Aakasamlo Oka Tara Twitter Review: దుల్కర్ సల్మాన్ తాజాగా పవన్ సాదినేని(Pawan Sadineni) దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం ఆకాశంలో ఒక తార(Aakasamlo Oka tara). ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ నవంబర్ 20వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి. ఇక ఈ సినిమా నవంబర్ 20వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో 19వ తేదీన ప్రీమియర్లు ప్రసారం అయ్యాయి. ఇక ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్లు ప్రసారం చేయటంతో భారీ స్థాయిలో ఆదరణ లభించింది.
దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి(Sathvika Veeravalli), శృతిహాసన్(Sruthi Hassan) ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ ఎమోషనల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పల్లెటూరులో పుట్టి పెరిగిన కల్పన అనే అమ్మాయి ఆస్ట్రోనాట్ కావాలని కలలు కంటుంది. తన కలలను నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తూ కల్పన ఏ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు, చివరికి కల్పన తన అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారా? అనే నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదల చేసిన ట్రైలర్ ,టీజర్ మంచి అంచనాలను పెంచేశాయి. మరి నేడు ప్రీమియర్లు ప్రసారం కావడంతో ప్రేక్షకులు ఈ సినిమా చూసిన అనంతరం వారి అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు. మరి ఆకాశంలో ఒక తార సినిమా ద్వారా దుల్కర్ సల్మాన్ హిట్ కొట్టారా ? ప్రేక్షకుల ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందనే విషయానికి వస్తే..