E-Paper
Advertisement

Sumathi Satakam Movie Review ‘అమర్ దీప్ సుమతీ శతకం’ రివ్యూ

Sumathi Satakam Movie Review ‘అమర్ దీప్ సుమతీ శతకం’  రివ్యూ
Advertisement

కథేంది.. లొల్లి ఏంది ?

మన తూర్పు గోదావరి జిల్లా వైకుంఠపురంలో కృష్ణ (అమర్ దీప్) అనే ఒక సాదాసీదా పోరడు ఉంటాడు. ఉన్న ఊర్లోనే కిరాణా కొట్టు నడుపుకుంటూ మస్తు ఖుషీగా ఉంటాడు కానీ, ఒక్కటే లొల్లి.. ఏందంటే పోరగాడికి పెళ్లి అయితలేదు. ఊర్లోనే ఉండి కిరాణా కొట్టు నడుపుతుండటంతో పిల్లను ఇయ్యడానికి ఎవ్వడూ ముందుకు రాడు. “ఊరి జాతరలో గుడిలోనే పెళ్లి చేసుకుంటా” అని నాయనమ్మకు మాట ఇస్తాడు. అట్లాంటి టైంలనే అంగన్‌వాడీ టీచర్ సుమతి (శైలి చౌదరి) ఎంట్రీ ఇస్తది. ఆమెను చూడగానే మన కృష్ణ గాడు ఫిదా అయిపోతాడు. మరి వీరిద్దరి లవ్ స్టోరీ ఎటు పోయింది? ఆ గుడిలో పెళ్లి జరిగిందా లేదా? అనేదే అసలు కథ.

Read also-Yellamma: దేవీను ఢీ కొట్టడానికి సిద్ధమైన స్టార్ హీరో..వేణు ఆలోచనలు అదుర్స్!

విశ్లేషణ  : 

Advertisement

డైరెక్టర్ ఎంఎం నాయుడు గారు ఒక పక్కా పల్లెటూరి కథకు కొంచెం భక్తిని, మరికొంత సెంటిమెంట్‌ని కలిపి ఈ బొమ్మను తీసిండ్రు. అమర్ దీప్ బుల్లితెర మీద ఎట్లున్నా, ఈ వెండితెర మీద మాత్రం పక్కా పల్లెటూరి పోరడిలా జీవించేసిండు. సినిమా స్టార్టింగ్ లో కొంచెం అటు ఇటు అయినా, ఇంటర్వెల్ దగ్గర నుండి మాత్రం కథలో దమ్ పెరుగుతది. మరీ ముఖ్యంగా గోదావరి అందాలను, పల్లెటూరి అమాయకత్వాన్ని మస్తుగా చూపించిండ్రు.

ప్లస్ పాయింట్స్ : 

అమర్ దీప్ నటన: పోరడు కృష్ణ పాత్రలో ఇరిగిదీసిండు. లవ్ సీన్లు, ఎమోషన్ సీన్లు పక్కాగా పండించిండు.

Advertisement

కామెడీ రచ్చ: టేస్టీ తేజ తన స్టైల్ లో నవ్వించగా, మహేష్ విట్టా తన తెలంగాణ మార్కు పంచులు వేసిండు.

పాటలు & కెమెరా: పాటల్లో ఆ పల్లెటూరి ఫీల్ కిర్రాక్ ఉంది. కెమెరా పనితనం అయితే బొమ్మను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లింది.

మైనస్ పాయింట్స్ :

పాత కాలం కథ: కథలో కొత్తదనం ఏం లేదు భయ్యా. అంతా మనకు ముందే తెలిసిపోతుంటది.

విలనిజం: విలన్ రోల్ చాలా డీలా పడ్డది, ఇంకాస్త గట్టిగా ఉండాల్సింది.

ట్విస్టులు లేవు: సినిమాలో షాక్ ఇచ్చే ట్విస్టులు ఏం లేవు, అంతా సాఫీగా సాగిపోతుంటది.

 

అసలు ముచ్చటకు వస్తే : 

బుల్లితెర నుండి వెండితెరకు రావడం అంటే మామూలు ముచ్చట కాదు. అమర్ దీప్ ఆ గ్యాప్ ని సక్సెస్‌ఫుల్ గా ఫిల్ చేసిండు. పల్లెటూరి ప్రేమకథలకు మన దేవుళ్ల టచ్ ఇవ్వడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఈ బొమ్మ మంచి కిక్కు ఇస్తది. అక్కడక్కడ కొంచెం బోర్ కొట్టినా, ఓవరాల్ గా మాత్రం ఒక ప్యూర్ లవ్ స్టోరీ చూసిన ఫీలింగ్ వస్తది.

బాటమ్ లైన్ : 

ఏమి ముందే అనుకోకుండా “బొమ్మ పర్వాలేదు భయ్యా.. ఈ వీకెండ్ లో ఒకసారి చూసేయొచ్చు!”

Sumathi Satakam Movie Review

Sumathi Satakam Movie Review  : 2.75/5

Related News

‘ఐయామ్ గేమ్’ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Dharmastala Niyojakavargam Movie Review : ‘ధర్మస్థల నియోజకవర్గం’ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Romanchakam Review : ‘రోమాంచకం’.. నవ్వుల ప్రయాణం..

సుమంత్ ప్రభాస్ ‘రోమాంచకం’ ట్విట్టర్ రివ్యూ..

‘కికు చిరంజీవి’ మూవీ రివ్యూ.. గుండె కుడివైపు ఉంటే.. రహస్యం ఎటువైపు దారితీసింది?

టాక్సిక్’ రివ్యూ.. గీత దాటలేదు, కానీ ఓపిక మాత్రం దాటింది!”

ది రెడ్ బ్యాగ్ మూవీ రివ్యూ.. క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?

అమీర్ లోగ్ మూవీ రివ్యూ.. పాతబస్తీ గల్లీ స్నేహం వర్కౌట్ అయ్యిందా?

Big Stories

Advertisement
×