E-Paper
Advertisement

రైలులో టికెట్ లేని ప్రయాణం.. ఆర్మీ జవాన్లు, మహిళా టీటీఈకి మధ్య గొడవ.. రెండుగా చీలిన నెటిజన్లు!

రైలులో టికెట్ లేని ప్రయాణం.. ఆర్మీ జవాన్లు, మహిళా టీటీఈకి మధ్య గొడవ.. రెండుగా చీలిన నెటిజన్లు!
Advertisement

Army Soldiers vs Woman TTE: ఆర్మీ జవాన్లు, మహిళా టీటీఈకి మధ్య టికెట్ విషయంలో చెలరేగిన వివాదం సోషల్ మీడియాను ఊపేస్తోంది. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఇద్దరు జవాన్లను టీటీఈ ప్రశ్నించడం.. ఆమెతో సైనికులు కాస్త దురుసుగా ప్రవర్తించడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు టీటీఈకి మద్దతు తెలుపుతున్నారు. తొలిసారి ఆర్మీ జవాన్లకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు.

ఇంతకీ ఏం జరిగిందంటే?

ఎక్స్ లో వైరల్ అవుతున్న వీడియోలో మహిళా టీటీఈ ఇద్దరు సైనికులను టికెట్లు చూపించమని అడిగారు. అయితే తాము కంగారులో రైలు ఎక్కామని, అందువల్ల టికెట్ తీసుకోలేకపోయామని వారిలో ఒకరు బదులిచ్చారు. దీంతో రైల్వే నిబంధనల ప్రకారం టికెట్ తో పాటు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుందని టీటీఈ జవాన్లకు స్పష్టం చేశారు. ప్రయాణికులు ఏ వృత్తిలో ఉన్నా రైల్వే నిబంధనలు అందరికీ ఒకేలా వర్తిస్తాయని ఆమె తేల్చిచెప్పారు.

Advertisement

జరిమానా చెల్లించేందుకు నిరాకరణ

అయితే టికెట్ డబ్బులతో పాటు జరిమానా చెల్లించేందుకు ఇద్దరు జవాన్లు ఏమాత్రం అంగీకరించలేదు. ‘చలానా కావాలంటే రాసుకోండి. మేము తర్వాతి స్టేషన్‌లో దిగిపోతాం. జరిమానా మాత్రం కట్టం’ అని జవాన్లలో ఒకరు టీటీఈకి తేల్చి చెప్పారు. దీంతో టీటీఈకి ఇద్దరు జవాన్లకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. మహిళా టీటీఈ లంచం డిమాండ్ చేస్తోదంని జవాన్లు ఆరోపించారు. కానీ వారి వ్యాఖ్యలను మహిళా టీటీఈ తీవ్రంగా ఖండించారు. తాను తన డ్యూటీని మాత్రమే చేస్తున్నట్లు తేల్చి చెప్పారు.

నెటిజన్ల భిన్నాభిప్రాయాలు

Advertisement

ఈ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మెుదలైంది. మహిళా టీటీఈకి చాలామంది మద్దతుగా నిలుస్తున్నారు. టీటీఈ తన పని తాను నిజాయితీగా చేసిందని.. రైల్వే నిబంధనలను సైనికులు గౌరవించాల్సిందేనని పలువురు కామెంట్స్ చేశారు. విధుల్లో ఉన్నా లేకపోయినా సైనికులు క్రమశిక్షణతో ఉండాలని మరికొందరు విమర్శలు చేశారు. ‘సైనికుడైనంత మాత్రాన టికెట్ లేకుండా ప్రయాణించే హక్కు ఉండదు. రైలు కదిలిన వెంటనే ఆయనే వెళ్లి టీటీఈని అడిగి టికెట్ తీసుకుని ఉంటే బాగుండేది’ అని ఓ నెటిజన్ రాసుకొచ్చారు. వ్యాఖ్యానించారు.

Also Read: ‘భోగాపురంపై హ్యాపీగా లేను.. అది జరిగిన రోజు ఎంతో సంతోషిస్తా’.. రానాతో లోకేశ్ కీలక వ్యాఖ్యలు!

సైనికులకు సపోర్టుగా పోస్టులు..

అయితే మరికొందరు నెటిజన్లు సైనికులకు మద్దతుగా పోస్టులు పెట్టారు. దేశ రక్షణ కోసం ప్రాణాలకు తెగించి పనిచేసే సైనికుల పట్ల కాస్త గౌరవ, మర్యాదలతో వ్యవహరించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ‘రైళ్లలో ఏ సైనికుడికీ జరిమానా విధించకూడదు, వారిని అవమానించకూడదు. వీలైతే వారి ప్రయాణం సాఫీగా సాగేలా సాయం చేయాలి. సైనికులకు తగిన గౌరవం ఇచ్చే టీటీఈలుగా మెలగాలి’ అని ఒక యూజర్ పోస్ట్ చేశారు. ‘టికెట్ లేకుండా ప్రయాణించడం జవాను తప్పే కావచ్చు, కానీ టీటీఈ కూడా వారితో గౌరవంగా మాట్లాడి ఉంటే బాగుండేది. ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించే అధికారం ఎవరికీ లేదు’ అని మరో వ్యక్తి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Also Read: ఆవు పేడతో అద్భుతం.. రూ. లక్షల్లో సంపాదిస్తున్న సాధారణ మహిళ.. ఇదెక్కడి వెరైటీ బిజినెస్!

Tags

Related News

ఇంజిన్ లేకుండానే పరుగులు.. బాబోయ్.. వందే భారత్‌లో ఇన్ని రహస్యాలా?

ఈ పాస్‌పోర్ట్‌కు సూపర్ క్రేజ్.. బెంగళూరులో రాత్రి 2 గంటల నుంచి బారులు తీరిన యువత

వర్షాలు లేకపోయినా జలపాతాల్లో నీరు ఎలా? కర్రెగుట్టల్లో వింత ప్రకృతి అద్భుతం!

ఏపీలో 5 అద్భుతమైన రోడ్ ట్రిప్స్.. ప్రకృతి అందాలు చూస్తే మైమరచిపోతారు!

రన్‌వే పైకి దూసుకొచ్చిన శునకం.. రెండు విమానాలకు తప్పిన ప్రమాదం, కోల్‌కత్తా ఎయిర్‌పోర్టులో ఘటన

లోకల్ ట్రైన్‌లో ఘోరం.. యువతిని వేధించి కిందికి తోసేసిన కీచకుడు.. చేయి కోల్పోయిన బాధితురాలు!

సంక్రాంతికి ఊరెళ్లాలా? రైలు టికెట్ల బుకింగ్.. ఎప్పటి నుంచంటే?

Big Stories

Advertisement
×