E-Paper
Advertisement

Avatar 3 review : అవతార్ 3’ ఫస్ట్ ఇంటర్నేషనల్ రివ్యూ – అంత చెత్తగా ఉందా?

Avatar 3 review : అవతార్ 3’ ఫస్ట్ ఇంటర్నేషనల్ రివ్యూ – అంత చెత్తగా ఉందా?
Advertisement

Avatar 3 review : చరిత్రలో కొన్ని సినిమాలుకు ఎప్పటికీ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. భాషతో సంబంధం లేకుండా కొంతమంది ప్రేక్షకులు ఆ సినిమాలను విపరీతంగా ఇష్టపడుతుంటారు. అలా ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి ఇష్టమైన సినిమా అవతార్. అవతార్ లాంటి సినిమాను ఊహించడమే కష్టం అనుకుంటే జేమ్స్ కెమెరాన్ ఆ ఊహను కూడా వెండితెరపై ఆవిష్కరించాడు.

అయితే ప్రపంచంలో ఉన్న ఆడియన్స్ అందరికంటే కూడా తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ ప్రత్యేకమే. ఎందుకంటే సినిమాలు తెలుగు ప్రేక్షకులు ఆదరించిన రీతిలో వేరే ప్రేక్షకులు ఆదరించరు అనేది వాస్తవం. అందుకే ఇక్కడ అవతార్ అంటే సినిమా కూడా 100 రోజులు ఆడిన దాఖలాలు ఉన్నాయి.

Advertisement

అవతార్ ఫ్రాంచైజ్ లో ఇప్పటికే రెండు విడుదల అయిపోయాయి ఇక మూడవ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. అవతార్: ఫైర్ అండ్ యాష్ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ తరుణంలోనే కొన్ని రివ్యూస్ ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

బోరింగ్ అవతార్: ఫైర్ అండ్ యాష్

అవతార్ సినిమాకి కొంతమంది ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. అయితే అవతార్ 2 సినిమా విడుదలైనప్పుడు కూడా కొంత మేరకు నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. ఇప్పుడు మాత్రం ఇంకా దారుణమైన రివ్యూలు మొదలయ్యాయి. అవతార్ 2 సినిమా వచ్చినప్పుడు ప్రముఖ నిర్మాత నాగల వంశీ కూడా మూడు గంటలు తలనొప్పి వచ్చింది అంటూ అప్పట్లో ట్విట్టర్లో పెట్టిన ట్వీట్ విపరీతంగా వైరల్ అయింది చాలా మంది నాగవంశీ ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

Advertisement

అయితే ఇప్పుడు అంతకంటే దారుణంగా అవుతారు త్రీ సినిమా గురించి రివ్యూ రావడం మొదలయ్యాయి. ఒకప్పుడు ఈ సినిమాకి విపరీతమైన రేటింగులు కనిపించేవి ఇప్పుడు మాత్రం ఆ రేంజ్ రెస్పాన్స్ రావడం లేదు.

ప్లస్ పాయింట్స్ 

అవతార్ అంటేనే ముఖ్యంగా అందరూ ఎక్స్పెక్ట్ చేసేది విజువల్స్. అయితే ఈ సినిమాకి సంబంధించి కూడా గ్రాఫిక్స్ మరియు స్పెషల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి అని తెలుస్తుంది. పలుచోట్ల కేవలం అది మాత్రమే ప్లస్ పాయింట్ గా వినిపిస్తుంది.

మైనస్ పాయింట్స్ 

ఈ రోజుల్లో డ్యూరేషన్ అనేది సినిమా మీద కీలకమైన ప్రభావాన్ని చూపిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అవతార్ సినిమాకి సంబంధించి దాదాపు మూడు గంటలపైనే డ్యూరేషన్ ఉంటుంది. అయితే వస్తున్న రివ్యూల ప్రకారం ఈ సినిమాలోని కథ ఆకట్టుకునే విధంగా లేదు కాబట్టి మూడు గంటల పాటు కూర్చోవడం అనేది అసాధారణమైన పని అని కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఫైనల్ టాక్

ఏదేమైనా ప్రాంచెజ్ మూవీస్ వస్తున్నాయి అంటే ఒకదాన్ని మించి ఇంకో సినిమా మీద అంచనాలు ఉండటం అనేది సహజంగా జరుగుతుంది. కానీ ఈ అవతార్ ఫ్రాంచైజ్ కి సంబంధించి ఇది మాత్రమే వీక్వెస్ట్ కెమెరాన్ వర్క్ అంటూ పలుచోట్ల వినిపిస్తుంది.

Related News

సహా రివ్యూ: గుండు ఛాలెంజ్‌తో వైరల్.. థియేటర్‌లో మాత్రం..

మీర్జాపూర్ మూవీ రివ్యూ.. గద్దె కోసం గ్యాంగ్ వార్.. ఎవరు గెలిచారంటే?

రంభ ఊర్వశి మేనక మూవీ రివ్యూ.. పాత జోనర్ నే నమ్ముకున్న అల్లరి నరేష్ కి కలిసొచ్చిందా?

బెత్లెహోమ్ కుటుంబ యూనిట్ మూవీ రివ్యూ.. ‘ప్రేమలు’ మూవీ లాంటి సక్సెస్ లభిస్తుందా?

‘ఐయామ్ గేమ్’ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Dharmastala Niyojakavargam Movie Review : ‘ధర్మస్థల నియోజకవర్గం’ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Romanchakam Review : ‘రోమాంచకం’.. నవ్వుల ప్రయాణం..

సుమంత్ ప్రభాస్ ‘రోమాంచకం’ ట్విట్టర్ రివ్యూ..

Big Stories

Advertisement
×