E-Paper
Advertisement

Psych Siddhartha Movie Review : ‘సైక్ సిద్ధార్థ’ మూవీ రివ్యూ

Psych Siddhartha Movie Review : ‘సైక్ సిద్ధార్థ’ మూవీ రివ్యూ
Advertisement

Psych Siddhartha Movie Review : టాలీవుడ్ యంగ్ హీరో నందు, యామిని భాస్కర్ హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సైక్ సిద్ధార్థ’. ‘మీలాంటి యువకుడి కథ’ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన ఈ సినిమాను హీరో నందు, శ్యాంసుందర్ రెడ్డితో కలిసి సురేష్ ప్రొడక్షన్స్, రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. డిసెంబర్ 12న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ‘అఖండ 2’ మూవీ రిలీజ్ కారణంగా, చివరి నిమిషంలో వాయిదా పడింది. ట్రైలర్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ మూవీ జనవరి 1న న్యూ ఇయర్ సందర్భంగా థియేటర్లలోకి వచ్చింది. మరి మూవీ ఎలా ఉంది అన్నది రివ్యూలో తెలుసుకుందాం పదండి.

కథ

సిద్ధార్థ అనే యువకుడు హైదరాబాదులో ఉంటాడు. అతనికి త్రిష అనే అమ్మాయి ఓ పబ్ లో పరిచయమవుతుంది. ఇద్దరి మధ్య మొదలైన పరిచయం కాస్త స్నేహానికి దారి తీస్తుంది. ఆ తర్వాత ఇద్దరూ రిలేషన్షిప్ మొదలు పెడతారు. మనసుకు నచ్చిన అమ్మాయి కోసం హీరో ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని స్టార్ట్ చేస్తాడు. అందులో బిజినెస్ పార్టనర్స్ గా ప్రియురాలు త్రిషతో పాటు మన్సూర్ అనే మరో వ్యక్తిని కూడా చేర్చుకుంటాడు. కానీ ఆ తర్వాతే వస్తుంది అసలు ట్విస్ట్. వారిద్దరూ కలిసి రిలేషన్ షిప్ లో ఉంటూ సిద్ధార్థని మోసం చేస్తారు. పైగా కంపెనీ నుంచి బయటకు పంపిస్తారు. ఉన్న డబ్బంతా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో పెట్టుబడిగా పెట్టడంతో సిద్ధార్థ దగ్గర చిల్లి గవ్వ కూడా మిగలదు. దీంతో సిద్ధార్థ ఒక బస్తీలో చిన్న రూమ్లో అద్దెకి ఉంటాడు. అయితే అదే బిల్డింగ్ లో శ్రావ్యా అని మరో మహిళ కూడా రెంట్ కి దిగుతుంది. ఆమెను భర్త చిత్రహింసలు పెడుతూ ఉంటాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య జరిగిన పరిచయంతో సినిమా ఎలాంటి టర్న్ తీసుకుంది ? సిద్ధార్థ్ సైకోగా మారడానికి గల కారణాలు ఏంటి ? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే మూవీని తెరపై వీక్షించాల్సిందే.

విశ్లేషణ 

Advertisement

కొంతమంది డైరెక్టర్స్ రొటీన్ కథని తీసుకున్నప్పటికీ కథనంతో మ్యాజిక్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఈ సినిమాలో కూడా డైరెక్టర్ అదే పని చేయాలనుకున్నాడు. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. రొటీన్ స్టోరీనే తెరపై డిఫరెంట్ గా చూపాలనుకున్న ఆయన ప్రయత్నం బెడిసి కొట్టింది. కథనం కొత్తగానే ఉన్నప్పటికీ స్టోరీపై పట్టు సాధించడంలో డైరెక్టర్ విఫలమయ్యారు. మూవీని చూస్తున్నంత సేపు షార్ట్ ఫిలిం చూస్తున్నామేమో అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల పరిచయం తర్వాత సినిమా మొత్తం ఊహకు అందేలా సాగడం సినిమాలో బిగ్గెస్ట్ మైనస్. అంతేకాకుండా ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి అస్సలు సూట్ అవ్వదు. జెన్ జీ కిడ్స్ ని దృష్టిలో పెట్టుకొని తీసినట్టుగా ఉంటుంది. శృతి మించిన అడల్ట్ సీన్లు, అంతకు మించిన బూతు పదాలతో ఆడియన్స్ ని ఇబ్బందికి గురి చేశారు.

