
Tripti Dimri Latest Pics (celebrity news today): రణబీర్ కపూర్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం యానిమల్.

ఈ మూవీలో జోయాగా నటించిన త్రిప్తి డిమ్రి.. ఈ సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయిందీ ఈ బ్యూటీ

ఇక ఈ సినిమాతో కొత్త నేషనల్ క్రష్ అంటూ నెటిజన్స్ పేరు కూడా పెట్టేసుకున్నారు.

యానిమల్ సినిమాతో ఫుల్ క్రేజీ, పాపులారిటీ సంపాదించుకుంది ఈ బ్యూటీ..

తాజాగా ఈ బ్యూటీ “బ్యాడ్ న్యూజ్” అంటూ ప్రేక్షకులను నవ్వించేందుకు సిద్ధమైంది. ఈ సినిమాలో విక్కీ కౌశల్, అమీ విర్క్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆనంద్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు.

జులై 19న విడుదవడానికి సిద్ధమవుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది.

యానిమల్ మూవీ తర్వాత ఈ బ్యూటీకి అవకాశాలు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఈ భామ విక్కీ విద్యా కా వో వాలా వీడియో, భూల్ భూలియా 3 లో నటిస్తుంది.

త్రిప్తి డిమ్రి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గర్వాల్ జన్మించింది. చిన్నప్పటి నుంచే నటనపై ఆశక్తి ఉండేది.

యానిమల్ మూవీ కంటే ముందు పోస్టర్ బాయ్స్, లైలా మజ్ను, బుల్ బుల్, ఖలా వంటి సినిమాలో నటించింది ఈ భామ. ఈ సినిమాలు హిట్ అవ్వక పోయినా నటనతో మంచి గుర్తింపు పొందింది.’

ఇక యానిమల్ సినిమాలో జోయాగా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అందులో నటించిన రష్మిక కంటే .. ఈ బ్యూటీకే కనెక్ట్ అయ్యారు యూత్.

త్రిప్తి సంతూర్ మామ్ కూడా.. అదేనండి సంతూర్ సోప్ మామ్
యాడ్స్ చాలా వచ్చాయి కదా.. అందులో ఒక యాడ్ లో నటించింది ఈ ముద్దుగుమ్మ.

మరో వైపు సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ వీలు కుదిరినప్పుడల్లా తన హాట్ హాట్ షూట్స్ తో కుర్రాళ్లను మైమరిపించేలా చేస్తుంది త్రిప్తి డిమ్రీ.

ప్రస్తుతం నెట్టింట ఈ బ్యూటీ ఫోటోలు ట్రెండింగ్ గా మారాయి.