E-Paper
Advertisement

నిర్మాతగా బాలయ్య కూతురు తేజస్విని…మొదటి సినిమా హీరో ఎవరో తెలుసా?

నిర్మాతగా బాలయ్య కూతురు తేజస్విని…మొదటి సినిమా హీరో ఎవరో తెలుసా?
Advertisement

Nandamuri Tejaswini: సినిమా ఇండస్ట్రీలో వారసుల పరంపర కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది స్టార్ కిడ్స్ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా నిర్మాతలుగా కొనసాగుతూ ఉన్నారు. అయితే త్వరలోనే మరో స్టార్ కిడ్ నిర్మాతగా ఇండస్ట్రీలోకి రాబోతున్నారు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే నందమూరి వారసులు ఇదివరకు హీరోలుగా వెండితెరపై సందడి చేశారు మొదటిసారి వారసురాలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారు.

మెగా ఫోన్ పట్టబోతున్న నిర్మాత..

నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ఇక సినిమాలంటే చిన్నప్పటినుంచి ఎంతో ఆసక్తి ఉన్న తేజస్విని నిర్మాతగా ఇండస్ట్రీలోకి రాబోతున్నారని తెలుస్తోంది. మరి ఈమె చేయబోతున్న మొదటి సినిమా ఎలాంటి నేపథ్యంలో రాబోతుంది. హీరో హీరోయిన్లు ఎవరు అనే విషయానికి వస్తే.. ఇన్ని రోజులపాటు ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగిన భవన్(Bhuvan) మొదటిసారి మెగా ఫోన్ పట్టబోతున్నారు. నిఖిల్ నటించిన స్వయంబు సినిమా ద్వారా నిర్మాతగా సక్సెస్ అందుకున్న భువన్ ఈ సినిమాకు దర్శకుడుగా మారబోతున్నారని తెలుస్తుంది.

హీరోగా అన్వేష్..

Advertisement

ఇలా భువన్ దర్శకత్వంలో యువ నటుడు అన్వేష్ (Anvesh)హీరోగా నటించబోతున్నారు. అదేవిధంగా ఈ సినిమాలో కీలక పాత్రలో తమిళనాడు బాబి సింహ సందడి చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ కూడా పూర్తి అయ్యాయని, నవంబర్ 23వ తేదీ షూటింగ్ పనులను ప్రారంభం చేయబోతున్నారని సమాచారం. నవంబర్ 23వ తేదీ వైజాగ్ లోని గీతం యూనివర్సిటీలో ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక 2025 సమ్మర్ లో ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

అన్ స్టాపబుల్ షో సక్సెస్ ..

ఇలా నందమూరి వారసురాలు నిర్మాతగా ఇండస్ట్రీలోకి రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా నిర్మాణ వ్యవహారాలలో భాగంగా బాలయ్య అన్ని దగ్గరుండి చూసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక తేజస్వినికి ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి పట్టు ఉంది. ఇటీవల బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా నిర్మాణ వ్యవహారాలలో ఈమె కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో సక్సెస్ వెనుక తేజస్విని నందమూరి హస్తం ఉన్న సంగతి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో మంచి పట్టు సాధించిన ఈమె పూర్తిస్థాయిలో నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అన్ని విషయాలను అధికారికంగా ప్రకటించబోతున్నట్లు సమాచారం.

Advertisement

Also Read: బైక్ కాదు బీఎండబ్ల్యూ గిఫ్ట్ అడగాల్సింది.. ఒక్క హిట్ కే రేంజ్ మార్చిన జబర్దస్త్ బాబు!

Related News

రామ్ చరణ్ సినిమాలలో ఉపాసన ఫేవరెట్ మూవీ ఏదో తెలుసా? ఎందుకంత స్పెషల్ అంటే?

డబ్బు పవర్ అంటే ఇదేనేమో.. ఇట్లు అర్జున కోసం క్యూ కట్టేసిన టాలీవుడ్‌!

‘రియాలిటీ’ లో రఘుకుల తిలకా రారా సాంగ్..కిరణ్ అబ్బవరం క్లారిటీ!

కవ్వించే ఫోజులతో గిలిగింతలు పెడుతున్న మెగా డాటర్ నిహారిక!

‘స్వాభిమానం’ పద్ధతిలో అనిరుధ్ – కావ్య పెళ్లి? దీని ఆంతర్యం ఏంటంటే?

ఏపీ ప్రభుత్వంతో మంచు మనోజ్ దంపతులు కీలక ఒప్పందం.. రూ.36 కోట్లు పెట్టుబడి

బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రేపే దాదా ధమాకా!

Big Stories

Advertisement
×