E-Paper
Advertisement

రణ్‌బీర్ కంటే ముందే రాముడిగా సల్మాన్.. కానీ చివరికి జరిగింది ఇదే!

రణ్‌బీర్ కంటే ముందే రాముడిగా సల్మాన్.. కానీ చివరికి జరిగింది ఇదే!
Advertisement

Salman Ramayana:ఇండియన్ సినీ ఇండస్ట్రీలో రామాయణ మహాభారతాలను వెండితెరపైకి ఎక్కించడం కొత్తేమీ కాదు. ఇతిహాసాలకు ఉన్న డిమాండ్ అలాంటిది. మరి. అయితే తాజాగా రణ్‌బీర్ కపూర్ రాముడిగా రామాయణం మరోసారి తెరకెక్కుతుండటంతో ఈ ఇతిహాసం ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ డిబెటబుల్ అయిపోయింది. ఈ సినిమాలో సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

సల్మాన్ కూడా రాముడిగా నటించాడా?

అయితే తాజాగా వినిపిస్తున్న ఒక క్రేజీ న్యూస్ ఏంటంటే… మన కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఇదివరకే రాముడి అవతారంలో కనిపించాడట.ఏంటి… సల్మాన్ రాముడిగానా? అలాంటి సినిమా ఏదీ లేదే అని అనుకుంటున్నారా? అయితే ఈ విషయం మీకు తెలియాల్సిందే.

1990ల్లోనే మొదలైన రామాయణం

Advertisement

ఇది ఇప్పటి కథ కాదు… 1990ల కాలం నాటి కథ.సోహెల్ ఖాన్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ రాముడిగా రామాయణం సినిమాని గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. సల్మాన్ ఖాన్ రాముడి వేషం వేయగా, ఆయనకు జోడిగా సీతమ్మగా అప్పటి స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రేను అనుకున్నారట మేకర్స్.

ఇక ఇందులో మరో కీలక పాత్ర కోసం అప్పటి ఫైర్‌బ్రాండ్ పూజా భట్‌ని తీసుకోవాలనుకున్నారట మేకర్స్.

40 శాతం పూర్తైన సినిమా

Advertisement

అంతేకాదండోయ్… ఈ సినిమా దాదాపు 40 శాతం కూడా కంప్లీట్ అయిందట. సల్మాన్ ఖాన్ రాముడి గెటప్‌లో విల్లు, బాణంతో దిగిన ఫోటోలు అప్పట్లో మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి కూడా.తాజాగా రణ్‌బీర్ కపూర్ రామాయణం వార్తల్లో ఉండటంతో మరోసారి సల్మాన్ ఖాన్ రాముడి గెటప్‌లో దిగిన ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి.

అసలు సినిమా ఎందుకు ఆగిపోయింది?

అయితే దాదాపు 40 శాతం పూర్తయిన సినిమాని మళ్లీ పరుగులు పెట్టించకుండా ఎందుకు పక్కన పెట్టారు అన్న అనుమానం చాలామందిలో కనిపిస్తుంది.అయితే దీనికి కారణం బడ్జెట్ లేకపోవడమో మరొకటో కాదు.దీనికి అసలైన కారణం అప్పట్లో ఈ సినిమాలో నటించాల్సిన పూజా భట్‌తో దర్శకుడు సోహెల్ ఖాన్ రిలేషన్షిప్ పెట్టుకోవడం వల్లే సినిమా ఆగిందట.

ఇక వారి విషయం రెండు కుటుంబాల వద్దకు వెళ్లిందని అప్పట్లో బాలీవుడ్ మీడియా ఊదరగొట్టింది. అయితే ఆ పరిస్థితిని సర్దుబాటు చేయాలని సల్మాన్ ఖాన్ ప్రయత్నించారని వార్తలు కూడా వినిపించాయి. చివరికి పూజా భట్ ఆ సినిమా నుండి తప్పుకోవడంతో సినిమా కాస్త అటకెక్కిందని ఊహాగానాలు వినిపించాయి.

అయితే ఇలా సర్క్యులేట్ అయిన రూమర్స్‌పై ఆ తారలెవ్వరు ఇప్పటివరకు నోరు విప్పకపోవడం గమనార్హం.

రామాయణం తీయడం అంత ఈజీ కాదు

నిజానికి రామాయణం లాంటి సినిమాలు తీయాలంటే అంత ఈజీ కాదు. మంచి నటులు, భారీ బడ్జెట్, కళ్లు మిరుమిట్లు గొలిపే సెట్లు, నిపుణులైన వీఎఫ్‌ఎక్స్ ఆర్టిస్టులు… ఇలా అన్నీ కలిస్తేనే పెద్ద తెరపై రామాయణాన్ని అద్భుతంగా పండించవచ్చు.

ఇక సల్మాన్ ఖాన్ సినిమా అలా అటకెక్కితే ఆ తర్వాత ఎన్నో సినిమాలు రామాయణం నేపథ్యంలో తెరకెక్కాయి. అయితే వాటిలో చాలావరకు కాసులు కొల్లగొట్టగా, ఆదిపురుష్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి.

ఇప్పుడు అందరి చూపు నితీష్ తివారీ రామాయణంపైనే

ఇక ప్రస్తుతం నితీష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న రామాయణం భారీ అంచనాలను మోస్తోంది. మొదటి భాగాన్ని 2026 దీపావళికి, రెండో భాగాన్ని 2027 దీపావళికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

ALSO READ:బ్లడ్‌బాత్‌తోనే పాన్ ఇండియా హీరో అవుతావా నాని ?

ఇక ఈ సినిమా గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉండటంతో మరొకసారి సల్మాన్ ఖాన్ రామాయణం మీడియాలో హైలెట్ అయింది.ఒకవేళ నిజంగానే సల్మాన్ ఖాన్ రాముడిగా నటించి ఉండి ఉంటే మాత్రం అది సల్మాన్ కెరీర్‌లో ఒక గొప్ప మైల్‌స్టోన్‌గా మిగిలిపోయేది. చూడాలి… ముందు ముందు ఏమైనా అలాంటి పౌరాణిక పాత్రలో సల్లు భాయ్ కనిపిస్తాడు లేదో!

Tags

Related News

విభిన్న గెటప్స్ లో శర్వానంద్.. ‘జార్జ్ క్రిష్’ నుండి ఫస్ట్ బూస్టర్ రిలీజ్!

ది ప్యారడైజ్ దెబ్బ.. టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ లో ఇప్పుడైనా మార్పు వస్తుందా?

మా ఇంటి వాచ్‌మెన్ ఫోన్‌లో నా ఇంటిమేట్ సీన్స్.. నరకం చూశా – రాధిక ఆప్టే

డింపుల్ హయతి నెలకు అంత సంపాదిస్తుందా..? సినిమాల కన్నా ఎక్కువే..

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత..

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

నాని కెరీర్‌లోనే బిగ్ రిలీజ్.. ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ లెక్కలు ఇవే!

అబ్బబ్బా.. ఖుషీ కపూర్ ఏంటి ఈ లుక్! ఫ్యాన్స్‌కి ఫుల్ ట్రీట్

Big Stories

Advertisement
×