E-Paper
Advertisement

Tamilnadu Assembly: అసెంబ్లీ సీఎం విజయ్ తొలి స్పీచ్.. సనాతన ధర్మంపై ఉదయనిధి విమర్శలు

Tamilnadu Assembly: అసెంబ్లీ సీఎం విజయ్ తొలి స్పీచ్.. సనాతన ధర్మంపై ఉదయనిధి విమర్శలు
Advertisement

Tamilnadu Assembly: ఒకప్పుడు ప్రాణ భయంతో వద్దనుకున్న స్పీకర్ పదవి ఇప్పుడు ప్రజాస్వామ్యంలో అత్యంత గౌరవప్రదమైనదిగా మారిందన్నారు సీఎం విజయ్. సభా హక్కులను కాపాడే రక్షకుడిగా స్పీకర్ వ్యవహరిస్తారని అన్నారు. ఈ సంప్రదాయం ఆ మార్పునకు ప్రతీక అని తన ప్రసంగంలో స్పష్టంగా పేర్కొన్నారు.

అసెంబ్లీ సీఎం విజయ్ తొలి స్పీచ్

Advertisement

తమిళనాడు అసెంబ్లీలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక సందర్భంగా సీఎం విజయ్ తొలిసారి మాట్లాడారు. ఈ సందర్భంగా స్పీకర్ చారిత్రకను వివరించారు. స్పీకర్‌గా ఎన్నికైన వ్యక్తిని సభ్యులు నడిపించుకుని తీసుకెళ్లి కుర్చీలో కూర్చో బెట్టే ఆచారం వెనుక అసలు కథను వివరించారు. ఈ సంప్రదాయం వెనుక వందల ఏళ్ల నుంచి ఉందన్నారు.

ఒకప్పుడు స్పీకర్ పదవికి ప్రాణభయం దాగి ఉన్నాయన్నారు. బ్రిటిష్ పార్లమెంటులో 14వ శతాబ్దంలో స్పీకర్ పదవి అత్యంత ప్రమాదకరమైనదిగా ఉండేదని గుర్తు చేశారు. హౌస్ ఆఫ్ కామన్స్ తీసుకున్న నిర్ణయాలు, అభిప్రాయాలను రాజుకు తెలియ జేయడం స్పీకర్ ప్రధాన విధిగా ఉండేదని వివరించారు.

Advertisement

స్పీకర్ ఎంపికపై ఆసక్తికర కథ.. సనాతన ధర్మంపై ఉదయనిధి విమర్శలు

ఒక్కోసారి సభ్యుల తీర్మాణాలు రాజుకు నచ్చకుంటే స్పీకర్‌కు మరణశిక్ష వేయడం సర్వసాధారణంగా జరిగేదన్నారు. చరిత్ర రికార్డుల ప్రకారం.. 1394-1535 మధ్య కాలంలో దాదాపు ఏడుగురు స్పీకర్లను ఈ విధంగా శిక్షించారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో స్పీకర్ పదవిని స్వీకరించడానికి ఏ ఒక్కరూ ముందుకు వచ్చేవారు కాదని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.

ఆనాటి నుంచి సభ ఎన్నుకున్న వ్యక్తిని బలవంతంగా తీసుకెళ్లి స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టే సంప్రదాయం మొదలైందన్నారు. సభ ఒత్తిడితో ఈ బాధ్యతను స్వీకరిస్తున్నానని రాజుకు సంకేతం ఇవ్వడమే ఈ సాంప్రదాయం ముఖ్య ఉద్దేశమన్నారు.

ప్రస్తుతం స్పీకర్ ఎంపిక, ఆయన్ని కుర్చీపై కూర్చోబెట్టే సంప్రదాయం కొనసాగుతోందన్నారు. యూకే, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో స్పీకర్‌ను సభ్యులు సరదాగా లాగుతూ కుర్చీ వద్దకు తీసుకెళ్తారన్నారు. భారత్‌లో అధికార-ప్రతిపక్ష నేతలు కలిసి స్పీకర్‌ను ఆయన సీటు వద్ద తీసుకెళ్లడం ఈ సంప్రదాయంలో భాగమేనన్నారు సీఎం విజయ్.

ALSO READ: మరోసారి అస్సాం సీఎంగా హిమంత బిశ్వశర్మ ప్రమాణ స్వీకారం.. ఎన్డీయే నేతలు హాజరు

అసెంబ్లీ కొత్త స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక సందర్భంగా ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మాట్లాడారు. ఆ సమయంలో ఉదయనిధి మరోసారి సనాతన ధర్మంపై విమర్శలు గుప్పించారు. ప్రజలను విడదీసే సనాతనం నిర్మూలించాలన్నారు. సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్ర గేయం కంటే ముందు వందేమాతరం ప్రదర్శించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

రాష్ట్ర గీతం ఎప్పుడూ రెండో స్థానంలో ఉండకూడదని వ్యాఖ్యానించారు. సనాతన నిర్మూలన నిమిత్తం తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. ప్రభుత్వం-ప్రతిపక్షం వేర్వేరు వరుసల్లో కూర్చొన్నా రాజకీయ మర్యాద కొనసాగాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పని చేయాలని, ప్రజల కోరిక అదేనన్నారు. ముఖ్యమంత్రి-తాను ఒకే కాలేజీలో చదివామని, రాజకీయాల్లో తాము సీనియర్ అని, అనుభవం, జ్ఞానం పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రసంగం ముగిశాక సీఎం విజయ్‌కు‌ నమస్కారం చేశారు ఉదయనిధి స్టాలిన్.

 

 

Related News

పిల్లలను రెచ్చగొట్టొద్దు..లీక్ ఘోర పాపం, నీట్‌పై నోరు విప్పిన ప్రధాని మోదీ

పాపం ఊరికే పోదు.. నీట్ లీక్ వెనకున్న వారిని వదిలేదే లేదు: ప్రధాని మోదీ

హస్తిన వైపు కదం తొక్కిన రైతన్నలు.. శంభు బార్డర్ వద్ద హైటెన్షన్, అడ్డుకున్న పోలీసు బలగాలు, ఎందుకు?

పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

Big Stories

Advertisement
×