Seerat Kapoor: దశాబ్దం కిందట గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చింది హీరోయిన్ శీరత్ కపూర్.

పదేళ్ల కెరీర్‌లో బాలీవుడ్‌లో కేవలం రెండు సిన్మాలు మాత్రమే చేసింది.

ఆ తర్వాత టాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.

అలాగే ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. తనకంటూ ఓ స్థానం సంపాదించుకుంది.

కానీ దాన్ని కంటిన్యూ చేయడంలో కాసింత ఇబ్బందులు పడుతోంది మోడల్, నృత్య దర్శకురాలు.

మూడు పదుల వయసొచ్చినా టాలీవుడ్‌లో తనకు ఇమేజ్ వస్తే.. కెరీర్ చూసుకోవాల్సిన అవసరంలేదని భావిస్తోంది.

ఆ విధంగా అడుగులేస్తోంది. రీసెంట్‌గా జ్యువెలరీ యాడ్‌లో కనిపించింది.

శీరత్ కపూర్ పోలిక లేకుండా మారిపోయింది. ఆమె అందానికి నగలు తోడుకావడంతో అబ్బో చెప్పడం కంటే చూడడమే బెటర్.