E-Paper
Advertisement

కొరియన్ కనకరాజు మూవీ రివ్యూ: వరుణ్ తేజ్‌కు కావాల్సిన హిట్ దొరికిందా?

కొరియన్ కనకరాజు మూవీ రివ్యూ: వరుణ్ తేజ్‌కు కావాల్సిన హిట్ దొరికిందా?
Advertisement

Korean Kanakaraju Review:వరుస ఫ్లాపులతో కెరీర్‌లో కాస్త వెనుకబడిన వరుణ్ తేజ్ ఈసారి రిస్క్ తీసుకుని కామెడీ జానర్‌ను ఎంచుకున్నాడు. ఆపరేషన్ వాలెంటైన్, గాండీవధారి అర్జున, మట్కా తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొరియన్ కనకరాజుపై విడుదలకు ముందే మంచి బజ్ ఏర్పడింది. దర్శకుడు మేర్లపాక గాంధీ అంటే కామెడీకి పెట్టింది పేరు. అందుకే ఈ ఇద్దరి కాంబినేషన్‌పై అంచనాలు కూడా పెరిగాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను నిజంగానే నవ్వించిందా? వరుణ్ తేజ్‌కు బ్రేక్ ఇచ్చిందా?చూసేద్దాం.

ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది?

సినిమా మొదలైన కొద్దిసేపటికే అసలు ట్రాక్‌లోకి వచ్చేస్తుంది. మొదటి భాగం పూర్తిగా కామెడీ చుట్టూనే తిరుగుతుంది. వరుణ్ తేజ్, సత్య కలిసి చేసే హంగామా ప్రేక్షకులను బాగా ఎంటర్‌టైన్ చేస్తుంది. ఇద్దరి టైమింగ్ చాలా చోట్ల వర్కౌట్ అయింది. ముఖ్యంగా “బార్ ఓనర్ కూడా బాగా తెలుసు సార్”, “వేర్ ఈజ్ జంగ్‌కుక్?” వంటి డైలాగ్స్ థియేటర్లలో మంచి నవ్వులు పండిస్తున్నాయి. అయితే సినిమా మొత్తంలో హైలైట్ ఏదంటే స్మశానం ఎపిసోడ్ అని చెప్పాలి. ఆ సీక్వెన్స్‌కు థియేటర్లలో విజిల్స్, నవ్వులు ఒకేసారి వినిపిస్తున్నాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎక్కడా బోర్ కొట్టకుండా ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది.

సెకండ్ హాఫ్ ఎలా ఉంది?

Advertisement

ఇంటర్వెల్ తర్వాత మాత్రం సినిమా పూర్తిగా మరో మోడ్‌లోకి వెళ్లిపోతుంది. ఫాంటసీ, ఆధ్యాత్మిక అంశాలు, కొరియా బ్యాక్‌డ్రాప్, ఆత్మల కాన్సెప్ట్ కథలోకి ఎంటర్ అవుతాయి. కామెడీతో పాటు మిస్టరీ కూడా జోడించడానికి దర్శకుడు చేసిన ప్రయత్నం బాగానే అనిపిస్తుంది. అయితే కొన్ని చోట్ల కథ నెమ్మదించిన ఫీలింగ్ కలిగించినా, కొత్త కాన్సెప్ట్ వల్ల ఆసక్తి కొనసాగుతుంది.

నటీనటుల పెర్ఫార్మెన్స్

వరుణ్ తేజ్ ఈ సినిమాలో తన గత చిత్రాల కంటే ఎనర్జిటిక్‌గా కనిపించాడు. ముఖ్యంగా ఆత్మ శరీరంలోకి వచ్చిన తర్వాత చేసే బాడీ లాంగ్వేజ్, ఎక్స్‌ప్రెషన్స్ ఆకట్టుకుంటాయి. కామెడీని కూడా ఈజీగా క్యారీ చేశాడు.

Advertisement

సత్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. ప్రతి సీన్‌లో తన టైమింగ్‌తో నవ్వులు పండించాడు. నిజానికి సినిమా కామెడీ గ్రాఫ్‌ను మోసింది ఎక్కువగా ఈ ఇద్దరి కాంబినేషన్‌నే.

హీరోయిన్ రితికా నాయక్ కూడా మంచి స్క్రీన్ ప్రెజెన్స్ చూపించింది. ఆమె ఎంట్రీ, ‘కోరా’ స్టైల్ డైలాగ్స్ కొత్తగా అనిపిస్తాయి. వరుణ్‌తో కెమిస్ట్రీ బాగుంది. ‘కంసాహమ్నిదా’ పాట విజువల్‌గా బాగా తెరకెక్కింది. అలాగే ఫ్యాక్టరీ ఫైట్ మాస్ ప్రేక్షకులకు నచ్చేలా ఉంది.

టెక్నికల్‌గా ఎలా ఉంది?

సాంకేతికంగా సినిమా మంచి మార్కులు తెచ్చుకుంటుంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథకు బాగా సపోర్ట్ చేశాయి. ముఖ్యంగా కామెడీ సీన్స్‌లో బీజీఎమ్ మంచి ఇంపాక్ట్ ఇచ్చింది. నిర్మాణ విలువలు కూడా రిచ్‌గా కనిపిస్తాయి.

క్లైమాక్స్

ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు దర్శకుడు ఎమోషన్, ఫాంటసీ, మిస్టరీ అంశాలను కలిపి కథను ముగించే ప్రయత్నం చేశాడు. కొన్ని చోట్ల సినిమాటిక్ లిబర్టీలు కనిపించినా, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా చూస్తే అవి పెద్ద మైనస్‌గా అనిపించవు.

ప్లస్ పాయింట్స్

  • ఫస్ట్ హాఫ్
  • వరుణ్ తేజ్
  • సత్య
  • స్మశానం ఎపిసోడ్
  • ఫ్యాక్టరీ యాక్షన్ ఎపిసోడ్

మైనస్ పాయింట్స్

  • సెకండ్ హాఫ్‌లో మిస్ అయిన లాజిక్స్
  • సినిమాటిక్ లిబర్టీ

చివరిగా..

ఎలాంటి భారీ అంచనాలు లేకుండా థియేటర్‌కు వెళ్తే కొరియన్ కనకరాజు మంచి టైమ్‌పాస్ ఎంటర్‌టైనర్. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ కామెడీ, వరుణ్ తేజ్-సత్య కాంబినేషన్, స్మశానం ఎపిసోడ్ సినిమాకు పెద్ద ప్లస్. సెకండ్ హాఫ్‌లో కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా కొంత నెమ్మదించిన ఫీలింగ్ ఉంటుంది. అయినప్పటికీ ఫ్యామిలీతో కలిసి నవ్వుకోవాలనుకునే వారికి ఈ వీకెండ్‌లో ఒకసారి ట్రై చేయొచ్చు.

Korean Kanakaraju Review And Rating :3/5

Tags

Related News

కుస్తీ తక్కువ.. వినోదం ఎక్కువ!

కామెడీ వదిలి థ్రిల్లర్ తీసిన అభి.. ‘కర్మాఖ్య వర్కౌట్ అయ్యిందా?

Newtons Third Law Review : ‘న్యూటన్స్ థర్డ్ లా’ రివ్యూ..

‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ మూవీ రివ్యూ!

శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ.. డెబ్యూ మూవీతో జయకృష్ణ సక్సెస్ కొట్టాడా?

Chennai LoveStory Review : ‘ చెన్నై లవ్ స్టోరీ ‘ మూవీ రివ్యూ..

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

Big Stories

Advertisement
×