E-Paper
Advertisement

లెక్కలేని తిక్కుంది..కానీ దానికో కిక్కుంది! ప‌వ‌న్ స్వ‌యంకృతాప‌రాధం! ఇదో తిక్క రాజ‌కీయ వ్యూహం!

లెక్కలేని తిక్కుంది..కానీ దానికో కిక్కుంది! ప‌వ‌న్ స్వ‌యంకృతాప‌రాధం! ఇదో తిక్క రాజ‌కీయ వ్యూహం!
Advertisement

నాకు కొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది! ఇది ప‌వ‌న్ సినిమా ఫేమ‌స్ డైలాగ్‌. ఇంకో డైలాగ్ కూడా ఉందండోయ్‌.. లాస్ట్ పంచ్ మ‌న‌దైతే దానికొచ్చే కిక్కే వేర‌ప్పా.. ఈ రెండూ త‌న‌కు అటూఇటూగా నిజ జీవితంలో కూడా క‌రెక్టుగానే న‌ప్పుతాయి. కానీ కొంచెం తిక్క కాదు.. లెక్క‌లేనంత తిక్క‌. ఆ తిక్క ఆలోచ‌న‌ల‌తో జ‌రిగే ర‌చ్చ‌తో లెక్క‌లేనంత కిక్కు వ‌స్తుంద‌నుకుంటాడు ప‌వ‌న్‌. అచ్చంగా ఇప్పుడు రాజ‌కీయంగా చేసే చ‌ర్య‌లు అట్ల‌నే ఉంటున్నాయి. మొన్న‌టిదాకా ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ విష‌యంలో గోటితో పోయేదాన్ని గొడ్డ‌లిదాకా తెచ్చుకున్నాడు. మ‌ధ్య‌లో తెలంగాణ వాదాన్ని త‌ట్టిలేపాడు. తెలంగాణ స‌మాజం త‌మ ప‌ని తాను సైలెంట్ చేసుకుంటూ పోతుంటే.. ఇలా వారిని కెలికి మ‌రీ క‌య్యం పెట్టేలా.. త‌న‌ను బూతులు తిట్టేలా చేసుకున్నాడు. ఇదంతా ప‌వ‌న్ స్వ‌యంకృతాప‌రాధం.

దీన్ని ఇరుప‌క్షాలు ఇకచాలు అని అనుకున్నా.. ఆ వివాదం ఆగ‌డం లేదు. అంతటి తిక్క మ‌న ప‌వ‌న్ సొంతం. ఆ తిక్క చేసే ర‌చ్చ అత‌నికి న‌ష్టాన్ని, ఇత‌రుల‌కు లాభాన్ని చేసి పెడుతున్న‌ది. ఓ సినిమాలో వేణుమాధ‌వ్ పాత్ర ఉంటుంది.. ముఖానికి ఎప్పుడూ ఏదో ఒక గాయంతో క‌ట్టుకుని ఉంటాడు. ఏమైంద‌ని అడిగితే ఏదో యాక్సిడెంట్.. దెబ్బ త‌గిలింది లే అంటుంటాడు. ఏ దెబ్బ లేన‌ప్పుడు త‌న చేత‌ల ద్వారానో, మాట‌ల ద్వారానో ఏదో ఒక‌టి వాగి ఎవ‌రిచేత‌నో దెబ్బ‌లు తిని.. మ‌ళ్లీ క‌ట్టు క‌ట్టించుకుంటాడు. ఇదీ ఆ పాత్ర తీరు. రాజ‌కీయ పాత్ర‌లో మ‌న హీరోగారి పాత్ర కూడా ఇలాగే ..త‌గుదున‌మ్మా అని ఏదో ఒక దాంట్లో వేలు పెట్టి విమర్శ‌ల పాల‌వుతూ ఉంటాడు. తిట్లు ప‌డుతూ ఉంటాడు.

Advertisement

కానీ అందులో కిక్కు త‌ను ఒక్క‌డే అనుభ‌విస్తాడు కాబోలు. అందుకే ఇలాంటి వివాదస్ప‌ద విష‌యాల్లో ఏరికొరి మ‌రీ దూరుతూ ఉంటాడు. ఇప్పుడు మ‌నం చ‌ర్చించుకోబోయేది ఆయ‌న రేపు తెలంగాణ‌లో ఏర్పాటు చేయ‌బోయే న‌వ నిర్మాణ సంక‌ల్ప స‌భ.. గురించి. రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వం. కావాల‌ని ఈ స‌భ‌ను ఆరోజునే ఎంచుకుని క‌య్యానికి కాలుదువ్వే చ‌ర్య కాక‌పోతే ఇది మ‌రేంటి? అందుకే తిట్ల దండ‌కం మొద‌లైంది తెలంగాణ నేత‌ల నుంచి. వివిధ పార్టీల నుంచి. తెలంగాణ ప్ర‌జా సంఘాల నుంచి. బ‌హుశా ప‌వ‌న్ కూడా ఇదే ఆశించి ఉంటాడేమో. ముందు మీ రాజ‌ధానిని స‌క్క‌గా చూసుకోపోవోయ్‌… పెద్ద చెప్పొచ్చావ్ లే మాకు..! అంటూ వెట‌కారంతో కూడిన వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారంతా.

