E-Paper
Advertisement

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్
Advertisement

Best No-Cook Summer Meals: ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు వేడి వేడి పదార్థాలు తినడం కంటే..చల్లగా, తేలికగా ఉండే ఆహారం తీసుకోవాలని మన శరీరం కోరుకుంటుంది. ముఖ్యంగా మధ్యాహ్నం వేళ స్టవ్ వెలిగించి వంట చేయడం వల్ల ఇల్లు మరింత వేడెక్కుతుంది. అందుకే..ఈ సీజన్‌లో వంట చేసే పని లేకుండా కేవలం 10-15 నిమిషాల్లో సిద్ధమయ్యే ‘నో-కుక్ మీల్స్’బెస్ట్ ఆప్షన్. ఇవి మీ సమయాన్ని ఆదా చేయడమే కాకుండా..శరీరానికి అవసరమైన పోషకాలను,హైడ్రేషన్‌ను అందిస్తాయి.

వేసవి తాపాన్ని తట్టుకోవడానికి ఉపయోగపడే ఆ 7 నో-కుక్ వంటకాలు ఇవే..

Advertisement

1.చనా చాట్ లేదా శనగల సలాడ్ :
ముందుగా నానబెట్టి ఉడికించుకున్న శనగలు అందుబాటులో ఉంటే.. ఇది ప్రోటీన్ అందించే అద్భుతమైన భోజనం. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమాటోలు, దోసకాయ, పచ్చిమిర్చి, నిమ్మరసం కలిపితే రుచికరమైన సలాడ్ సిద్ధం. ఇది కడుపు నిండుగా ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా మంచిది.

2.గ్రీక్ యోగర్ట్ ఫ్రూట్ బౌల్ :
పెరుగు లేదా గ్రీక్ యోగర్ట్‌ను బేస్‌గా తీసుకుని.. అందులో సీజనల్ పండ్లు (మామిడి, పుచ్చకాయ, అరటిపండు), కొన్ని నట్స్ (బాదం, వాల్‌నట్స్) కలపండి. దీనికి కొంచెం తేనె కలిపితే సహజమైన తీపి వస్తుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. అంతే కాకుండా చలవ చేస్తుంది.

Advertisement

3. దోసకాయ, పుదీనా కోల్డ్ సూప్ :
వేసవిలో ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. దోసకాయ ముక్కలు, పెరుగు, పుదీనా ఆకులు, వెల్లుల్లి, కొంచెం ఉప్పు వేసి మిక్సీ పడితే చల్లని సూప్ సిద్ధం. దీనిని ఫ్రిజ్‌లో ఉంచి తాగితే శరీరం లోపల నుంచి చల్లబడుతుంది.

4. వెజిటబుల్ హముస్ వ్రాప్స్:
ముందుగా సిద్ధం చేసుకున్న లేదా మార్కెట్లో దొరికే హముస్‌ను చపాతీ లేదా టోర్టిల్లాపై రాసి, దానిపై సన్నగా కోసిన క్యారెట్, క్యాప్సికమ్, లెట్యూస్ ముక్కలు వేసి రోల్ చేయండి. ఇది వంట చేయకుండానే.. లభించే పోషక విలువలున్న భోజనం.

5.పెసరపప్పు కోసంబరి :
నార్త్ ఇండియన్ సాంప్రదాయ వంటకం ఇది. కేవలం అరగంట నానబెట్టిన పెసరపప్పులో, పచ్చి కొబ్బరి తురుము, దోసకాయ ముక్కలు, కొత్తిమీర, నిమ్మరసం కలిపి దీనిని తయారు చేస్తారు. ఇది అత్యంత వేగంగా జీర్ణమవుతుంది. అంతే కాకుండా శరీర వేడిని తగ్గిస్తుంది.

Also Read: కేవలం 3 వస్తువులతో కమ్మని వెనీలా ఐస్‌క్రీమ్.. పిల్లల ఫేవరెట్ డిజర్ట్ అయిపోద్ది!

6. వాటర్ మిలన్ అండ్ ఫెటా సలాడ్ :
పుచ్చకాయ ముక్కలకు కొంచెం ఫెటా చీజ్ (లేదా పనీర్ ముక్కలు), పుదీనా ఆకులు కలిపి ఈ సలాడ్ తయారు చేస్తారు. పుచ్చకాయ లోని నీటి శాతం మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. ఇది సమ్మర్ ఈవెనింగ్ స్నాక్ గా చాలా బాగా ఉపయోగపడుతుంది.

7. ఓవర్ నైట్ ఓట్స్ :
రాత్రిపూట ఓట్స్‌ను పాలు లేదా పెరుగులో నానబెట్టి, ఫ్రిజ్‌లో ఉంచాలి. ఉదయాన్నే అందులో కొన్ని పండ్ల ముక్కలు, చియా విత్తనాలు కలిపితే చల్లని బ్రేక్‌ఫాస్ట్ సిద్ధం. ఇది మీ మెటబాలిజంను పెంచుతుంది.

వేసవిలో భోజనం కంటే ఇలాంటి తేలికపాటి ఆహారాలు తీసుకోవడం వల్ల నీరసం రాకుండా ఉంటుంది. ఈ నో-కుక్ వంటకాలు కేవలం రుచికరమైనవే కాదు. మీ వంటగదిని చల్లగా ఉంచడానికి కూడా సహాయ పడతాయి. ఈ వేసవిని ఆరోగ్యంగా ఆస్వాదించండి.

Related News

కొబ్బరి మసాలాతో కోస్తా స్టైల్ ఎండుచేపల పులుసు.. ఒక్కసారి తింటే లైఫ్‌లో టేస్ట్ మర్చిపోరు!

పిల్లలు ఇష్టంగా తినే ఈజీ బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండానే కరకరలాడే సాఫ్ట్ దోశ!

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

Big Stories

Advertisement
×