E-Paper
Advertisement

బీఆర్‌ఎస్‌కు గుదిబండలా సీఎంగా కేటీఆర్‌! ఇటీవల తీవ్రంగా ప్రచారం చేస్తున్న పొలిటికల్ సర్కిల్స్‌…!

బీఆర్‌ఎస్‌కు గుదిబండలా సీఎంగా కేటీఆర్‌! ఇటీవల తీవ్రంగా ప్రచారం చేస్తున్న పొలిటికల్ సర్కిల్స్‌…!
Advertisement

కేసీఆర్‌ను సీఎం కావాలని కోరుకుంటున్నారని బీఆరెస్‌ నేతలు ఇటీవల విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఆయనను ఓడగొట్టుకుని చాలా తప్పుచేశామని జనం పశ్చాత్తాపపడుతున్నారని కూడా చెప్పుకుంటున్నారు. కేటీఆర్‌ అయితే.. ఏకంగా రోజులు లెక్కబెట్టుకుంటున్నాడు. కాంగ్రెస్‌కు కౌంట్‌ డౌన్‌ స్టార్ట్ అయ్యిందని, మరో 500 రోజులు గడిస్తే చాలు.. ఇక మనమే వస్తున్నాం.. కేసీఆర్‌ మళ్లీ సీఎం కాబోతున్నారని చెబుతూ వస్తున్నారు.

కవిత ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కేసీఆర్‌ పేరును చెప్పి ఓట్లడుగుతున్న బీఆర్‌ఎస్.. కేటీఆర్‌ను సీఎం చేయాలనే వ్యూహాన్ని అమలు చేస్తున్నదని కామెంట్ చేశారు. ఒకవేళ కేసీఆర్‌ ముఖం చూసి జనం ఓట్లేసినా.. ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఓ మూడు నెలలకు మించి కేసీఆర్‌ సీఎంగా ఉండరని ఆమె తేల్చి చెప్పారు. వెంటనే కేటీఆర్‌ను సీఎం చేస్తారని, దీని కోసమే అంతా కాచుకు కూర్చున్నారని ఆమె కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పడం పొలిటికల్‌ సర్కిళ్లల్లో మళ్లీ కొత్త చర్చకు తెర తీసింది.

Advertisement

గతంలో పదేండ్ల కాలంలో కూడా కేసీఆర్ చాలా సార్లు కేటీఆర్‌ను సీఎం చేయాలని ప్రయత్నం చేశారని అంటారు. రెండో టర్ము టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే ఈ ప్రయత్నాన్ని కేసీఆర్‌ ముమ్మరం చేశారని చెబుతారు. ముహూర్తం చాలా సార్లు ఖరారు చేసుకున్నా.. ఏదో ఒక ఆటంకం రావడం కేసీఆర్‌ వెనక్కి తగ్గడం జరిగిపోయాయి. అసలు కేటీఆర్‌కు రాష్ట్రం అప్పగించేందుకే కేసీఆర్‌ దేశ్‌ కీ నేత అవతారం ఎత్తారనే ప్రచారమూ జరిగింది.

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆయన బయలుదేరడం, టీఆరెస్‌ పార్టీని బీఆరెస్‌గా నామకరణం చేసి. అన్ని రాష్ట్రాల నేతలకు కలుస్తూ థర్డ్‌ ఫ్రంట్‌కు జీవం పోసే చర్యలు చేయడం వెనుక ఇదే వ్యూహంలో భాగమంటారు. కానీ అది బెడిసి కొట్టింది. కేసీఆర్‌ను సీఎం చేయాలని అనుకున్నాం కానీ, ఇలా దేశాలు పట్టుకు తిరిగితే మాకు ఒరిగేదేముంది? అప్పుడే తెలంగాణ అంతా బాగుపడిందా? అనే ప్రశ్న జనాల్లో వచ్చింది.

Advertisement

దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు ప్రవేశపెట్టిన దళితబంధు లాంటి పథకం కూడా బెడిసి కొట్టింది.అంటే కొడుకు కోసం ఆయన వేసిన ప్రతీ అడుగు.. అప్పటి దాకా బలంగా నిలబడిన పార్టీని డ్యామేజీ చేయడంతో పాటు.. ప్రభుత్వాన్ని కూడా పతనం వైపు తీసుకెళ్లిందనడంలో అతిశయోక్తి లేదంటున్నారు. అలా దెబ్బతిన్న ఆ పార్టీ ఇప్పటి వరకు తమ లోపాలపై పశ్చాత్తాపం ప్రకటించకపోగా.. తమను ఓడగొట్టి జనం తప్పు చేశారు.. అనుభవిస్తున్నారు.. అనే విధంగానే కామెంట్‌ చేస్తూ వస్తోందనే విమర్శలున్నాయి.