తెలంగాణ స‌ర్కార్ నుంచి కూడా దీనిపై ఎదురుదాడి మొద‌లైంది. మంత్రి పొన్నం..ప‌వ‌న్‌ గ‌తం అంతా త‌వ్వాడు. తెలంగాణ వ‌చ్చిన రోజు 11 రోజులు అన్న‌మే ముట్ట‌లేద‌న్నావ్‌.. మా చూపులు ప‌డితే కోన‌సీమ కొబ్బ‌రి తోట‌లు ఎండిపోతాయ‌న్నావ్‌.. ముందు క్ష‌మాప‌ణ చెప్పు.. అయినా మా తెలంగాణ ఆవిర్భావం వేళ నీ కిష్కింధ కాండ షోలేమిటోయ్‌..! అని అర్సుకున్నాడు. కవితైతే ఏకంగా మీ ఆంధ్ర విగ్ర‌హాల‌న్నీ క‌ట్ట‌గ‌ట్టి ఏపీకి పంపుతాం బిడ్డా అని వార్నింగ్ ఇవ్వ‌డ‌మే కాదు.. ఇక్క‌డున్న సెటిల‌ర్లు మావోళ్లు.. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల కోసం పిచ్చివేశాలు వేయ‌డం మానుకో…!అని కూడా హిత‌వు ప‌లికారు.

Advertisement

ఇప్ప‌టికే టీడీపీ .. మొన్న బ‌క్క‌ని న‌ర్సిహుంలు చేసిన మ‌తిత‌ప్పిన, సోయి లేని కామెంట్స్‌తో ముఖం లేకుండా చేసుకున్న‌ది. ఇప్పుడు ప‌వ‌న్ ఇలా రెచ్చ‌గొట్టి, క‌య్యానికి కాలుదువ్వి తుక్కు తుక్కు తిట్లు తిన‌డం ద్వారానైనా సింప‌తీ సాధించి ఓట్లు దండుకునే కొత్త వ్యూహ‌మేదో వేసి ఉంటాడ‌ని అనుకుంట‌న్నారు కొంద‌రు. అయినా త‌ల్లికి అన్నం పెట్ట‌నోడు.. పిన‌త‌ల్లికి బంగారు గాజులు చేయిస్తాన‌న్నాడ‌ట‌. అట్ల‌నే ఉన్న‌ది ప‌వ‌న్ తిక్క లెక్క‌. లెక్క‌లేని త‌నం. కిక్కు కోసం తుక్కు తుక్కుగా ఆయ‌న‌ తినే తిట్లు..!

Related News

ఎనిమిది రోజులుగా పోలీసు బలగాల పహారాలో హస్తినా! కట్టుదిట్టమైన భద్రత పేరుతో తీవ్ర నిర్బంధం..! జంతర్‌మంతర్‌ పాయే సెంట్రల్‌ పార్కూ పాయె..!

టీపీసీసీ చీఫ్‌ పదవికి ఇద్దరూ పోటీ..! మహేశ్‌కు వరించిన అధ్యక్ష పీఠం..! లేటుగానైనా జాతీయ స్థాయి కీలక పదవిలో యాష్కీ!

కాంగ్రెస్‌..కోదండరాం మంత్రం! ఆయనే ఎన్నికల ప్రధాన ప్రచార అస్త్రం..? రెండు ఎమ్మెల్సీ స్థానాల గెలుపే లక్ష్యంగా పావులు!

ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

తెలంగాణ బీజేపీ గతిని మార్చేలా రంగంలోకి ఆ ఇద్దరు! బెంగాల్‌ మాస్టర్‌ మైండ్‌ సునీల్‌ బన్సాల్‌పై భారీ అంచనాలు! కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ నిర్ణయాలకు ఇక చెల్లుచీటి?

ఒక్కరోజు బాగోతానికి మూతిమీసాలు పెంచుకున్నాడు..! కేసీఆర్‌ ఎక్కడికో తీసుకుపోవాలనుకుంటాడు.. ! కానీ ఇతడు ఇక్కడ్నే ఉంటాడు..!

అన్నా హజారేలా తెరమరుగు కాకుండా! రాజకీయ పార్టీగా మారబోమని ప్రకటించిన సీజేపీ! నైతిక విశ్వసనీయతే ఊతంగా..!

Big Stories

Advertisement
×