E-Paper
Advertisement

పరిషత్ ఎన్నికల్లో వైసీపీకి ఊహించని షాక్.. ఇద్దరు మాజీ ఎంపీల ఓటమి, ఎక్కడెక్కడ?

పరిషత్ ఎన్నికల్లో వైసీపీకి ఊహించని షాక్..  ఇద్దరు మాజీ ఎంపీల ఓటమి, ఎక్కడెక్కడ?
Advertisement

AP Parishad Election result: ఏపీలో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నిక ఫలితాల్లో వైసీపీకి ఊహించని మరో షాక్ తగిలింది. పార్లమెంటులో అడుగుపెట్టిన ఇద్దరు మాజీ ఎంపీలు.. ఈసారి ఘోరంగా ఓటమి పాలయ్యారు. ఒకటి అల్లూరి జిల్లా కాగా, మరొకటి కోనసీమ జిల్లా వంతైంది. అసలు మేటరేంటి?

పరిషత్ ఎన్నికల్లో వైసీపీకి ఊహించని షాక్

ఏపీలోని జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి మరొక షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు మాజీ ఎంపీలు పరాజయం పాలయ్యారు. ఇద్దరు కూడా టీడీపీ అభ్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు. ఆయా ప్రాంతాల్లో పోటీ చేసేందుకు వైసీపీ తరపున అభ్యర్థులు దూరంగా ఉండడంతో నేరుగా మాజీ ఎంపీలు బరిలోకి దిగాల్సి వుందని సమాచారం.

ఇద్దరు మాజీ ఎంపీల ఓటమి, అల్లూరి, కోనసీమ జిల్లాల్లో

Advertisement

ఏపీలో జరిగిన పరిషత్ ఎన్నికల్లో కూటమి విజయ ఢంకా మోగించింది. వైసీపీ నుంచి ఎలాంటి ప్రతిఘటన లేదు. ఫలితంగా కూటమి అభ్యర్థులు ఎన్నిక తేలికైంది. తాజాగా కోనసీమ జిల్లా కె. గంగవరం జెడ్పీటీసీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు అమలాపురం మాజీ ఎంపీ చింతా అనురాధ. ఆమె .. టీడీపీ అభ్యర్థి రవ్వ సీతామహాలక్ష్మి చేతిలో ఆమె 7 వేలకు పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఒకానొక దశలో జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ అభ్యర్థిగా ఆమెని ప్రచారం చేశారు. అనురాధ గెలుపు కోసం పిల్లి సుభాష్ చంద్రబోస్ వంటి సీనియర్ నేతలు విస్తృతంగా ప్రచారం చేసినా ఆ పార్టీకి విజయం దక్కలేదు.

మరొకటి అల్లూరి సీతారామరాజు జిల్లా. ఈ జిల్లాలో జెడ్పీ పీఠాన్ని ఎగురేసుకుపోయింది వైసీపీ. కొయ్యూరు జడ్పీటీసీ సీటు నుంచి బరిలోకి దిగిన అరకు మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి పరాజయం పాలయ్యారు. టీడీపీ అభ్యర్థి హిమబిందు చేతిలో 978 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇక్కడ మాదవి గెలిస్తే ఆమె జెడ్పీ ఛైర్మన్ అయ్యేది. పార్టీ గెలిచినా ఆమె ఓటమి పాలయ్యారు. ఇద్దరు మాజీ ఎంపీలు ఓటమ పాలుకావడంతో రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

ALSO READ: అన్నమయ్య జిల్లాలో విషాదం.. తల్లిని చంపిన తండ్రి.. మనస్తాపంతో కుమారుడు ఆత్మహత్య!

Related News

అన్నమయ్య జిల్లాలో విషాదం.. తల్లిని చంపిన తండ్రి.. మనస్తాపంతో కుమారుడు ఆత్మహత్య!

ఉరికొయ్యకు వేలాడిన తల్లి.. ఆ పాదాల చెంతే కన్నీటి పర్యంతమైన పసిగుండె!

విజయనగరం జిల్లాలో బొత్స ఆధిపత్యానికి మేనల్లుడు గండి.. చక్రం తిప్పనున్న మేనల్లుడు చిన్న శ్రీను

జగన్ దారిలో వైసీపీ నేతలు.. చెవిరెడ్డి కీలక వ్యాఖ్యలు.. మరో ఆరునెలల్లో ఎన్నికలు-తడాఖా చూపిస్తాం

పరిషత్ ఎన్నికల్లో దేవుడి స్క్రిప్ట్ రిపీట్.. 17 జిల్లాల్లో వైసీపీ ఎన్నిసీట్లు అంటే.. ఆ 11 జిల్లాలు మాత్రమే

కంచుకోటలు కూలినా వైసీపీ పరువు కాపాడిన అల్లూరి జిల్లా.. జెడ్పీ పీఠంపై ఫ్యాన్ పార్టీ, కూటమిని దెబ్బ కొట్టిన

స్థానిక ఎన్నికల్లో తండ్రీ-కొడుకులకు భయం.. ఆ భయం నన్ను వెంటాడుతోంది-అంబటి, ‘బిగ్‌టీవీ స్ట్రెయిట్ టాక్‌’లో..

Big Stories

Advertisement
×