Big Stories

Kavitha EC Custody : నేటితో ముగియనున్న కవిత కస్టడీ.. మరో మూడురోజులు పొడిగిస్తారా ?

- Advertisement -

Kavitha EC Custody (Today news Telugu): ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. మార్చి 15వ తేదీన ఆమెను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు 16న రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టి.. కస్టడీకి ఇవ్వాలని కోరారు. సుదీర్ఘ వాదనల తర్వాత.. వారంరోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతించింది. మార్చి 23వ తేదీ వరకూ విచారణ చేయవచ్చని.. తిరిగి ఆ రోజున న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలని న్యాయమూర్తి తెలిపారు.

- Advertisement -

వారంరోజులుగా కవితను విచారించిన ఈడీ కీలక విషయాలు రాబట్టినట్లు సమాచారం. మరోవైపు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత సుప్రీంకోర్టు దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం (మార్చి22) విచారణ చేసిన ధర్మాసనం.. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దానిపై ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచించింది.

కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణకు హాజరు కావాలని పలుమార్లు నోటీసులు జారీ చేసిన ఈడీ.. మార్చి 21న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసింది. శుక్రవారం ఆయన్ను కూడా కోర్టులో ప్రవేశపెట్టగా.. ఆరురోజులపాటు కస్టడీకి అనుమతించింది సుప్రీం. మార్చి 28 వరకూ ఆయన ఈడీ కస్టడీలోనే ఉండనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు కవితను కోర్టులో హాజరు పరచాల్సి ఉంది. ఈ క్రమంలో ఈడీ.. నేడు కవిత, కేజ్రీవాల్ ను కలిపి ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కవితను కోర్టులో హాజరు పరిచిన తర్వాత కస్టడీని పొడిగించాలని ఈడీ ధర్మాసనాన్ని కోరే ఛాన్స్ ఉంది. మరో మూడు రోజులు కవిత ఈడీ కస్టడీని న్యాయస్థానం పొడిగిస్తే.. కేజ్రీవాల్, కవితను కలిపి ప్రశ్నిస్తారు అధికారులు. వీరిద్దరినీ ఒకేసారి ప్రశ్నిస్తే.. మరిన్ని విషయాలు తెలిసే అవకాశాలున్నాయి. వారంరోజులు కవితను విచారించిన ఈడీ.. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో భారీగా మనీలాండరింగ్ జరిగినట్లు గుర్తించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News