E-Paper
Advertisement

భారత్‌ సమ్మిట్ వేదికగా రాజకీయ రగడ.. వీసాల రద్దు వెనుక మోడీ సర్కార్ వ్యూహమేంటి?

భారత్‌ సమ్మిట్ వేదికగా రాజకీయ రగడ.. వీసాల రద్దు వెనుక మోడీ సర్కార్ వ్యూహమేంటి?
Advertisement

Bharat Summit: వీసాల రద్దుకు కేంద్రం సాకులు వెతుక్కునే పనిలో పడింది. దేశ వ్యతిరేక శక్తులు సమ్మిట్‌కు వస్తున్నారనే ఆరోపణలు చేయడం వివాదాన్ని రాజకీయంగా మరింత వేడెక్కిస్తున్నది. ఏకంగా నల్ల రిబ్బన్‌లు ధరించి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలిపాలని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పిలుపునివ్వడం.. భారత్‌ సమ్మిట్‌పై కేంద్రం వైఖరి తీవ్రత తీరు ఎలా ఉందో తెలియజేస్తోంది. ప్రగతి శీల రాజకీయ పార్టీలు, మేధావులు, పౌర సమాజ ప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకురావడం ఈ భారత్‌ సమ్మిట్‌ ఉద్దేశం. అంతర్జాతీయ రాజకీయాలతో పాటు, సామాజిక, ఆర్థిక విధానాలపై ఈ సమ్మిట్‌లో చర్చలు జరుగుతాయి. ఇదో అంతర్జాతీయ సదస్సు కావడంతో మోడీ సర్కార్‌ దీనిపై సీరియస్‌ నజర్ పెట్టింది. దాదాపు వెయ్యి మంది దాకా విదేశీ ప్రతినిధులు అతిథులుగా సమ్మిట్‌కు హాజరు కానున్నారు. ఇందులో వంద మంది దాకా విదేశీయుల వీసాలను ఆకస్మికంగా కేంద్ర మంత్రిత్వ శాఖ రద్దు చేయడం అందిరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇది అంతర్జాతీయ చర్చకు తెర తీసింది.

భారత్ సమ్మిట్ వేదికగా రాజకీయ రగడ

Advertisement

దీనిపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. దేశ విద్రోహ శక్తుల కార్యక్రమంగా ముద్ర వేస్తున్న కేంద్ర సర్కార్‌ .. మరి మిగిలిన వారికి ఎందుకు పర్మిషన్ ఇస్తోంది? ఎందుకు దీన్ని అడ్డుకోవాలని చూస్తుందనే ప్రశ్నలను సంధిస్తోంది. అయితే ఇక్కడి బీజేపీ నేతలు కూడా ఈ సమ్మిట్‌పై తీవ్ర విమర్శలు చేయడంతో ఇది రాజకీయ వేడిని రగిలిస్తోంది. సమ్మిట్‌కు రాహుల్‌ గాంధీ చివరి రోజున ముఖ్య అతిథిగా పాల్గొననుండటంతో.. మోడీ సర్కార్‌ దీన్ని టార్గెట్ చేసినట్టుగా భావిస్తున్నాయి రాజకీయ వర్గాలు. రాహుల్‌ను ప్రపంచ దేశాల ముందు ప్రధాని అభ్యర్థిగా ప్రమోట్ చేయడానికే ఈ సదస్సు పెట్టారని స్టేట్ బీజేపీ ఆరోపిస్తోంది. అయితే దీన్ని కాంగ్రెస్‌ శ్రేణులు గట్టిగానే తిప్పికొడుతున్నాయి. ఇప్పుడు కొత్తగా రాహుల్ ప్రధాని అని చెప్పే అవసరం తమకు లేదని, అది ప్రపంచానికి అంతా తెలుసునని, మీరే మోడీ కాకుండా.. ప్రధాని అభ్యర్థిగా ఇంకెవరున్నారు..? అని సర్చ్‌ చేసుకుంటున్నారని మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఎటాక్‌ చేశారు.

విదేశీ అతిథుల వీసాల రద్దు

Advertisement

భారత్‌ సమ్మిట్‌ లాంటి కార్యక్రమాలు ఇప్పటి వరకు రెండే జరిగాయి. అదీ హైదరాబాద్‌ వేదికగానే. అందుకే కేంద్రం దీనిపై సీరియస్ నజర్ పెట్టింది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ టూర్‌ను కూడా ఆకస్మికంగా రద్దు చేసిన నేపథ్యంలో కూడా ఇదే రాజకీయం నడిచింది. అప్పుడూ దేశ ద్రోహ శక్తులతో రేవంత్‌ భేటీ కారణంగానే రద్దు  చేశామని కేంద్రం సమర్థించుకునే ప్రయత్నం చేసినా.. అది బీజేపీ అభద్రతాభావానికి పరాకాష్టగానే చూశారు తెలంగాణ జనం. ఇప్పుడు హైదరాబాద్‌లో జరుగుతున్న భారత్ సమ్మిట్‌పై కూడా అవే ఆంక్షల సాకులను చూపుతోంది. కానీ, వీసాలను రద్దు చేయడం కూడా కేంద్ర ప్రభుత్వం భయపడుతున్నదనే సంకేతాలు వెళ్తున్నాయనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. అయితే ఈ ‘దేశ ద్రోహులు, విదేశీ దేశ ద్రోహ శక్తులు’ అనే పదాలను బీజేపీ విరివిగా వాడుతూ రావడం పరిపాటే. అత్యవసర సమయాల్లో దాన్ని తన రాజకీయ అస్త్రంగా బీజేపీ వాడుతోంది. కానీ ఈ పదాలకు పదును తగ్గుతూ వస్తోంది. జనం నమ్మడం లేదు. దీనికి తాజా ఉదాహరణ.. జంతర్‌మంతర్‌ వద్ద జరిగిన కాక్రోచుల ఉద్యమమే.

భారత్ సమ్మిట్ కార్యక్రమంపై కేంద్ర ఫోకస్..

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని ఢిల్లీ కేంద్రంగా జెన్ జీ చేసిన ఉద్యమం.. కేంద్రానికి ఊపిరి సలపనీయలేదు. దీంతో బీజేపీ శ్రేణులు, కేంద్రం కూడా ఇందులో విదేశీ దేశ ద్రోహ శక్తులున్నాయని, విదేశీయుల హస్తం ఉందనే ప్రచారం చేసింది. అయినా ఆ ఉద్యమం ఆగలేదు సరికదా.. మరింత ఉధృత రూపం దాల్చింది. దీంతో మోడీ సర్కార్‌ దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడింది. విషయంలో పస లేనప్పుడు, దాన్ని ఫక్తు రాజకీయ అవసరం కోసం వాడుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు, కేంద్రం సెల్ఫ్ డిఫెన్స్ లో పడినప్పుడు ఇలాంటి మూస పద ప్రయోగాల వల్ల లాభం లేదని తేలిపోతున్నది.  జనం నుంచి పెద్దగా స్పందన రావడం లేదని తెలిసిపోతున్నది.  ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలతో కేంద్రానికి కూడా ఈ విషయం అవగతమవుతూ వస్తోంది.  కానీ మారుతున్న దేశ రాజకీయ సమీకరణల నేపథ్యంలో.. కాంగ్రెస్‌ వేస్తున్న ప్రతీ చర్యనూ చాలా క్షుణ్ణంగా కేంద్రం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందులోనూ భారత్ సమ్మిట్‌ లాంటి ప్రొగ్రెసివ్‌ కార్యక్రమాలపై సీరియస్‌గా ఫోకస్‌ చేస్తున్నది కేంద్రం.

Also Read: జీహెచ్ఎంసీకి ఏమైంది? ఆదాయం లేకపోయినా ఆ రెండు కార్పొరేషన్ల భారం ఎందుకు?

Tags

Related News

ఫామ్‌హౌజ్‌ చుట్టూ కుటుంబ సభ్యుల భూములు! కొండ పోచమ్మ నుంచి ఫామ్‌హౌజ్‌కు నీళ్లు నిజమే? కవిత నిప్పులాంటి నిజాలు..!

తెలంగాణ నర్సింగ్ కాలేజీల్లో విచిత్ర పరిస్థితి.. ఇలాంటి వారు కూడా ఉన్నారా..?

తెలంగాణ ఇసుక క్వారీల్లో అక్రమ బకాసురులు.. పట్టించుకోని అధికారులు!

తెలంగాణ మహిళలకు చీరల పంపిణీకి డేట్ ఫిక్స్ చేసిన సర్కార్.. ఎప్పుడంటే?

భారత్‌ సమ్మిట్‌పై కేంద్రం నజర్! దేశ వ్యతిరేక శక్తుల ముద్ర వేసే ప్రయత్నం.. ! విదేశీ అతిథుల వీసాలు రద్దు చేయడంతో కొత్త రచ్చ..

ప్రభుత్వ ఆసుపత్రిలో.. ఎలక్ట్రిక్ కారుకు ఛార్జింగ్ పెట్టుకుంటున్న డాక్టర్!

సోనియా బుక్‌పై బీఆరెస్‌ జోక్యం బ్లండర్‌! తెలంగాణతో ఆమె బంధాన్ని తక్కువ చేసి చూడలేం! వినోద్‌ కుమార్‌ వాదనతో ఎవరికి నష్టం?

Big Stories

Advertisement
×