Tamannaah: టాలీవుడ్ మిల్క్ బ్యూటీ ఎవరంటే ఠక్కున గుర్తుకొచ్చే హీరోయిన్ తమన్నా.

రెండు దశాబ్దాలుగా వెండితెర అభిమానులను అలరిస్తూనే ఉంది.

20 ఏళ్ల కిందట గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చిన ఈమె, ఇక వెనుదిరిగి చూడలేదు.

వచ్చిన అవకాశాలను అంది పుచ్చుకుంటూ అభిమానులకు మరింత దగ్గరైంది.

తొలుత యూత్‌ని ఆకట్టుకున్న తమన్నా, కేవలం క్లాస్ కాకుండా మాస్ అభిమానులను సైతం దగ్గరైంది.

రెండు దశాబ్దాలుగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ ఇలా అన్ని భాషా చిత్రాలు చేసింది.

హీరోయిన్‌గానే కాకుండా తన గ్లామర్‌ను వినియోగించుకుంది.. ఆపై స్పెషల్ సాంగ్స్ సైతం చేసింది.

ఒక్కముక్కలో చెప్పాలంటే తమన్నా గురించి తెలియని వారు ఉండరు.

అన్నట్లు మ్యారేజ్‌కి ఆమె రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమో తెలీదు.

కాకపోతే ఫోటోషూట్లు అంటే కాసింత వయ్యారాలను ఒలకబోస్తూ స్పైసీగా కనిపిస్తారు.

కానీ తమన్నా ఈసారి రూటు మార్చేసింది. ఆమె ఫోటోలపై ఓ లుక్కేద్దాం.