E-Paper
Advertisement

Vaani Kapoor Fashion Pics: వాణి కపూర్ ఫ్యాషన్ పీక్స్.. రెట్రో లుక్స్‌తో కొత్త పిక్స్!

Vaani Kapoor Fashion Pics: వాణి కపూర్ ఫ్యాషన్ పీక్స్.. రెట్రో లుక్స్‌తో కొత్త పిక్స్!
Advertisement

బాలీవుడ్ లో టాప్ హీరోల సరసన జోడీ కడుతున్న వాణి కపూర్ 2013లో సినిమాలలో ఎంట్రీ ఇచ్చింది. ముఖ్యంగా ఆమె యశ్ రాజ్ ఫిల్మ్స్ సినిమాలలో మాత్రమే నటిస్తూ ఉంటుంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ బాలీవుడ్ లో అతిపెద్ద బ్యానర్.

Advertisement

హిందూ పంజాబీ ఫ్యామిలీలో జన్మించిన వాణి 2013లో వచ్చిన శుద్ధ్ దేశీ రొమాన్స్ చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. తొలి చిత్రానికే ఆమెకు ఫిల్మ్ ఫేర్ బెస్ట్ డెబూట్ ఫిమేల్ అవార్డ్ దక్కింది.

Advertisement

ఆమె రెండో చిత్రం కూడా ఆహా కల్యాణం 2014లో వచ్చింది. తెలుగులో హీరో నాని సరసన నటించిన పొడుగు కాళ్ల సుందరికి ఆ తరువాత పెద్దగా తెలుగులో ఆఫర్స్ రాలేదు. ఆహా కల్యాణం కూడా హిందీ సినిమా బ్యాండ్ బాజా బరాత్ కు రీమేక్. ఈ సినిమాకు కూడా యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది

ఆ తరువాత ఆమెకు రెండేళ్ల వరకు సినిమా అవకాశాలు రాలేదు. దీంతో అమె మళ్లీ యశ్ రాజ్ ఫిల్మ్స్ తలుపులే తట్టింది. అలా 2016లో రణ వీర్ సింగ్ సరసన బేఫిక్రేలో బోల్డ్ సీన్లలో కనిపించింది. కానీ ఈ సినిమా కూడా పరాజయం పాలైంది.

బేఫిక్రే తరువాత ఆమెకు మళ్లీ సినిమాలు కరువయ్యాయి. యశ్ రాజ్ ఫిల్మ్స్ అధినేత, ప్రముఖ డైరెక్టర్ ఆదిత్య చోప్రాతో అఫైర్ ఉందని రూమర్లు కూడా ఉన్నాయి. అందుకే మళ్లీ అదే బ్యానర్ లో సినిమా చేసింది. 2019 లో వచ్చిన హృతిక్ రోషన్ యాక్షన్ సినిమా వార్ లో ఓ గెస్ట్ రోల్ చేసింది. ఈ సినిమాలో హృతిక్ ప్రియురాలి పాత్రలో వాణి కనిపించింది.

ఈ సినిమాలన్నీ ఒక ఎత్తు వాణీ కపూర్ నటించిన చండీగడ్ కరే ఆషికీ ఒక ఎత్తు. 2021లో విడుదలైన ఈ సినిమాలో వాణి ఒక ట్రాన్స్ జెండర్ పాత్ర పోషించింది. ఒక అబ్బాయిగా పుట్టి ఆ తరువాత ఆపరేషన్ చేయించుకొని అమ్మాయిగా మారిన వ్యక్తితో హీరో ప్రేమలో పడతాడు. ఈ సినిమాలో వాణి నటనకు విమర్శకులు ప్రశంసించారు.

 

ఆ తరువాత వాణి కపూర్ 2022లో యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన షంషేరా చిత్రంలో గ్లామర్ పాత్ర పోషించింది. బందిపోటు హీరోగా రణ్ బీర్ కపూర్ నటించిన ఈ సినిమాలో అతనితో శృంగార సన్నివేశాలలో మెరిసింది. తాజాగా 2024లో ఆమె టి సిరీస్ నిర్మించిన ఖేల్ ఖేల్ మే చిత్రంలో అక్షయ్ కుమార్ సరసన నటించింది.

Related News

సీఎంపై ప‌రువు న‌ష్టం దావా! అఘోర పూజ‌ల‌పై స్పందించిన హ‌రీశ్‌… శిక్షలు త‌ప్ప‌వు కాస్కోండి!

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Big Stories

Advertisement
×