E-Paper
Advertisement

రాహుల్ డ్రెస్ కోడ్ పాటించ‌వా.. ప్లీజ్‌..! ఆ కుర‌చ టీ ష‌ర్టు.. లూజు లూజు ప్యాంటు.. ఎప్పుడూ ఇదేనా!?

రాహుల్ డ్రెస్ కోడ్ పాటించ‌వా.. ప్లీజ్‌..! ఆ కుర‌చ టీ ష‌ర్టు.. లూజు లూజు ప్యాంటు.. ఎప్పుడూ ఇదేనా!?
Advertisement

అటు ఇటు పోయి రాహుల్ డ్రెస్ కోడ్ మీద ప‌డ్డారిప్పుడు నెటిజ‌న్లు. త‌మిళ‌నాట థ్రిల్ల‌ర్ సినిమాను త‌ల‌పించిన రాజ‌కీయాలకు శుభం కార్డు ప‌డింది. ఇంకా కొన్ని ట్విస్టులు కొన‌సాగుతున్నా.. అనుకున్న‌ట్టుగానే.. అంతా కోరుకున్న‌ట్టుగానే విజ‌యే సీఎం అయ్యాడు. సంతోషం. అయితే సీఎంగా విజ‌య్ ప్ర‌మాణ స్వీకార మ‌హోత్సవానికి రాహుల్ ప్ర‌త్యేక ఆక‌ర్షణ‌గా నిలిచాడు. ఈ వేదిక మీద విజ‌య్… రాహుల్‌కిచ్చిన మ‌ర్యాద‌, మ‌న్న‌న‌లు కూడా ఊహించ‌ని విధంగానే ఉన్నాయి. కాంగ్రెస్ శ్రేణులే ఆశ్చ‌ర్య‌పోయారు. ఉబ్బిత‌బ్బిబ్బ‌య్యారంటే న‌మ్మండి!

అవును.. రాహుల్ గాంధీతో విజ‌య్ సెల్ఫీలు దిగ‌డం.. రాహుల్ గాంధీ చేతిని త‌న చేతితో క‌లిపి పైకెత్తి విజ‌య సంకేతంగా జ‌నాల‌కు చూపించ‌డం.. ఇవ‌న్నీ ఆ ప్ర‌మాణ స్వీకారోత్స‌వంలో అంద‌రికీ స్పెష‌ల్ ఎఫెక్ట్సే. ఇక్క‌డ రెండు విష‌యాలు చ‌ర్చ‌కు వ‌చ్చాయి. ఒక‌టి.. విజ‌య్ పార్టీకి కాంగ్రెస్ ఏం మేలు చేయ‌కున్నా… అంత‌టి అభిమానం చూప‌డం.. ఇక రెండ‌వ‌ది… రాహుల్ డ్రెస్ కోడ్‌! స‌రే ఇప్పుడు మొద‌టి ముచ్చ‌ట గురించి చ‌ర్చించుకుందాం. నిజానికి కాంగ్రెస్ ఎంతో మందికి కొత్త రాజ‌కీయ భ‌విష్య‌త్తునిచ్చింది. ఎంద‌రినో ఉన్న‌త ప‌ద‌వుల్లో కూర్చోబెట్టింది. కానీ ఆ త‌రువాత ఎవ‌రి రాజ‌కీయ అవ‌స‌రాల‌కు వారు త‌ల్లిలాంటి పార్టీకి చేతిచ్చారు. త‌మ అవ‌స‌రాలు తాము చూసుకున్నారు.

Advertisement

స్వార్థ రాజ‌కీయ అవ‌స‌రాల‌కు పార్టీని బ‌లిపెట్టారు. అయినా ఓపిగ్గా భ‌రించింది కాంగ్రెస్ పార్టీ. అందిర‌నీ అక్కున చేర్చుకుంది. కొంద‌రు త‌ల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా .. వ‌దిలి వెళ్లిపోయారు. కొంద‌రు అంటిపెట్టుకుని ఉన్నారు. ఉత్థాన‌ప‌త‌నాలు చూసిన పార్టీ ఎక్క‌డా చెక్కుచెద‌ర‌లేదు. వెన్నుచూప‌లేదు. నిటారుగా జ‌నం ముందు అలాగే నిలుచుంది. అయితే ఇక్క‌డ విజ‌య్ పార్టీ గురించి చెప్పుకుంటే.. అది మొన్న‌నే పుట్టిన పార్టీ. వాస్త‌వానికి ఆ పార్టీకి నిర్మాణ‌మే ఇంకా స‌రిగా కాలేదు. విజ‌య్ చ‌రిష్మా, ఇచ్చిన హామీలు.. ఇంకా చాలా అంశాలు టీవీకేకు క‌లిసి వ‌చ్చాయి. విజ‌య్‌ను సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిపాయి. ఆ త‌రువాత ప్ర‌భుత్వ ఏర్పాటులో భాగంగా జ‌రిగిన నెంబ‌ర్ గేమ్‌..ట్విస్టులు, క‌క్ష‌పూరిత వ్య‌వ‌హారాలు, పైశాచికంగా తాత్కాలిక ఆనందాలు.. ఇవ‌న్నీ జరిగాయి. కానీ రాహుల్ వెంట‌నే త‌న మద్ద‌తును టీవీకే ప్ర‌క‌టించ‌డం కూడా చ‌ర్చ‌కు వ‌చ్చింది.

