
Shriya Saran (Image credit: Instagram)
శ్రియా శరణ్.. 43 సంవత్సరాల వయసులో కూడా ఇంకా అంతే అందంగా యవ్వనంగా కనిపిస్తూ అభిమానులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.

Shriya Saran (Image credit: Instagram)
ఇష్టం అనే సినిమా ద్వారా సినీ ప్రేక్షకులకు పరిచయమైన శ్రియ.. చెన్నకేశవరెడ్డి, సంతోషం, ఠాగూర్, నీకు నేను నాకు నువ్వు, నువ్వే నువ్వే, ఎలా చెప్పను, నేనున్నాను, నా అల్లుడు , అర్జున్, భగీరథ, మొగుడు పెళ్ళాం ఓ దొంగోడు, ఛత్రపతి , సోగ్గాడు, దేవదాసు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Shriya Saran (Image credit: Instagram)
ఒకవైపు హీరోయిన్గా మరొకవైపు పలు చిత్రాలలో స్పెషల్ పెర్ఫార్మన్స్ ఇచ్చి మరింత ఆకట్టుకున్న ఈమె పవిత్ర సినిమాలో ఒక వేశ్య పాత్ర పోషించి అందరిని ఆశ్చర్యపరిచింది.

Shriya Saran (Image credit: Instagram)
ఆ తర్వాత మనం, గోపాల గోపాల వంటి చిత్రాలు చేసి ఆకట్టుకున్న శ్రియా.. 2018 లో వివాహం కావడంతో ఇండస్ట్రీకి దూరమైంది.. కరోనా సమయంలోనే ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చింది కూడా..

Shriya Saran (Image credit: Instagram)
మళ్లీ ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన ఈమె.. గత ఏడాది మిరాయ్ సినిమాలో నటించి ఇటీవల తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇకపోతే ఈ మధ్యకాలంలో నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ గ్లామర్ వలకబోసే శ్రియ.. తాజాగా చీరకట్టులో అందాలు ఆరబోస్తూ మెస్మరైజ్ చేసింది.

Shriya Saran (Image credit: Instagram)
టాప్ అందాలతో సెగలు పుట్టించింది. ఏది ఏమైనా 43 సంవత్సరాల వయసులో కూడా ఇంత గ్లామర్ గా ఉండడం చూసి అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు.