BigTV English

The GOAT Trailer: విజయ్ గోట్ ట్రైలర్.. ఇచ్చిపడేశాడు అంతే

The GOAT Trailer: విజయ్ గోట్ ట్రైలర్.. ఇచ్చిపడేశాడు అంతే

The GOAT Trailer: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ది గోట్. AGS ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై కల్పాతి ఎస్ అఘోరం, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ తండ్రీకొడుకులుగా కనిపించనున్నాడు. ఇక ఇందులో విజయ్ సరసన స్నేహ, మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు.


ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎప్పటినుంచో గోట్ ట్రైలర్ కోసం అభిమానులు ఎదురుచూస్తుండగా.. మేకర్స్ కొద్దిసేపటి క్రితమే ట్రైలర్ ను రిలీజ్ చేసి.. ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో విజయ్.. గాంధీ అనే స్పై గా కనిపిస్తున్నాడు.

68 ఇంటర్ నేషనల్ ఆపరేషన్స్, హోస్టేజ్ నెగోషియేటర్, ఫీల్డ్ ఏజెంట్.. స్పై అని విజయ్ గురించిన ఎలివేషన్ అదిరిపోయింది. ఇంకోపక్క యాక్షన్ మోడ్ లో విజయ్ ఫైట్స్ నెక్ట్ లెవెల్ లో ఉంది. చూచాయగా కథ చెప్పాలంటే.. ఒకప్పుడు స్పై గా పనిచేసిన గాంధీ.. చాలాకాలం తరువాత ఒక ఆపరేషన్ చేయాల్సి వస్తే.. దానికి కొడుకు కూడా హెల్ప్ చేస్తే.. అదే ది గోట్ సినిమా.


ఇక ఇందులో తండ్రి విజయ్ బావున్నాడు కానీ, కొడుకు విజయ్ ను చూడడం చాలా కష్టంగా ఉంది. AI ద్వారా విజయ్ చిన్నప్పటి రూపాన్నీ కూడా ఇందులో చూపించారు. కానీ, అది బెడిసి కొట్టేలా ఉంది. ఇప్పటికే కొడుకు విజయ్ కు సంబంధించిన సాంగ్ రిలీజ్ అయ్యి ట్రోల్స్ బారిన పడిన విషయం తెల్సిందే. ఇక  స్టార్ క్యాస్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. స్పైలుగా ప్రభుదేవా, ప్రశాంత్ కనిపించారు. స్నేహ.. విజయ్ కు తల్లిగా కనిపించింది.

ఇక సినిమాకు హైలైట్ అంటే యువన్ శంకర్ రాజా మ్యూజిక్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే గూస్ బంప్స్ అని చెప్పాలి. మొత్తానికి ట్రైలర్ తోనే వెంకట్ ప్రభు ప్రేక్షకులను మెప్పించాడు. ఇకపోతే ఈ సినిమా సెప్టెంబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో విజయ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×