E-Paper
Advertisement

ఢిల్లీని మింగేస్తున్న అదృశ్య మృత్యువు.. గాలి పీల్చినా విషమే.. అసలు ఏమైంది?

ఢిల్లీని మింగేస్తున్న అదృశ్య మృత్యువు.. గాలి పీల్చినా విషమే.. అసలు ఏమైంది?
Advertisement

Delhi Air Pollution: మనం తాగే నీటిని ఫిల్టర్ చేసుకుంటున్నాం. కూరగాయలను పండ్లను తినే ముందు కడుక్కుంటున్నాం. మరి పీల్చే గాలిని ఏం చేయాలి? ఇది ప్రపంచంలోనే శక్తివంతమైన దేశ రాజధాని ఢిల్లీ కథ. ప్రతి ఏటా చలికాలం వస్తే చాలు ఢిల్లీ నగరం ఒక అదృశ్య మృత్యువు గుప్పిట్లోకి వెళ్ళిపోతుంది. గాలి పీల్చడమే ఒక శాపంగా మారిపోతుంది. అసలు ఎందుకు ఈ పరిస్థితి ఢిల్లీ చుట్టూ జరుగుతున్న ఆ బ్లేమ్ గేమ్ ఏంటి తెలుసుకుందాం. మొదటి అంశాన్ని చూస్తే ఢిల్లీ భౌగోళికంగా ఉన్న లొకేషన్ ముంబై లేదా చెన్నై లాంటి నగరాలకు పక్కనే సముద్రం ఉంటుంది కాబట్టి ఎంత పొల్యూషన్ వచ్చినా కూడా సముద్రపు గాలులు దాన్ని నెట్టేస్తాయి పొల్యూషన్ పొగని కానీ ఢిల్లీ చుట్టూ భూమి మాత్రమే ఉంది అంటే ఇది ల్యాండ్ లాక్డ్ సిటీ అన్నమాట. దీనికి తోడు ఢిల్లీకి కేవలం 250 kmల దూరంలోనే ఆకాశాన్ని తాకే హిమాలయ పర్వతాలు ఉన్నాయి. అవి బారి కోట గోడలాగా నిలబడి ఉంటాయి. చలికాలంలో వచ్చే చల్లటి గాలులు ఈ పొగను మోసుకెళ్తూ హిమాలయాల గోడను దాటలేక మళ్ళీ వెనక్కి వచ్చి ఢిల్లీలోనే ఆగిపోతాయి. సైన్స్ భాషలో దీన్ని థర్మల్ ఇన్వర్షన్ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే చలికాలపు వాతావరణం అనేది ఢిల్లీ అనేది ఒక గిన్నెలా అనుకుంటే ఆ గిన్నె మీద మూత పెట్టేస్తుంది అదృశ్య మూతలాగా అందుకే ఆ పొగ అంతా కూడా పైకి పోకుండా పక్కకు పోకుండా లోపలనే ఉండిపోతుంది.

ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే ఏమిటి..?

Advertisement

ఇంతకీ ఢిల్లీ గాలి ఎంత ప్రమాదకరంగా మారిందో అర్థం చేసుకోవాలంటే అసలు మనం పీల్చే గాలి నాణ్యత ఎంత ఉండాలో తెలియాలి. దీన్నే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటారు. సున్నా నుండి 50 వరకు ఉంటే అత్యంత స్వచ్ఛమైన గాలి అని అర్థం. 51 నుండి 100 వరకు ఉంటే సాధారణమైన గాలి అని అర్థం. 200 దాటినట్లయితే ఇక శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. కానీ శీతాకాలంలో ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏకంగా 400 నుండి 450 దాటేసి తీవ్రమైన స్థాయికి వెళ్ళింది. అంటే సగటు మనిషి రోజుకు 20 నుండి 25 సిగరెట్లు తాగితే ఎంత ఊపిరి తిత్తుల నష్టం జరుగుతుందో ఢిల్లీ గాలి పీల్చడం వల్ల కూడా అంతకంటే ఎక్కువ ప్రమాదం పొంచి ఉందన్నమాట.

