Ramana Gogula : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్న రమణ గోగుల(Ramana Gogula) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. చాలా ఏళ్ల క్రితం తెలుగులో అద్భుతమైన పాటలు పాడి మంచి పేరు దక్కించుకున్నారు. ఈయన సింగర్ మాత్రమే కాదు మ్యూజిక్ డైరెక్టర్ కూడా.. ముఖ్యంగా తమ్ముడు, ప్రేమంటే ఇదేరా, బద్రి, యోగి, లక్ష్మి, జానీ వంటి చిత్రాలకు అదిరిపోయే సంగీతం అందించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్(Pawan Kalyan), వెంకటేష్ (Venkatesh)వంటి స్టార్ హీరోల సినిమాలలో పాటలు పాడి మంచి పేరు దక్కించుకున్న ఈయన.. 2013 తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యారు.
వెంకటేష్ మూవీతో రీ ఎంట్రీ..
ప్రస్తుతం అమెరికాలో జాబ్ చేసుకుంటూ ఉండిపోయిన రమణ గోగుల.. మళ్లీ ఇన్నేళ్ళ తర్వాత వెంకటేష్ హీరోగా నటిస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో “గోదారి గట్టుమీద” పాట వాడి మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు.ఈ పాట ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.. ఈ చిత్రం దర్శకుడుఅనిల్ రావిపూడి(Anil Ravipudi)పట్టుబట్టి మరీ రమణ గోగులను ఇండియాకు రప్పించి ఈ పాట పాడించడం జరిగిందట. అంతేకాదు వెంకటేష్ మీద వున్న అభిమానంతో ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని సమాచారం. కేవలం తాను అమెరికా నుండి ఇండియాకి రావడానికి ఫ్లైట్ టికెట్లు అలాగే హోటల్లో స్టే చేయడానికి రూమ్ రెంట్ మాత్రమే నిర్మాత దిల్ రాజ్ (Dilraju)చెల్లించినట్లు తెలుస్తోంది.
ఒరిజినల్ గుండు కాదు..
ఈ క్రమంలోనే రమణ గోగుల పేరు తెలుగు ఇండస్ట్రీలో మరొకసారి గట్టిగా వినిపిస్తోంది. ఇదిలా ఉండగా పలు యూట్యూబ్ ఛానల్స్ కి కూడా ఆయన ఇంటర్వ్యూ ఇస్తున్నారు. అందులో భాగంగానే తన వ్యక్తిగత, కెరియర్ విషయాల్లో అలాగే ఇండస్ట్రీకి దూరం అవడం వంటి ఎన్నో విషయాలను మాట్లాడారు. ఇకపోతే ఇవన్నీ కాస్త పక్కన పెడితే.. తనది ఒరిజినల్ గుండు కాదని, ఎప్పటికప్పుడు జుట్టు వస్తుందని, కానీ దానిని తాను గీసేస్తున్నానని చెప్పడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు ఇలా చేయడం వెనక ఉన్న అసలు కారణాన్ని కూడా బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచారు రమణ గోగుల.
భార్య కోసమే ఇదంతా..
రమణ గోగుల మాట్లాడుతూ..”జానీ సినిమా చేస్తున్న సమయంలో నా భార్య గర్భవతి. డాక్టర్స్ డెలివరీ కష్టమన్నారు. అయితే ఇక దాని గురించి నేను ఆలోచిస్తూ ఆఫీస్ లో డల్ గా కూర్చుని ఉండగా.. మా కీబోర్డ్ ప్లేయర్ ఒకరు ఏంటి సార్ అలా ఉన్నారు? అంటూ అడిగాడు. దీంతో నేను అసలు విషయం చెప్పాను. ఇక ఆయన మీరేం ఆలోచించకుండా తిరుపతి వెళ్లి రండి సార్ అంత సెట్ అయిపోతుంది అని చెప్పారు. అంతే ఇక వెళ్లి అక్కడే నా జుట్టు మొత్తం దేవుడికి ఇచ్చేసి వచ్చాను. ఆ తర్వాత నా భార్యకు నార్మల్ డెలివరీ అయింది.. ఇక అప్పుడే నేను డిసైడ్ అయ్యాను ఇక జీవితంలో నేను నా జుట్టును పెంచుకోకూడదని” అంటూ రమణ గోగుల తెలిపారు. ప్రస్తుతం రమణ గోగుల చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా భార్య కోసం ఇంతటి త్యాగం చేశారా? అంటూ పలువురు నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు.