E-Paper
Advertisement

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!
Advertisement

Dishes to Save Gas: ప్రస్తుత రోజుల్లో గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మరో వైపుఎండల కారణంగా వంట గదిలో ఎక్కువ సమయం గడపడం అందరికీ కష్టంగా మారుతోంది. ఇలాంటి సయంలో తక్కువ సమయంలో.. అతి తక్కువ గ్యాస్ ఖర్చుతో ఆరోగ్యకరమైన భోజనాన్ని తయారు చేసుకోవడం ఒక కళ. ముఖ్యంగా బ్యాచిలర్స్, ఉద్యోగులు, మహిళలు గ్యాస్ ఆదా చేసే వంటకాలు ఎంతో మేలు చేస్తాయి. పోషకాలు తగ్గకుండా.. రుచి చెడకుండా తక్కువ మంట మీద లేదా తక్కువ సమయంలో పూర్తయ్యే 7 అద్భుతమైన వంటకాల గురించి వివరంగా తెలుసుకుందాం.

1.పోహా :
ఇది మహారాష్ట్ర, నార్త్ ఇండియాలో అత్యంత ప్రాచుర్యం పొందిన బ్రేక్ ఫాస్ట్. అటుకులను నీటిలో కడిగి పక్కన పెట్టుకుంటే అవి మెత్తబడతాయి. వీటికి పోపు వేయడానికి కేవలం 2 నుంచి 3 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. దీనికి ఎక్కువ సేపు ఉడికించాల్సిన అవసరం లేదు. కాబట్టి గ్యాస్ చాలా తక్కువగా ఖర్చవుతుంది.

Advertisement

2. కిచిడీ:
బియ్యం, పప్పు , కూరగాయలను కలిపి ప్రెషర్ కుక్కర్‌లో వండటం వల్ల చాలా గ్యాస్ ఆదా అవుతుంది. కుక్కర్‌లో మూడు విజిల్స్ రాగానే స్టవ్ కట్టేయవచ్చు. కుక్కర్‌లోని ఆవిరితోనే మిగిలిన వంట పూర్తవుతుంది. ఇది తక్కువ గ్యాస్ తో పూర్తయ్యే సంపూర్ణ భోజనం.

3. దాలియా:
గోధుమ రవ్వ లేదా దాలియా చాలా త్వరగా ఉడుకుతుంది. దీన్ని ముందుగా కాసేపు నానబెడితే ఇంకా త్వరగా పూర్తవుతుంది. ప్రెషర్ కుక్కర్ ఉపయోగించడం వల్ల కేవలం 5-7 నిమిషాల్లో పోషకాలు నిండిన భోజనం సిద్ధమవుతుంది.

Advertisement

4. శనగపిండి ఉప్మా/జుంకా :
శనగపిండితో చేసే వంటకాలు చాలా త్వరగా ఉడుకుతాయి. కేవలం నీటిని మరిగించి అందులో పిండి కలిపి కొద్దిసేపు ఆవిరి మీద ఉంచితే చాలు. ఇది కూరగాయలు తరిగే పని లేకుండా.. తక్కువ మంట మీద నిమిషాల్లో తయారవుతుంది.

5. పనీర్ భుర్జీ:
పనీర్ వండటానికి మాంసం లేదా పప్పుల కంటే చాలా తక్కువ సమయం పడుతుంది. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయించి, తురిమిన పనీర్ కలిపితే 5 నిమిషాల్లో వంట రెడీ. దీనికి ఎక్కువ సేపు ఉడికించాల్సిన పని లేదు.. కాబట్టి గ్యాస్ ఆదా అవుతుంది.

Also Read: రాత్రిపూట మామిడి పండు తింటున్నారా? ఈ సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోండి!

6. చద్ది అన్నం / పెరుగు అన్నం :
అన్నం ముందే వండి ఉన్నట్లయితే.. పెరుగు అన్నానికి అస్సలు గ్యాస్ అవసరం లేదు. కేవలం పోపు కోసం అర నిమిషం గ్యాస్ వాడితే సరిపోతుంది. ఇది ఆరోగ్యానికి చలువ చేయడమే కాకుండా.. గ్యాస్ పొదుపులో నంబర్ వన్.

7. స్టీమ్డ్ మొలకలు:
మొలకలను కుక్కర్‌లో ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించి, అందులో నిమ్మరసం, ఉప్పు, మసాలాలు కలిపి తీసుకోవచ్చు. ఇది అత్యంత ఆరోగ్యకరమైన,  గ్యాస్ ఖర్చయ్యే వంటకం.

వంట చేసే ముందు పప్పులు లేదా బియ్యాన్ని అరగంట పాటు నానబెట్టడం వల్ల వంట సమయం 20% వరకు తగ్గుతుంది. ఎప్పుడూ మూత పెట్టి వండటం , ప్రెషర్ కుక్కర్‌ను వాడటం ద్వారా కూడా మనం ఎల్‌పీజీ గ్యాస్‌ను చాలా వరకు ఆదా చేయవచ్చు.

Related News

కొబ్బరి మసాలాతో కోస్తా స్టైల్ ఎండుచేపల పులుసు.. ఒక్కసారి తింటే లైఫ్‌లో టేస్ట్ మర్చిపోరు!

పిల్లలు ఇష్టంగా తినే ఈజీ బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండానే కరకరలాడే సాఫ్ట్ దోశ!

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

Big Stories

Advertisement
×