మూతపడిన గిన్నెలా ఢిల్లీ..

Advertisement

ప్రస్తుతం మనం అనుకున్నాం కదా ఢిల్లీ అనేది ఒక గిన్నె అయితే ఆ గిన్నె మీద పెట్టే మూత ఈ అదృశ్య వాతావరణం అనేది. ప్రస్తుతం మూత పెట్టిన గిన్నెగా మారిన ఢిల్లీకి చుట్టుపక్కల రాష్ట్రాలు తమవంతు పొగను నొక్కి నొక్కి పంపుతున్నాయి. ప్రతి ఏటా జరిగే తంతు కూడా ఇదే. ఏట అక్టోబర్ నవంబర్ రాగానే పంజాబ్ హర్యానాలో కరీఫ్ సీజన్ కి సంబంధించిన వరికోతలు అప్పటికే పూర్తయి ఉంటాయి కాబట్టి ఆ తర్వాత గోధుమ పంట వేయాలి కాబట్టి ఆ వరి కొయ్యలను కాల్చుతారన్నమాట. ఈ రెండిటి మధ్యన కరీఫ్ కి రబీ కి మధ్యన తక్కువ టైం 15 20 రోజులే టైం ఉంటుంది కాబట్టి శుభ్రం చేయడానికి
మిగిలిన గడ్డిని తగలబెట్టడమే ఏకైక పరిష్కారకంగా చూస్తున్నారు. అంతేకాదు అదే చౌకైన మార్గంగా చాలా మంది భావిస్తున్నారు. అలా కాల్చొద్దని పర్యావరణ వేత్తలు మొత్తుకుంటున్న కఠిన చట్టాలు ఉన్నా కూడా యంత్రాల కొరత వల్ల అవగాహన లేమి వల్ల రైతులు కూడా అలాగే చేస్తున్నారు. ఈ పొలాల పొగను చలికాలపు గాలులు ఓ పెద్ద ఫ్యాన్ లాగా నెట్టుకుంటూ నేరుగా ఢిల్లీలోకి తీసుకొస్తున్నాయి. దీనికి తోడు ఉత్తరప్రదేశ్ హర్యానా నుండి వచ్చే వేలాది పాత డీజిల్ లారీలు అక్కడి ఫ్యాక్టరీల పొగ
కూడా ఢిల్లీ గాలిని మరింత విషపూరితం చేస్తుంది. జనం ఓపక్క ఊపిరాడక చస్తుంటే రాజకీయ పార్టీలు మాత్రం విమర్శల యుద్ధంలో మునిగిపోయాయి.

పంట తగలబెట్ట కుండా ఆపడంలో విఫలం..

పంజాబ్ లో ప్రస్తుతం ఆప్ ప్రభుత్వం ఉంది. అక్కడ రైతులు పంట వ్యర్ధాలను తగలబెట్టకుండా ఆపడంలో ఆప్ సర్కార్ పూర్తిగా విఫలమైందనేది బిజెపీ నేతలు ఆరోపిస్తున్నారు. పంజాబ్ లో పంట వ్యర్ధాలు తగలబెట్టడం చాలా వరకు తగ్గించామని ఆప్ అంటుంది. ఢిల్లీ పక్కనే ఉండి బీజెపీ పాలిస్తున్న హర్యానాలో కూడా పంట వ్యర్ధాలను దహనం చేస్తుంటారు. మరి అది కనిపించట్లేదా బిజెపీ నాయకులకి యూపీ నుండి వచ్చే పాత డీజిల్ వాహనాల వల్ల కూడా కాలుష్యం పెరుగుతుందని ప్రత్యారోపణ చేస్తుంది ఆ పంజాబ్ లో పంట తగలబెట్టడం చాలా వరకు తగ్గించామని ఆపంటుంది. పరిస్థితి మరీ చెయి దాటిపోవడంతో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రస్తుతం ఢిల్లీలో 400 దాటేసింది. దీంతో అధికారులు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్ 3 అంటే జిఆర్ఏపి స్టేజ్ 3 ఆంక్షలు అమలు చేస్తున్నారు. దీని ప్రకారం ఢిల్లీలో పాతబిs పెట్రోల్ వాహనాలుబిs4 డీజిల్ కార్లు తిరగడం నిషేధం.

స్కూళ్లను మూసేసి ఆన్లైన్ క్లాసులు..

దుమ్ములేపే అన్ని రకాల ఇళ్ల నిర్మాణాలు కూల్చివేత పనులను పూర్తిగా ఆపేశారు. చిన్న పిల్లల ఆరోగ్యం కోసం ఐదవ తరగతి వరకు స్కూళ్లను మూసేసి ఆన్లైన్ క్లాసులు పెట్టారు. కానీ ఇవన్నీ తాత్కాలిక ఆంక్షలు. మరి ఢిల్లీ కాలుష్యానికి శాశ్వత పరిష్కారం ఏంటి? అంటే ఢిల్లీ కూడా బీజింగ్ నేర్చుకున్న పాఠాన్ని చదవాలి. చైనా రాజధాని బీజింగ్ ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత కాలుష్యకారక నగరాల్లో ఒకటిగా ఉండేది. కానీ వాళ్ళు 10ఏళ్ల పాటు పక్కా ప్రణాళికతో బస్సులు కార్లను ఎలక్ట్రిక్ గా మార్చి పంట వ్యర్థాలతో బయోగ్యాస్ తయారు చేసి కాలుష్యాన్ని 40% తగ్గించుకున్నారు. మరి అలా మన ఢిల్లీ ఎందుకు చేయలేదు కాలుష్యానికి సరిహద్దులు లేవు. అది ఓటు బ్యాంకు రాజకీయాలను చూసి రాదు. రాజకీయ పార్టీలు ఆరోపణల పొగను ఎంత పెంచితే సామాన్య పౌరుడి ఆయుష్యు అంతగా కరిగిపోతుంది. నిందల గిన్నెలో రాజకీయాలు వండడం ఆపేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా పోరాడితేనే దేశ రాజధానికి స్వచ్ఛమైన గాలి పీల్చే ప్రాథమిక హక్కు తక్కుతుంది.

Also Read: అన్నమయ్య జిల్లాలో విషాదం.. తల్లిని చంపిన తండ్రి.. మనస్తాపంతో కుమారుడు ఆత్మహత్య!

Tags

Related News

పల్లె పల్లెకూ హైస్పీడ్ ఇంటర్నెట్.. రూ. 3,189 కోట్లతో తెలంగాణలో ‘డిజిటల్ విప్లవం’!

జీహెచ్‌ఎంసీ అడ్వర్టైజ్‌మెంట్‌లో కోట్ల కుంభకోణం.. పట్టించుకోని అధికారులు!

ఎవరీ వైఎస్ అనిల్ రెడ్డి? దేశవ్యాప్తంగా ఆయన పేరే ఎందుకు మారుమోగుతోంది?

హైదరాబాద్‌కు జలగండం.. ఈ వాటర్ ఎమర్జెన్సీకి కారణమేంటి?

‘సర్’ పై వ్యూహాత్మక మౌనం ! బీఆర్‌ఎస్ సైలెంట్ మోడ్‌..! ఆ మౌనం వెనుక మతలబేమిటీ…? పైగా ప్రతిపక్షంపైనే విమర్శల దాడి!

బియ్యం వ్యాపారులకు ప్రభుత్వం బిగ్ షాక్.. ఇకపై అలా చేస్తే జైలుకే..?

డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల పథకం ఫెయిలైందిక్కడే! ఇందిరమ్మ ఇండ్లు ఓకే.. ‘టవర్స్‌’ పై జిల్లాల్లో అనాసక్తి! లబ్దిదారుడి వాటే అసలు సమస్య?

Big Stories

Advertisement
×