Cult Movie Review and Rating:నటీనటులు: విశ్వక్ సేన్, గాయత్రీ భరద్వాజ్, తారక్ పొన్నప్ప, మురళి శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు
దర్శకత్వం: విశ్వక్ సేన్
జానర్: యాక్షన్ థ్రిల్లర్ / స్లాషర్ ఫిల్మ్
డీఎస్పీ సంకల్ప్ (విశ్వక్ సేన్) తన పద్ధతిలో నేరాలను అణచివేసే ఒక పవర్ పుల్ పోలీస్ ఆఫీసర్. రకరకాల క్రైమ్స్, వాటి వెనుక ఉన్న ముఖాలను ఎదిరించే క్రమంలో సంకల్ప్ జీవితంలో కొన్ని ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. ఆ శత్రువులను, ప్రమాదాలను ఆయన ఎలా ఎదుర్కొన్నాడు? ఈ ప్రయాణంలో అసలు రహస్యం ఏంటి అనేదే ఈ చిత్ర కథాంశం.
విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహించిన సినిమా కావడంతో ‘కల్ట్’పై మంచి హైప్ క్రియేట్ అయింది. ఇండియాలో మొదటిసారిగా వస్తున్న స్లాషర్ ఫిల్మ్ జోనర్ కావడంతో మేకింగ్ పరంగా కొత్త ప్రయత్నం చేసినట్లు స్పష్టమవుతుంది. అయితే, సినిమా ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదనే చెప్పాలి.మొదటి భాగంలో విశ్వక్ సేన్ ఎంట్రీ , కొన్ని యాక్షన్ బ్లాక్స్ బాగానే ఉన్నప్పటికీ, కథనం సాగే తీరు ప్రేక్షకులను పూర్తి స్థాయిలో కట్టిపడేసేలా చేయలేకపోయింది. దర్శకుడిగా విశ్వక్ సేన్ యాక్షన్ పై పెట్టిన శ్రద్ధ బలమైన భావోద్వేగాలపై , కథనంపై పెట్టలేదనే భావన కలుగుతుంది. సెకండాఫ్‌లో వచ్చే సన్నివేశాలు మరింత రొటీన్‌గా మారడం సినిమాకు మైనస్‌గా మారింది. కేవలం యాక్షన్ లవర్స్‌ను మినహాయిస్తే, సాధారణ ప్రేక్షకులకు ఈ సినిమా ఎక్కడా కనెక్ట్ అవ్వడం కష్టమే.
also read:పెళ్లి పీటలెక్కాల్సిన శివ.. ప్రియాంకను మోసం చేస్తున్నాడా?ముఖేష్ షాకింగ్ కామెంట్స్!
విశ్వక్ సేన్ ఎనర్జిటిక్ యాక్షన్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్
కొన్ని వైలెంట్ యాక్షన్ స్టంట్స్, ఇంటర్వెల్ బ్యాంగ్
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్
పూర్తిగా గాడి తప్పిన స్క్రీన్ ప్లే మరియు నెమ్మదించిన కథనం
అవసరానికి మించి ఎక్కువగా ఉన్న హింస, వయలెన్స్
ఎమోషనల్ కనెక్ట్ మిస్ అవ్వడం
మంచి పాయింట్‌ను ఎంచుకున్నప్పటికీ, దానిని తెరపై ఆకట్టుకునేలా మలచడంలో తడబడటంతో ఈ ‘కల్ట్’ ప్రేక్షకులకు కేవలం యావరేజ్ అనుభూతిని మాత్రమే మిగుల్చుతుంది.