E-Paper
Advertisement

కొత్త కథతో వచ్చిన డార్క్ చాక్లెట్.. సినిమా ఎలా ఉందంటే?

కొత్త కథతో వచ్చిన డార్క్ చాక్లెట్.. సినిమా ఎలా ఉందంటే?
Advertisement

Dark Chocolate Review:విశ్వదేవ్ రాచకొండ, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘డార్క్ చాక్లెట్’. కొత్త కాన్సెప్ట్‌తో, కాస్త డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు శశాంక్ శ్రీవత్సవాయ దర్శకత్వం వహించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అసలు కథేంటి? చూద్దాం.

కథ విషయానికి వస్తే 

Advertisement

యజ్ఞ (విశ్వదేవ్ రాచకొండ) తన కలల్లో కొందరు తనను ఇబ్బంది పెడుతున్నారని చెబుతుంటాడు. తనకు బాగా తెలిసిన హంస (బిందు మాధవి), గోపి (రాకేష్ రాచకొండ), బాబాయ్‌లను కూడా నిలదీస్తుంటాడు. అతడి ప్రవర్తనతో వాళ్లంతా అయోమయంలో పడతారు. అసలు యజ్ఞకు ఏం జరిగింది? అతడు చెబుతున్నది నిజమేనా? లేక కలల్లో కనిపిస్తున్నవన్నీ భ్రమలా? అనే విషయాల చుట్టూ సినిమా సాగుతుంది.

సినిమా విశ్లేషణ 

Advertisement

కాన్సెప్ట్ పరంగా చూస్తే ‘డార్క్ చాక్లెట్’ ఒక డిఫరెంట్ అటెంప్ట్ అని చెప్పాలి.. రియాలిటీకి, భ్రమలకు మధ్య జరిగే సంఘర్షణను చూపించే ప్రయత్నం చేశారు. కానీ దర్శకుడు ఈ కథను ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పడంలో తడబడ్డారనే చెప్పాలి.ఇందులో చాలా సీన్స్ గందరగోళంగా సాగుతాయి. పైగా పాత్రల మధ్య డైలాగ్స్ కూడా ఎక్కువగా ఉండటంతో కథపై ఆసక్తి తగ్గుతుంది.ఇక వచ్చిన సీన్లే మళ్లీ మళ్లీ వచ్చినట్లు అనిపించి బోర్ కొట్టిస్తాయి.

ఎవరెలా చేశారంటే 

విశ్వదేవ్ రాచకొండ, బిందు మాధవి తమ నటనతో ఆకట్టుకున్నారు. వివేక్ సాగర్ అందించిన BGM బాగుంది. కొన్ని విజువల్స్, సౌండ్ డిజైన్ కూడా కొత్తగా అనిపిస్తాయి. అయితే ఇవన్నీ సినిమాను నిలబెట్టలేకపోయాయి. కథనం నెమ్మదిగా సాగడం, పాత్రలతో ప్రేక్షకులు కనెక్ట్ కాకపోవడం ప్రధానమైన మైనస్‌లని చెప్పాలి.

ప్లస్ పాయింట్స్:

విశ్వదేవ్ రాచకొండ, బిందు మాధవి నటన

స్టోరీ బ్యాక్ డ్రాప్

వివేక్ సాగర్ BGM

కొన్ని విజువల్స్, సౌండ్ డిజైన్

మైనస్ పాయింట్స్:

గందరగోళంగా సాగే స్క్రీన్ ప్లే

రిపీటెడ్ సీన్స్

స్లోగా సాగే కథ

ఆడియన్స్ కి కనెక్ట్ కాని ఎమోషన్స్

మొత్తంగా చెప్పాలంటే ‘డార్క్ చాక్లెట్’లో కొత్త కథ ఉంది కానీ, దాన్ని చెప్పిన విధానం మాత్రం అంతగా ఆకట్టుకోలేదని చెప్పాలి. డిఫరెంట్ సినిమాలు ఇష్టపడేవారికి ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ కామన్ ఆడియన్స్ కి మాత్రం సినిమా కాస్త తలనొప్పిగా అనిపించే అవకాశాలే ఎక్కువ.

Dark Chocolate Movie Review & Rating :1.75 / 5

Tags

Related News

మౌళి ‘దొంగ నా కొడుకు’ మూవీ రివ్యూ!

‘ఇట్లు అర్జున’ మూవీ రివ్యూ..

సుడిగాలి సుధీర్ ‘జి.ఓ.ఏ.టి.’ మూవీ రివ్యూ..సినిమా ఎలా ఉందంటే?

‘మహాశక్తి’ మూవీ రివ్యూ..అమ్మవారిగా నయన్ మెప్పించిందా?

సూర్య సీన్ మూవీ రివ్యూ.. హ్యాట్రిక్ కొట్టారా?

‘సమ్మర్ హాలిడేస్’ మూవీ రివ్యూ.. నాటి జ్ఞాపకాలను గుర్తుచేసిందా?

నితీష్ తివారీ రామాయణ పార్ట్ -1 మూవీ రివ్యూ..ఈ దృశ్యకావ్యం మెప్పించిందా?

Big Stories

Advertisement
×