E-Paper
Advertisement

నిర్మల్ జిల్లాలో ఘోరం.. కూలర్‌లో నీళ్లు పోస్తూ తండ్రీకొడుకులు దుర్మరణం!

నిర్మల్ జిల్లాలో ఘోరం.. కూలర్‌లో నీళ్లు పోస్తూ తండ్రీకొడుకులు దుర్మరణం!
Advertisement

Air Cooler: నిర్మల్ జిల్లా పెంబి మండలంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కరెంట్ షాక్‌తో చనిపోవడం నిజంగా చాలా బాధాకరం. కొరకంటి తండా గ్రామంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇళ్లలో కూలర్లు వాడటం సహజం. అయితే, ఇక్కడే ఓ చిన్న నిర్లక్ష్యం లేదా ఊహించని ప్రమాదం ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది.

గ్రామానికి చెందిన రాథోడ్ అర్జున్ (56), అతని కుమారుడు శ్రీనివాస్ (25) కలిసి ఇంట్లోని ఐరన్ బాడీ ఎయిర్ కూలర్‌లో నీళ్లు పోస్తున్నారు. దురదృష్టవశాత్తూ ఆ సమయంలో కూలర్‌కు విద్యుత్ సరఫరా అవుతుండటంతో, నీళ్లు పోస్తున్న తండ్రీకొడుకులిద్దరికీ ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టింది. అది చూసి షాక్‌కు గురైన అర్జున్ భార్య, భర్తను, కొడుకును కాపాడటానికి గబగబా ముందుకు వెళ్ళింది. కానీ, ఆమెకు కూడా తీవ్రంగా కరెంట్ షాక్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి.

Advertisement

స్థానికులు వెంటనే స్పందించి ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు. ఈ లోపు తండ్రీకొడుకులు ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడంతో తండాలో తీవ్ర విషాదం నిండింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: జీడిమామిడి తోటలో తల్లీ, కూతుళ్ల హత్య కలకం

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×