E-Paper
Advertisement

సీఎం రేవంత్ రెడ్డి తీరుతోనే ఏపీ జలదోపిడీ! నాగార్జున సాగర్ పై ఏపీ అక్రమ ప్రాజెక్టును వారం రోజుల్లోగా నిలిపి వేయించాలి!వేలాది మందితో సాగర్ డ్యామ్ ను ముట్టడిస్తాం

సీఎం రేవంత్ రెడ్డి తీరుతోనే ఏపీ జలదోపిడీ! నాగార్జున సాగర్ పై ఏపీ అక్రమ ప్రాజెక్టును వారం రోజుల్లోగా నిలిపి వేయించాలి!వేలాది మందితో సాగర్ డ్యామ్ ను ముట్టడిస్తాం
Advertisement

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీరుతోనే ఏపీ జలదోపిడీకి పాల్పడుతోందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. శనివారం ఈమేరకు వీడియో సందేశం రిలీజ్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబును పిలిచి ప్రజాభవన్ లో కాళ్లు కడిగి గురుదక్షిణగా మన నీళ్లను అప్పగించారని తెలిపారు. రేవంత్ రెడ్డి ఆమోదంతోనే చంద్రబాబు పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్టును చేపట్టారని తెలిపారు.

రేవంత్ రెడ్డి అన్ని రకాల ప్రొటోకాల్స్ ను విస్మరించి పని చేస్తున్నారని, ఫలితంగా రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జలవివాదాలపై అపెక్స్ కౌన్సిల్ సమావేశం కోసం డిమాండ్ చేయకుండా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో అన్ అఫీషియల్ మీటింగ్ కు వెళ్లి పోలవరం – బనకచర్లకు ఒప్పుకొని వచ్చారని తెలిపారు.

Advertisement

రేవంత్ రెడ్డి అడ్డుకోలేడనే ధైర్యంతోనే ఏపీ ప్రభుత్వం తాగు నీటి పేరుతో నాగార్జున సాగర్ నీళ్లకు గండికొడుతోందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు ఎంతటి జలదోపిడీకి పాల్పడ్డాయో తెలంగాణ ప్రజల కళ్ల ముందర ఉందన్నారు. తాగునీరు పేరుతో శ్రీశైలం ప్రాజెక్టుపై పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నిర్మించి ఇప్పుడు మొత్తం రిజర్వాయర్ నే మళ్లించుకునే స్థాయిలో పనులు చేసుకున్నారని గుర్తు చేశారు.

ఇప్పుడు నాగార్జున సాగర్ పై ఏపీ కన్ను పడిందని.. ఇప్పటికే తాగునీటి కోసం 2.8 టీఎంసీలను తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ లిఫ్ట్ పేరుతో మరో 1.8 టీఎంసీలను తరలించేందుకు రంగం సిద్ధం చేశారని అన్నారు. తాగునీటి పేరు చెప్పి ప్రాజెక్టులు మొదలు పెట్టి మొత్తం రిజర్వాయర్ లోని నీటిని ఎత్తుకుపోవడం ఏపీ నైజం అన్న సంగతి మనందరికి తెలుసన్నారు.

Advertisement

ఏపీ ప్రభుత్వం 9 నెలలుగా అక్రమ ప్రాజెక్టు నిర్మిస్తుంటే తెలంగాణ ప్రభుత్వానికి కనీస సమాచారం లేదు అనే వాదనను ఎలా నమ్మాలని ప్రశ్నించారు. ఎక్కడ ఏం జరిగినా ఇంటెలిజెన్స్ ముఖ్యమంత్రిని అలర్ట్ చేస్తుందని.. దురదృష్టవశాత్తు రాష్ట్రం హోం శాఖ బాధ్యతలు కూడా చూస్తున్న రేవంత్ రెడ్డికి ఏపీ అక్రమ ప్రాజెక్టు గురించి తెలియక పోవడం అనేక సందేహాలకు తావిస్తోందన్నారు. నిజంగానే సమాచారం తెలియదా? తెలిసినా తన సమ్మతితోనే ప్రాజెక్టు చేపట్టింది కాబట్టి మౌనంగా ఉన్నారనే విషయంలో క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

బీజేపీకి తెలంగాణ ఓట్లు.. సీట్లు కావాలి తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా అని ప్రశ్నించారు. అన్ని అంశాలపై స్పందించే ఎంపీ రఘునందన్ రావు, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఏపీ అక్రమ ప్రాజెక్టుపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఏపీలో బీజేపీకి టీడీపీతో పొత్తు ఉంది కాబట్టి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతారా అని నిలదీశారు. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు వెంటనే ప్రధాని వద్దకు వెళ్లి ఏపీ అక్రమ ప్రాజెక్టును నిలిపి వేయించాలని.. ఆ ప్రాజెక్టుకు కేంద్రం 50 శాతం నిధులు జల్ జీవన్ మిషన్ నుంచి ఇవ్వకుండా అడ్డుకోవాలని సూచించారు.

ఏపీ అక్రమ ప్రాజెక్టును ఆపాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలదేనని స్పష్టం చేశారు. వారం రోజుల్లోగా ఏపీ అక్రమ ప్రాజెక్టును నిలిపి వేయించకుంటే వేలాది మంది ప్రజలతో నాగార్జున సాగర్ డ్యాంను ముట్టడిస్తామని.. అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు.

Tags

Related News

నిజామాబాద్‌లో నితిన్‌ నబీన్‌ పాదయాత్ర రద్దు! బండి సంజయ్‌ ప్రకటించిన తేదీనే అర్వింద్‌ కూడా! ‘బండి’కే ఓటేసిన అధిష్టానం..!

కాంగ్రెస్‌ పెంచిన పింఛన్లపై విమర్శలు! పాతవి తొలగించి కొత్తవి ఇచ్చారని ప్రచారం..! కేసీఆర్‌ వస్తే 4వేలు ఇచ్చేవారని కామెంట్స్‌..!

పెనం మీద నుంచి పొయ్యిలోకి నిజామాబాద్‌ జిల్లా బీఆర్‌ఎస్‌! నేతల తీరుతో అధిష్టానానికి తలవంపులు..! మాజీ మంత్రి కామెంట్స్‌తో తీవ్ర చర్చ

జెన్‌జీని తక్కువ అంచనా వేశా! జంతర్‌ మంతర్‌ తరువాత వారి శక్తిని కళ్లారా చూసినా..! నేతలెవరూ వారితో పెట్టుకోవద్దని తెలుసుకున్నా!

నా పాలనకు వందకు 60 మార్కులు.. రెండేళ్లలో మరిన్ని మార్కులు సాధిస్తానని నమ్మకం ఉంది..! సంక్షేమ పథకాలపై చర్చోపచర్చలు!

మాటకు మాట.. సీఎం సభ తరువాత ఆ ఇద్దరూ స్పందిస్తున్న వైనం..! కలిసి తిప్పికొట్టే వ్యూహంతో ముందుకు..!

ఇందిర చీరకట్టుకు ఓ లెక్కుంది.. ప్రతి ‘శారీ’ ఒక సందేశం!

Big Stories

Advertisement
×