డీఎంకేను కాద‌ని ఎలా మ‌ద్ద‌తిస్తార‌ని. కానీ రాహుల్ వెంట‌నే నిర్ణ‌యం తీసుకోవ‌డం.. విజ‌య్‌తో అప్ప‌టి వ‌ర‌కున్న స్నేహ‌బంధాన్ని మ‌రింత బ‌ల‌ప‌రిచింది. దీంతో త‌న ప్ర‌భుత్వ ఏర్పాటులో రాహుల్ కీల‌క‌భూమిక పోషించార‌నే విశ్వాసంతో విజ‌య్ న‌డుచుకోవ‌డం..త‌మిళ రాజ‌కీయాల్లో కొత్త ఒర‌వ‌డిగా చెప్పుకోవ‌చ్చు. అది విజ‌య్‌కున్న మంచి వ్య‌క్తిత్వానికి నిద‌ర్శ‌న‌మ‌ని కూడా అనొచ్చు. దీన్ని కూడా చాలా మంది చ‌ర్చించుకున్నారు. ఎంద‌రికో ఎన్నోచేసినా.. విజ‌య్‌కు ఏమీ చేయ‌కున్నా.. చూసే దృష్టిలో .. చూపే ఆప్యాయ‌త‌లో ఎంత తేడా? వాహ్‌..! విజ‌య్‌.. నువ్వు నిజంగా గ్రేట్‌.! రాహుల్‌కిది త‌మిళ‌నాట ల‌భించిన అద్భుత‌మైన‌, అరుదైన గౌర‌వం.. అని కొనియాడారు.

Advertisement

ఇక రెండో ముచ్చ‌ట ….. రాహుల్ డ్రెస్ గురించి. నిజం చెప్పాలంటే.. ఆయ‌న ఇప్పుడు వేసుకుంటున్న టీ ష‌ర్టు, ప్యాంటు.. ఈ డ్రెస్ కోడ్ చాలా మందికి న‌చ్చ‌డం లేదు. చాలా మందికేంటీ.. అంద‌రికీ అనాలి. ఆపార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌తో స‌హా. ఇదే డ్రెస్‌తో త‌మిళ‌నాడు సీఎంగా విజ‌య్ ప్ర‌మాణ స్వీకారోత్స‌హానికి హాజ‌ర‌య్యాడు రాహుల్. దీన్ని కూడా ట్రోల్ చేశారు.. ట్రోల్ అంటే వెట‌కారంతో కూడిన వ్యంగ్య కామెంట్లు కాదు. మంచికోరే మ‌న‌సుతో ఇచ్చే ఆత్మీయ సూచ‌న‌లా. అంత‌టి మంచి ఫంక్ష‌న్‌కు వెళ్తున్నావ్‌.. ఇక్క‌డా ఇదే డ్రెస్సా.. మంచిగా డ్రెస్ కోడ్ పాటించ‌వా? అని అడుతున్నారు. కానీ ఇదే వేసుకోవ‌డానికి చాలా సుల‌భ‌త‌రంగా ఉందేమో ఆయ‌న‌కు.. కానీ చూసే వారికి మాత్రం ఇబ్బందిక‌రంగానే ఉంది… అనే విష‌యం ఇలా ఈ సంద‌ర్భంగా బ‌య‌ట‌ప‌డింది.

Related News

మేమొచ్చినా.. వెంట‌నే హామీలు అమ‌లు చేయ‌లేం.. ! కుదురుకోవ‌డానికి ఐదారేళ్లు ప‌డుతుందేమో..? ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై కేటీఆర్ కామెంట్స్‌..

రాడు.. రానేరాడు.. వస్తే గిస్తే.. సీఎంగానే వ‌స్త‌డు.. ఏం చేసుకుంట‌రో చేసుకోండి..!

కేసీఆర్‌ది లీ క్వాన్ యూ స్థాయి.. సింగ‌పూర్ త‌ర‌హా అత్యున్న‌త మ‌ర్యాద‌ను ఇవ్వాల్సిందిపోయి….. కేటీఆర్ ఆస‌క్తిక‌ర కామెంట్స్‌..!

347 కోట్ల మంది మ‌హిళ‌లు.. ఆర్టీసీలో ఫ్రీ ప్ర‌యాణం! రూ. 12,167 కోట్ల మేర ఆ కుటుంబాల‌కు ఆదా..!

వెయ్యి రోజులుగా కేసీఆర్ మేధోమ‌థ‌నం….కొంగొత్త ప‌థ‌కాల‌కు రూప‌క‌ల్ప‌న‌..! బీఆరెస్ స‌మ‌ర్థింపు ప్ర‌క‌ట‌న‌లు…

ఆయ‌నంతే .. ఓడితే అజ్ఞాతవాసే..! అది ఉద్య‌మ స‌మ‌యం నుంచే ఆయ‌న‌కు అల‌వాటు.. ఎవ‌రేమ‌నుకున్నా స‌రే అదే తీరు..!

కాంగ్రెస్ @ 1000 డేస్.. ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

బీఆరెస్ సోష‌ల్ మీడియాపై స‌ర్కార్ సీరియ‌స్ న‌జ‌ర్.. వెన‌క్కి త‌గ్గ‌ని పింక్ వారియ‌ర్స్‌

Big Stories

Advertisement
×