AP Politics – Pushpa 2: సినిమా అంటే వినోదం. ఆ వినోదానికి కూడా రాజకీయ రంగు పులుముకుంటోంది. పార్టీలు కూడా తమ హీరో అంటూ ఓన్ చేసుకుంటున్నాయి. ఏ దశలోనే పుష్ప – 2 సినిమా విడుదల కాగా, ఏపీ పాలిటిక్స్ మళ్లీ హీటెక్కాయి. పలుచోట్ల సినిమా విడుదల సంధర్భంగా ఏర్పాటు చేసిన ప్లెక్సీలు కూడా వివాదంగా మారాయి. ఇంతకు ఈ ఇష్యూకి స్క్రీన్ ప్లే ఎవరో కానీ, సక్సెస్ సాధించారని రాజకీయ విశ్లేషకుల అంచనా.
ఏపీ పాలిటిక్స్ ఎప్పుడూ ఏదో ఒక రీతిలో వార్తల్లో ఉంటాయి. తాజాగా హీరో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప – 2 విడుదల సంధర్భంగా వైసీపీ కాస్త దూకుడు పెంచిందని చెప్పవచ్చు. ఇప్పటికే కూటమిలో భాగమైన జనసేన అద్యక్షుడు పవన్ కళ్యాణ్ హీరోగా సక్సెస్ సాధించి పాలిటిక్స్ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే వైసీపీ మాత్రం ఛాన్స్ దొరికితే ఏదో ఒక హీరో ఓన్ చేసుకొనే ప్రయత్నాల్లో ఉందని పొలిటికల్ క్రిటిక్స్ టాక్. ఈ పరిస్థితుల్లో పుష్ప సినిమాను ప్రమోషన్స్ చేసే స్థాయికి పలువురు వైసీపీ నాయకులు వెళ్లారు.
పుష్ప – 2 సినిమా అన్ని థియేటర్లలో విడుదల కాగా, భారీ కలెక్షన్స్ సాధించిందని చెప్పవచ్చు. ఈ సినిమా చూసిన మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఏకంగా తన ట్విట్టర్ పేజీలో సినిమాపై స్పందించారు. Pushpa అంటే WildFire అనుకుంటివా కాదు “World Fire” అంటూ తన అభిప్రాయాన్ని ట్వీట్ చేశారు. అలాగే పలుచోట్ల జగన్ బొమ్మతో ప్లెక్సీలు కూడా రాష్ట్రవ్యాప్తంగా వెలిశాయి. మేమున్నాం మీ సినిమా చూస్తాం అంటూ వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా స్పీడ్ పెంచారు.
అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ రెండూ ఒకటే. కానీ వీరి మధ్య ఏ మేరకు విభేదాలు ఉన్నాయో లేవో కానీ, పుష్ప – 2 సినిమా పుణ్యమా అంటూ మెగా అభిమానులు, వైసీపీకి మధ్య సోషల్ మీడియా వార్ సాగుతోంది. పుష్ప – 2 సినిమా విడుదల సమయం నుండి వైసీపీకి చెందిన పలువురు సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగించారు.
Also Read: Sharmila on YS Jagan: జగన్ పై షర్మిళ ఫిర్యాదు.. ఆ సంగతి బయటకు చెప్పాలని డిమాండ్
అలాగే రిలీజ్ సంధర్భంగా పలు థియేటర్లలో జగన్, అల్లు అర్జున్ పోస్టర్స్ తో సందడి చేశారు. ఏదిఏమైనా సినిమా యూనిట్ ప్రమోషన్స్ కంటే, పాలిటిక్స్ తరహాలోనే అధికంగా సాగింది. అయితే పుష్ప – 2 సినిమా రిలీజ్ సమయంలో ఫ్యాన్స్ కి ఎవరు స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చేశారో కానీ వైసీపీ మాత్రం అనుకున్నది సాధించిందని టాక్. ఓ వైపు అసలు ఇవేమీ పట్టించుకోని రీతిలో మెగా అభిమానులు కూడా సినిమా చూసి తమ రివ్యూలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.