E-Paper
Advertisement

ఓపిక ప‌డితే అక్క‌డ ప‌ద‌వులు.. సీనియారిటీకి విలువ‌! మ‌రిక్క‌డ‌..? నిజంగా ఆ పార్టే న‌య‌మ‌న్నా!

ఓపిక ప‌డితే అక్క‌డ ప‌ద‌వులు.. సీనియారిటీకి విలువ‌! మ‌రిక్క‌డ‌..? నిజంగా ఆ పార్టే న‌య‌మ‌న్నా!
Advertisement

నిజంగా ఆ పార్టే న‌య‌మ‌న్నా! ఉన్న‌ప‌ళంగా మాట‌ల మ‌ధ్య‌లో అన్య‌ప‌దేశంగా ఆ మాట‌నేశాడు రాజు.

ఏ పార్టీ ఎందుకు? అర్థంకాక అయోమ‌యంగా అడిగిన‌.

Advertisement

అదే అన్నా..? ఆ కాంగ్రెస్ పార్టీ! అన్నాడు రాజు.

ఎప్పుడూ కాంగ్రెస్‌ను తిట్టేటోడు.. ఒక్క‌సారిగా ఈ ప్రేమోందో? అని అనుకున్న‌. క‌రెక్టుగా నా మ‌న‌స్సులోని భావం గ్ర‌హించిన వాడిలా…

Advertisement

ఈ బీఆరెస్ పార్టీల ఇన్ని రోజులున్న‌మ‌న్న .. ఎవ‌డ‌న్న ప‌ట్టించుకుండా? స‌మాధాన‌మూ, ప్ర‌శ్న రెండూ అందులోనే ఉన్నాయ‌నిపించింది.

ఆ జాతీయ పార్టీలే బెట‌ర‌న్నా..! సీనియారిటీకి విలువిస్త‌రు… అన్నాడు ఆవేద‌న కూడిన గొంతుతో.

జాతీయ పార్టీ అంటే.. బీజేపీ కాద‌న్నో.. కాంగ్రెస్సే! క్లారిటీ ఇచ్చిన‌ట్టుగా చెప్పాడు.

ఎందుకు కేసీఆర్ ఇయ్య‌లేదా.. సీనియ‌ర్ల‌కు ప‌ద‌వులు… మ‌ర్యాద‌..? ఆ మాట‌కు అవ‌త‌ల నుంచి ఎలాంటి స‌మాధాన‌మొస్తుందో తెలుసు… అయినా అడిగిన‌

చూస్తున్న‌వ్ క‌ద‌న్నా! ఇన్నేండ్లైంది. పోరాడుత‌నే ఉన్నం. ఉద్య‌మంలో జైళ్ల‌కు పోయినం.. కుటుంబాల‌ను రోడ్డున ప‌డేసుకున్నం.. ఎవ‌డ‌న్నా ప‌ట్టించుకుండా… ఆవేశం క‌ట్ట‌లు తెంచుకున్న‌ట్టే అనిపించింది.

ఆ ఆవేశానికి బ్రేకులు వేస్తూ..

మ‌రి కాంగ్రెస్‌లో అంత మంది లైన్ల‌లో ఉన్న‌రు క‌దా.. ! అంద‌రికీ న్యాయం జ‌రిగిందా?

టాపిక్ మార్చితేనే బెట‌ర‌నుకున్న‌. లేక‌పోతే త‌న పాత చరిత్రంతా ఇప్పుడు వినే ఓపిక లేదు నాకు.

అన్నా అందులో లేటైనా .. క‌నీసం ఏదో ఒక రోజు గుర్తిస్తారు.. ఏదో ఒక ప‌ద‌వి ఇస్తార‌నే న‌మ్మ‌కం ఉందన్న వాళ్ల‌కు..! త‌న వాద‌న త‌న‌ది. ఏమాత్రం త‌గ్గ‌డం లేదు.

గా వీహెచ్‌కు ప‌ద‌వి ఇచ్చిండ్రు ఇయ్యాల సూశ్న‌వా? త‌న మాట‌కు ఆధారం.. ఇదే అన్న‌ట్టుగా ఉందా ప్ర‌శ్న‌.

నేను మౌనంగానే ఉన్నా. వింటున్నా..

మ‌హేశ్ గౌడ్‌ను చూడ‌న్నా… ఓపిక ప‌ట్టిండు.. పార్టీనే న‌మ్ముకుండు.. ఇప్పుడేడున్న‌డో చూశిన‌వా? అత‌ను చెప్పేది టీపీసీసీ చీఫ్ గురించి అని అర్థ‌మైంది.

అవును..! అన్నాను… నిజ‌మే క‌దా అన్న‌ట్టు.

ఇక్క‌డ ఎంత ఓపిగ్గా ఉన్నా.. అది మ‌న చేత‌గానిత‌న‌మనుకుంట‌రేమో…! వీడు ఏడికి పోడు.. మ‌న దొడ్లే క‌ట్టేసిన బ‌ర్రెనే అని చీప్‌గా చూస్త‌రేమో.. !

ఇంకో పార్టీల‌కెళ్లి వ‌చ్చినోడికి వెంట‌నే ప‌ద‌వులిస్తారు..! అది మ‌న పార్టీ బాగు కోస‌మేన‌ని మ‌నం చూడాలంతే..! మాట్లాడుత‌నే ఉన్న‌డు.

అందుకే అసంతృప్తి ఎక్కువైంద‌న్నా… ఎంత‌కాలం ఓపిక ప‌డ‌తం..! ఇంత జ‌రిగినా ఇంక మేల్కొంట‌రేమోన‌ని ఆశ‌! పార్టీ మారే ఉద్దేశం ఉన్న‌దా ? లేదా? క్లారిటీ ఇవ్వ‌కుండా మాట్లాడుతున్నాడు.

అంద‌రినీ ప‌ట్టించుకోని ఏదో ఒక ప‌ద‌విచ్చి.. గుర్తిస్తే.. గిప్పుడీ ప‌రిస్థితి వ‌చ్చేదానే..?

ఇగ ఇది ఇప్ప‌ట్ల ఒడిసేట‌ట్టు లేద‌ని. ఎవ‌రో ఫోన్ చేస్తున్న‌రే.. మ‌ళ్లీ చేస్తా… స‌రేనా?

నేను ఫోన్ క‌ట్ చేయ‌క‌ముందే.. అక్క‌డ ఫోన్ క‌ట్ అయ్యింది. త‌న ఆవేద‌న విన‌డానికి కూడా ఓపిక లేదా? అన్న‌ట్టుగా నాకు అనిపించింది.

Related News

ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

తెలంగాణ బీజేపీ గతిని మార్చేలా రంగంలోకి ఆ ఇద్దరు! బెంగాల్‌ మాస్టర్‌ మైండ్‌ సునీల్‌ బన్సాల్‌పై భారీ అంచనాలు! కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ నిర్ణయాలకు ఇక చెల్లుచీటి?

ఒక్కరోజు బాగోతానికి మూతిమీసాలు పెంచుకున్నాడు..! కేసీఆర్‌ ఎక్కడికో తీసుకుపోవాలనుకుంటాడు.. ! కానీ ఇతడు ఇక్కడ్నే ఉంటాడు..!

అన్నా హజారేలా తెరమరుగు కాకుండా! రాజకీయ పార్టీగా మారబోమని ప్రకటించిన సీజేపీ! నైతిక విశ్వసనీయతే ఊతంగా..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

Big Stories

Advertisement
×