ప్రధానంగా కేటీఆర్‌ నోటి వెంట ఇలాంటి మాటలు పదే పదే బహిరంగ వేదికల మీదే రావడం రాజకీయంగా చర్చకు వస్తున్నాయి. ఇది సరిపోదంటూ ఇటీవల కేటీఆర్‌ మళ్లీ జాతీయ రాజకీయాల గురించి కామెంట్ చేశారు. కేసీఆర్‌ మళ్లీ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతారు.. థర్ట్ ఫ్రంట్‌కు దేశ రాజకీయాల్లో మంచి స్పేస్‌ ఉందనే విధంగా ఆయన కామెంట్ చేయడం మళ్లీ కొత్త చర్చకు తెర తీసింది. ఓ సారి ఈ ప్రయోగం చేసి చేతులు కాల్చుకున్న బీఆరెస్‌ పార్టీ.. మళ్లీ అదే తప్పిదం తెలిసి చేస్తుందా? లేక ఇది వ్యూహాత్మకమా? అనే చర్చ జరిగింది.

ఇది మరిచిపోకముందే కవిత తాజాగా మళ్లీ కేటీఆర్‌ను సీఎం చేయాలనే కేసీఆర్‌ పేరు వాడుకుంటున్నారని అనడంతో .. ఇప్పుడు ఆ పార్టీలో ఎవరు ముఖ్యమంత్రి అనే చర్చ మొదలైంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేటీఆర్‌ను సీఎంచేస్తారు.. అనే మెసేజ్‌ ఎంత బలంగా జనాల్లోకి వెళితే పార్టీకి బాగా డ్యామేజీ జరుగుతుందనే భావనలో ఆపార్టీ ఉంది. అందుకే అది ఎక్కడా బయట ప్రొజెక్టు కాకుండా కేసీఆర్‌ జాగ్రత్త పడుతున్నారంటున్నారు.

మళ్లీ కేసీఆర్ సీఎం.. అనే నినాదమే బలంగా జనాల్లోకి వెళ్లడం ద్వారా .. ఆయనపై సానుభూతిని ఓటు రూపకంగా మార్చుకోవాలనే ఎత్తుగడను ఆ పార్టీ అనుసరిస్తోంది. కానీ కవిత దీన్ని బద్దలు కొడుతున్నారు. చెల్లెను కాపాడుకోలేని ఫెయిల్యూర్‌ అన్న.. రాష్ట్రాన్ని ఏం పాలిస్తారని విమర్శిస్తూనే ఇంకా అహంకారపు మాటలే మాట్లాడుతున్నారు తప్ప.. తమ తప్పిదాలను ఏనాడూ తెలుసుకోలేకపోయారని, పశ్చాత్తాపం లేదని కూడా ఆమె విమర్శలు గుప్పిస్తున్నారు.

దేశ్‌కీ నేత అవతారం ఎంతగా డ్యామేజీ చేసిందో.. కేటీఆర్‌ను సీఎం చేయనున్నారు .. అనే ప్రచారం కూడా అంతే డ్యామేజీ చేస్తుందనే భావన ఉంది పొలిటికల్‌ సర్కిళ్లలో. అందుకే దీన్ని జనంలోకి బాగా తీసుకుపోవాలనే వ్యూహాన్ని ప్రత్యర్థి పార్టీలు అమలు చేసేలా కనిపిస్తున్నాయంటున్నారు.

Tags

Related News

జెన్సన్ హువాంగ్ రీ-అపాయింట్మెంట్.. ఎన్విడియా బోర్డు నిర్ణయం వెనుక ట్రంప్, మస్క్ పాత్ర ఏంటి?

తెలంగాణలో బీజేపీకి షాకింగ్ న్యూస్.. పార్టీకి ఆ కీలక నేతలు దూరం..?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాకింగ్ న్యూస్.. బీఆర్ఎస్ సంచలన వ్యూహం?

ఇందూరులో ఉన్నది అర్వింద్‌ బీజేపీ! ఇ ఇద్దరు ఎమ్మెల్యేల బహిష్కరణ..! ఎంపీతో ఎమ్మెల్యేల ఎడముఖం పెడముఖం!

తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి వర్సెస్ ఎంపీ వార్.. నలుగురు నేతలు సస్పెండ్?

జీహెచ్ఎంసీలో జీఐఎస్ సర్వేకు బ్రేక్.. ఆ రూ. 22 కోట్లు ఏమైనట్టు?

దేశవ్యాప్తంగా బీజేపీ ‘సేవా దూత్’ ప్రచారం.. చేయబోయే కార్యక్రమాలివే?

Big Stories

Advertisement
×