E-Paper
Advertisement

లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హిట్… 3 అపార్ట్మెంట్లు కొన్న బాబు?

లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హిట్… 3 అపార్ట్మెంట్లు కొన్న బాబు?
Advertisement

Big Tv Kissik Talks: బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమం చాలా మంచి ఆదరణ సొంతం చేసుకుంది. సెలబ్రిటీ టాక్ షోగా ప్రారంభమైన ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి వారం సెలబ్రిటీలు హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఇలా అభిమానులకు తెలియని ఎన్నో విషయాలను ముచ్చటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇక ఈవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో వీడియో విడుదల చేశారు. ఇక ఈవారం కిస్సిక్ టాక్స్(Kissik Talks) కార్యక్రమంలో జబర్దస్త్ బాబు అలాగే శ్రీవిద్య పాల్గొని సందడి చేశారు.

లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సక్సెస్..

ఈ ప్రోమో వీడియోలో భాగంగా వీరిద్దరూ వారి కెరియర్ కి సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను అలాగే తమ జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కూడా అభిమానులతో పంచుకున్నారు. ఇకపోతే జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా గుర్తింపు సంపాదించుకున్న బాబు ఇటీవల దర్శకుడిగా మారి లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ (Least Eligible Bachelor)అనే సిరీస్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ విడుదల అయ్యి చాలా మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఒకసారి మంచి సక్సెస్ కొట్టామంటే ఇండస్ట్రీలో తదుపరి అవకాశాలు రావడం అనేది సర్వసాధారణం. మరి ఈ సిరీస్ సక్సెస్ కావడంతో బాబుకి ఇండస్ట్రీలో అవకాశాలు రావడం గురించి ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది.

పెద్ద పెద్ద బ్యానర్స్ నుంచి ఫోన్ కాల్స్..

Advertisement

ఈ నేపథ్యంలోనే వర్ష మాట్లాడుతూ.. లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సిరీస్ సక్సెస్ కావడంతో హైదరాబాద్లో మూడు అపార్ట్మెంట్స్ కొన్నావట, ఈ సిరీస్ తర్వాత పెద్ద పెద్ద బ్యానర్స్ నుంచి కూడా ఫోన్ కాల్స్ వస్తున్నాయట నిజమేనా అంటూ వర్షా ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు బాబు సమాధానం చెబుతూ.. ఇప్పటివరకు తనకు ఒక ఫోన్ కాల్ కూడా రాలేదు అయితే ఇప్పుడు నువ్వు ఏకంగా మూడు నాలుగు అపార్ట్మెంట్లు కొన్నానని చెప్పడంతో ఇది నిజమే అనుకొని ఇకపై తనకి ఎవరూ కూడా ఫోన్ కాల్స్ చేయరని బాబు తెలిపారు. తను ఎలాంటి ఆస్తులు కొనుగోలు చేయలేదని నిర్మాతలు ఎవరైనా ఉంటే తనకు ఒక అవకాశం ఇవ్వండి అంటూ ఈ సందర్భంగా బాబు కోరారు.

Advertisement

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి కూడా మాట్లాడారు. అతను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత సక్సెస్ కోసం ఎంతో కష్టపడ్డారని, మనం ఎప్పుడు సక్సెస్ అవుతామంటూ ఎన్నో సందర్భాలలో కన్నీళ్లు కూడా పెట్టుకున్నానని బాబు తెలిపారు. జబర్దస్త్ ద్వారా తన కామెడీతో ప్రేక్షకులను మెప్పించిన ఈయన తనలో ఉన్న దర్శకత్వ ప్రతిభను బయట పెడుతూ అద్భుతమైన సిరీస్ ద్వారా సక్సెస్ అందుకున్నారు. మరి ఈ సిరీస్ సక్సెస్ కావడంతో తదుపరి బాబుకి సినిమా అవకాశాలు వస్తాయా? లేదా అనేది తెలియాల్సి ఉంది.

Also Read: నిర్మాతగా బాలయ్య కూతురు తేజస్విని…మొదటి సినిమా హీరో ఎవరో తెలుసా?

Related News

జబర్దస్త్ లో దర్శనమిచ్చిన ‘అగ్నిపరీక్ష’ రాజకుమారి!

నాగవ్వ పాట..వైష్ణవి సోనీ డ్యాన్స్.. ఫోక్ లవర్స్‌కు పూనకాలే!

బైక్ కాదు బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్ అడగాల్సింది.. ఒక్క హిట్ కే రేంజ్ మార్చిన జబర్దస్త్ బాబు!

ఒక్క జాతకం చెప్పడానికి వేణుస్వామి ఎంత తీసుకుంటారో తెలుసా?

ఫ్యామిలీ వీక్ లో సెలబ్రిటీ గెస్ట్ లు.. ఎవరి తరఫున ఎవరు రాబోతున్నారో తెలుసా?

డైరెక్టర్ గా కంటే ఆర్టిస్ట్ గా ఉండడమే మంచిది.. కడుపు నిండా తినలేని పరిస్థితి: జబర్దస్త్ బాబు

త్రిగుణ్, వంశీ పై నటరాజ్ రియాక్షన్.. నీతూతో ఏం చెప్పారంటే?

Big Stories

Advertisement
×