OTT Movie : క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకోవడానికి సమయం వచ్చేసింది. ఈ పండుగను చిన్న పిల్లలతో సహా కుటుంబం మొత్తం కలిసి ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న బెస్ట్ క్రిస్మస్ సినిమాలను చూస్తూ సెలబ్రేట్ చేసుకోండి. ఈ సినిమాలను చూస్తే మరింత జోష్ తో క్రిస్మస్ ని జరుపుకుంటారు. ఇదివరకు చూడకపోయినా, ఒకవేళ చూసినా ఈ సినిమాలను మళ్లీ చూడండి. మరి ఎందుకు ఆలస్యం ఈ సినిమాలు ఏ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకుందాం పదండి.
జింగిల్ ఆల్ ది వే (Jingle All The Way)
హోవార్డ్ పాత్రలో ఆర్నాల్డ్ అదరగొట్టాడు. క్రిస్మస్ ఈవ్‌లో తన కొడుకు కోసం టర్బో మ్యాన్ యాక్షన్ బొమ్మని తేవడానికి నానా తంటాలు పడతాడు. ఇతర తల్లిదండ్రులతో ఈ బొమ్మ కోసం పోటీ పడతాడు. ఈ బొమ్మ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ హాట్‌స్టార్ (Hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఎ క్రిస్మస్ ప్రిన్స్ (A Christmas Prince)
ఈ అమెరికన్ క్రిస్మస్ రొమాంటిక్ కామెడీ మూవీకి అలెక్స్ జామ్ దర్శకత్వం వహించారు. రోజ్ మెక్‌ఇవర్, బెన్ లాంబ్, టామ్ నైట్, సారా డగ్లస్, డేనియల్ ఫాదర్స్, ఆలిస్ క్రిగే ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ నవంబర్ 17,2017నుంచి ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది. సీక్వెల్ ఎ క్రిస్మస్ ప్రిన్స్: ది రాయల్ వెడ్డింగ్ 2018లో విడుదల అయింది.
హోమ్ అలోన్ (Home Alone)
1990లో వచ్చిన ఈ మూవీకి క్రిస్ కొలంబస్ దర్శకత్వం వహించారు. ఒక కుటుంబం అనుకోకుండా క్రిస్మస్ సెలవుల్లో ఒక పిల్లాడిని ఇంటోనే విడిచి పెడతారు. ఆ తర్వాత ఇద్దరు దొంగలు ఈ ఇంటిపై దాడి చేస్తారు. ఆ పిల్లాడు ఆ దొంగలను ఎదుర్కొనే స్టోరీతో మూవీ నడుస్తుంది.ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ హాట్‌స్టార్ (Hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.
కాండీ కేన్ లేన్ (Candy Cane Lane)
2023 లో వచ్చిన ఈ అమెరికన్ క్రిస్మస్ ఫాంటసీ కామెడీ మూవీకి రెజినాల్డ్ హడ్లిన్ దర్శకత్వం వహించారు.ఈ మూవీలో ఎడ్డీ మర్ఫీ, ట్రేసీ ఎల్లిస్ రాస్, జిలియన్ బెల్, థాడ్యూస్ J. మిక్సన్, కెన్ మారినో, ట్రెవాంటే రోడ్స్, డేవిడ్ అలాన్ గ్రియర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)లో స్ట్రీమింగ్ అవుతోంది.
ది పోలార్ ఎక్స్‌ప్రెస్ (The Polar Express)
ఒక యువకుడు శాంతా క్లాజ్‌ని కలవడానికి అసాధారణమైన సాహసయాత్రను ప్రారంభిస్తాడు. ఉత్తర ధ్రువానికి వెళ్లే మాయా రైలులో ప్రయాణం చేస్తాడు. దారిలో అతను తన ప్రయాణాన్ని మరచిపోలేని గొప్ప అనుభూతిని పొడుతాడు. ఈ యానిమేటెడ్ మూవీ చిన్న పిల్లలను బాగా ఎంటర్టైన్ చేస్తుంది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ జియోసినిమా (Jio cinema) లో స్ట్రీమింగ్ అవుతోంది.