ఓ అమ్మాయి కోసం హీరో అర్ధ నగ్నంగా పరిగెత్తడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హఫ్ అంతా హీరోకి త్రిషతో పరిచయం, మోసం, ఆ తర్వాత బస్తీలో ఇల్లును అద్దెకి తీసుకోవడం వంటి అంశాలతో రొటీన్ గా అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ తో క్లైమాక్స్ ఏంటో ముందే అర్థమైపోతుంది. సెకండ్ హాఫ్ బెటర్  అనిపించినప్పటికీ, అందులో ఒకటి రెండు సీన్లు మాత్రమే ఆకట్టుకుంటాయి. అలాగే సినిమాలో హీరో సిద్ధార్థ పాత్ర గతానికి సంబంధించిన స్టోరీ సరిగ్గా లేకపోవడంతో ఆడియన్స్ ఎమోషనల్ గా డిస్కనెక్ట్ అవుతారు.

Advertisement

ఇక సిద్ధార్థ పాత్రలో నందు ఒదిగిపోయాడు. అతని కష్టం తెరపై కనిపించడంతో పాటు, ఆ సైకో వేషాలు ఓ వర్గం ఆనియన్స్ ని కావలసినంత ఎంటర్టైన్ చేస్తాయి. అలాగే హీరోయిన్ యామిని భాస్కర్ తన పాత్రతో మెప్పించింది. మరో హీరోయిన్ ప్రియాంక రెబెకా కూడా బాగానే నటించింది. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు. ఇక టెక్నికల్ గా చెప్పుకోవాలంటే స్మరణ్ సాయి బ్యాగ్రౌండ్ స్కోర్ విభిన్నంగా ఉంది. ఎడిటింగ్ షార్ప్ గా ఉండగా, సినిమాటోగ్రఫీ ఓకే అనిపిస్తుంది. నిర్మాణ విలువలు సైతం బాగానే ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్

శ్రీ నందు పర్ఫార్మెన్స్
హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ
సెకండ్ హాఫ్

మైనస్ పాయింట్స్

ఫస్ట్ హాఫ్
బూతు డైలాగ్స్
రొటీన్ డైలాగ్స్
సాగదీత

చివరగా

మెచ్యూర్డ్ ఆడియన్స్‌కు మాత్రమే మూవీ.

రేటింగ్ : 1/5

Related News

Romanchakam Review : ‘రోమాంచకం’.. నవ్వుల ప్రయాణం..

సుమంత్ ప్రభాస్ ‘రోమాంచకం’ ట్విట్టర్ రివ్యూ..

‘కికు చిరంజీవి’ మూవీ రివ్యూ.. గుండె కుడివైపు ఉంటే.. రహస్యం ఎటువైపు దారితీసింది?

టాక్సిక్’ రివ్యూ.. గీత దాటలేదు, కానీ ఓపిక మాత్రం దాటింది!”

ది రెడ్ బ్యాగ్ మూవీ రివ్యూ.. క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?

అమీర్ లోగ్ మూవీ రివ్యూ.. పాతబస్తీ గల్లీ స్నేహం వర్కౌట్ అయ్యిందా?

రవితేజ ‘ఇరుముడి’ రివ్యూ.. అయ్యప్పమాల కలిసొచ్చిందా?

పళ్ళ బురుసు మూవీ రివ్యూ..చిన్న బ్రష్.. పెద్ద గొడవ.. అసలు కథ ఏంటంటే?

Big Stories

Advertisement
×