ENE Repeat:నటీనటులు: విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, శ్రీనాథ్ మాగంటి, వెంకటేష్ కాకుమాను, శివాత్మిక రాజశేఖర్, అనిషా ఆంబ్రోస్, కరుణ కుమార్, ప్రియదర్శిని రామ్ తదితరులు
దర్శకత్వం: తరుణ్ భాస్కర్ ధాస్యం
సంగీతం: వివేక్ సాగర్
నిర్మాతలు: సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి
‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రం తర్వాత వివేక్ (విశ్వక్ సేన్), కౌశిక్ (అభినవ్ గోమఠం), ఉప్పి (వెంకటేష్ కాకుమాను), కార్తీక్ (శ్రీనాథ్ మాగంటి) ఎవరి దారిలో వారు బిజీ అవుతారు. అప్పులు తీర్చేందుకు వివేక్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ వైపు వెళ్తే, కౌశిక్ నటుడిగా నిలదొక్కుకుంటాడు. ఉప్పి ఎడిటర్‌గా, కార్తీక్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుంటారు. మరోవైపు ఉప్పి కజిన్ కీర్తన (శివాత్మిక రాజశేఖర్)ను కార్తీక్ ప్రేమిస్తుంటాడు. వీరంతా కలిసి వెళ్లిన ఒక బ్యాచిలర్ పార్టీలో జరిగిన ఘటన వల్ల కీర్తన తండ్రి మురళీధర్ (ప్రియదర్శిని రామ్) తీవ్ర ఆగ్రహానికి గురై వీరికి ఒక ఛాలెంజ్ విసురుతాడు. ఆ ఛాలెంజ్ ఏంటి? దాన్ని పూర్తి చేసి కార్తీక్ తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అనేదే ఈ చిత్ర కథాంశం.
తొలి భాగం విడుదలైన ఎనిమిదేళ్ల తర్వాత తరుణ్ భాస్కర్ ఈ సీక్వెల్‌తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఫ్రెండ్‌షిప్, సిచ్యుయేషనల్ కామెడీ ప్రధానంగా సాగే ఈ సినిమాలో కౌశిక్ పాత్ర మరోసారి హైలైట్‌గా నిలిచింది. అభినవ్ గోమఠం తన ఎక్స్‌ప్రెషన్స్, డైలాగ్ డెలివరీతో చాలా చోట్ల నవ్వులు పూయిస్తారు. ముఖ్యంగా ఫారెస్ట్ ఎపిసోడ్, బార్ సీన్, సింగిల్ షాట్ బీచ్ సీక్వెన్స్ మరియు అతిథి పాత్రల్లో కనిపించే దర్శకుల సందడి సినిమాలో సరదాగా సాగిపోతాయి.
అయితే, మొదటి భాగంతో పోలిస్తే ఇందులో ఆ కొత్తదనం, బలమైన ఎమోషనల్ కనెక్ట్ కొంత తగ్గినట్లు అనిపిస్తుంది. వివేక్ పాత్రలో విశ్వక్ సేన్ కొంచెం సెటిల్డ్‌గా కనిపించినా, ఫ్రెండ్స్ మధ్య ఉండే ఆ పాత జోష్ కొన్ని చోట్ల మిస్సయిన ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్‌ను ముగించిన తీరు కూడా కాస్త హడావుడిగా అనిపిస్తుంది. వివేక్ సాగర్ పాటలు తొలి భాగం స్థాయిలో లేకపోయినా, నేపథ్య సంగీతం, విజువల్స్ సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి.
కౌశిక్ పాత్రలో అభినవ్ గోమఠం కామెడీ టైమింగ్, డైలాగ్స్
ఫారెస్ట్ ఎపిసోడ్, బీచ్ సీక్వెన్స్,బార్ సన్నివేశాలు
స్పెషల్ క్యామియోలుగా కనిపించే దర్శకుల ఎంట్రీలు
వివేక్, ఉప్పి, కార్తీక్ పాత్రల మధ్య సరదా సంభాషణలు
also read:ఈఎన్ఈ రిపీట్ లో ఎంతమంది గెస్ట్ లుగా నటించారో తెలుసా?
తొలి భాగం స్థాయిలో పండని ఎమోషనల్ బాండింగ్
హడావుడిగా అనిపించే క్లైమాక్స్ మరియు అక్కడక్కడా తగ్గిన వేగం
కార్తీక్ పాత్రలో రీప్లేస్‌మెంట్‌కు అలవాటు పడటానికి కొంత సమయం పట్టడం
ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో కలిసి సరదాగా నవ్వుకునే సిచ్యుయేషనల్ కామెడీని ఇష్టపడేవారికి ఈ ‘ఈ.ఎన్.ఈ రిపీట్’ ఓ మోస్తరు వినోదాన్ని అందిస్తుంది. భారీ అంచనాలు లేకుండా చూసే చిత్రం ఇది.
ENR Repeat Movie Review and Rating: 2.5 / 5