ కు దీపకు ఏంటి సంబంధం అని అడగ్గానే.. డాక్టర్‌ కోపంగా ఇప్పటికే నాకు బీపీ పెరిగిపోతోంది.. నువ్వు ఇంకా  పెంచకు అంటూ పారిజాతం మీద కోప్పడుతుంది డాక్టర్‌. డాక్టర్‌ ఎంత చెప్పినా పారిజాతం మాత్రం.. పదే పదే అదే విషయం అడుగుతుంది. దీంతో డాక్టర్‌ కోపంగా మా టెన్షన్స్‌ మాకుంటాయి.. అందరికీ నేనే సమాధానం చెప్పాలి అనుకుంటూ దీపను తీసుకుని డాక్టర్‌ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

Advertisement

ఇంతలో జ్యోత్స్న వస్తుంది. పారిజాతం నవ్వుతూ.. అంతా నువ్వు చెప్పినట్లే చేస్తున్నాను, దీప ఎక్కడికి వెళ్లకుండా డాక్టర్ గదిలోకి తీసుకెళ్లింది. నువ్వు ఇక్కడే చూస్తూ ఉండు.. అని చెప్పగానే.. నేను కాదు నువ్వే ఈ రూమ్‌కి బయటే ఉండు.. ఆపరేషన్ అయ్యే వరకు శౌర్య ఎవరికి కనిపించదు. ఇక్కడ దీప కనిపించని బిడ్డ కోసం ఏడుస్తూ ఉంటే, అక్కడ బావ రోడ్డు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. ఎంత వెతికినా శౌర్య మాత్రం బావకి దొరకదు అంటూ పారిజాతానికి చెప్తుంది జ్యోత్స్న.

మరోవైపు దీప డాక్టర్‌ రూంలోంచి కార్తీక్‌కు ఫోన్‌ చేసి శౌర్య కనిపించిందా అని అడుగుతుంది. దీంతో కార్తీక్ షాక్‌ అవుతాడు. దీపకు శౌర్య కనిపంచడం లేదన్న విషయం ఎలా తెలుసని అడుగుతాడు. దీంతో తనకు పారిజాతం చెప్పిందని దీప చెప్పడంతో కార్తీక్‌ మరింత షాక్‌ అవుతాడు. అయితే శౌర్యను కిడ్నాప్ చేసింది జ్యోత్య్నే  అని డిసైడ్‌ అవుతాడు కార్తీక్‌. అదే విషయం దీపకు చెప్తాడు. జ్యోత్స్న ప్రతిసారి మనల్ని ఆపాలని చూస్తుంది. అయినా మనం ప్రతిసారి జ్యోత్స్న ఫ్లాన్‌ కు దొరక్కుండా ఇంత దూరం వచ్చాము ఇప్పుడు ఆపరేషన్‌ చేయించబోతున్నాం.

Advertisement

ఆ విషయం కూడా జ్యోత్స్నకు అర్థం అయిందని ఇప్పుడు ఆపరేషన్ ఆపాలని చూస్తుందని.. శౌర్య కనిపించకుండా పోతే మనం ఏం చేస్తామో తనకి తెలుసు అలాగే  ఆపరేషన్ జరిగితే అత్తకి ఏం జరుగుతుందో మనకి తెలుసు.. కాబట్టి  జ్యోత్స్న, పారిజాతం ఇద్దరూ కలిసి ఈ ప్లాన్ చేశార అంటూ కార్తీక్‌ చెప్పగానే.. దీప కోపంతో జ్యోత్స్న, పారిజాతంను తిట్టుకుంటుంది. ఇప్పుడు మనం రాంగ్‌ స్టెప్‌ వేస్తే మీ అమ్మ బతకదు వాళ్లిద్దరికి కావాల్సింది కూడా అదే.. అంటూ కార్తీక్ చెప్తుండగానే.. శ్రీధర్‌ ఫోన్‌ చేస్తాడు.

దీపను లైన్‌లో ఉంచి శ్రీధర్‌తో కాల్‌ లిఫ్ట్ చేస్తాడు కార్తీక్. శౌర్య ఎక్కడుందో తనకు తెలుసని ప్లేస్‌ చెప్తాడు శ్రీధర్‌. దీంతో కార్తీక్‌, దీపకు విషయం చెప్పి తాను అక్కడికి వెళ్తున్నట్టు చెప్తాడు. ఒక కూతురిగా మీ అమ్మను నువ్వు కాపాడుకో, ఒక తండ్రిగా నా కూతురిని నేను కాపాడుకుంటాను అని చెప్పి కాల్‌ కట్ చేసి వెళ్లిపోతాడు.  కార్తీక్‌ కాల్‌ చేశాక బాధపడుతున్న దీప కోపంగా బయటకు వచ్చి పారిజాతాన్ని నిలదీస్తుంది. శౌర్య కనిపించడం లేదన్న విషయం మీకెలా తెలుసు అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో పారిజాతం షాక్‌ అవుతుంది.  ఇంతటితో నేటి కార్తీకదీపం 2 సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×