Honey Movie Review: ‘పలాస 1978’, ‘శ్రీదేవి సోడా సెంటర్’ వంటి చిత్రాలతో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు కరుణ కుమార్, ఈసారి రూట్ మార్చి ‘హనీ’ అనే సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌తో మన ముందుకు వచ్చారు. నవీన్ చంద్ర లాంటి వైవిధ్యమైన నటుడు తోడవడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.
Read also-Anaganaga oka Raju OTT: స్ట్రీమింగ్ కి సిద్ధమైన అనగనగా ఒక రాజు.. ఎప్పుడు ఎక్కడంటే?
ఈ కథ ప్రధానంగా మూఢనమ్మకాలు, క్షుద్రపూజల చుట్టూ తిరుగుతుంది. ఒక మధ్యతరగతి కుటుంబంలోకి ‘హనీ’ ప్రవేశించిన తర్వాత వారి జీవితాలు ఎలా తలకిందులయ్యాయి? శాస్త్రీయ ఆలోచనలు గల హీరో (నవీన్ చంద్ర), సమాజంలో వేళ్లూనుకున్న మూఢనమ్మకాల వల్ల తలెత్తే అనర్థాలను ఎలా ఎదుర్కొన్నాడు? అనేదే ఈ చిత్ర ప్రధానాంశం.
ఈ సినిమాకు దర్శకత్వం వహించిన కరుణ కుమార్ ఎప్పుడూ తన సినిమాల్లో ‘రా అండ్ రస్టిక్’ ఫీల్‌ని మిస్ అవ్వకుండా చూసుకుంటారు. ఈ సినిమాలో కూడా హారర్ ఎలిమెంట్స్‌ని చాలా సహజంగా, భయం గొలిపేలా తెరకెక్కించారు. కేవలం జంప్ స్కేర్స్ (హఠాత్తుగా వచ్చే శబ్దాలు) మీద ఆధారపడకుండా, కథలోని గంభీరతతో భయపెట్టే ప్రయత్నం చేశారు.
ఎప్పటిలాగే తన నటనతో సినిమాను నిలబెట్టారు. భయం, ఆవేదన, నిస్సహాయత వంటి ఎమోషన్స్‌ను అద్భుతంగా పండించారు. దివ్య పిళ్లై, దివిలు కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా దివి వాద్త్యా నటన అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంది. సినిమాలోని ‘హనీ’ పాత్రలో చిన్నారి బేబీ జయన్ని నటన భయాన్ని, సానుభూతిని రెండింటినీ కలిగిస్తుంది.
సంగీత దర్శకుడు అజయ్ అరసాడ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమాకు ప్రాణం పోసింది. హారర్ సీన్స్‌లో వచ్చే సౌండ్ డిజైన్ థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడికి వెన్నులో వణుకు పుట్టిస్తుంది. OVA ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి.
ఒక్క మాటలో..