నటీనటులు: రవిబాబు, ఇనాయ సుల్తానా, తనీష్ తదితరులు
దర్శకత్వం: రవిబాబు
Razor Review: చాలా కాలం తర్వాత రవిబాబు తనకు ఇష్టమైన థ్రిల్లర్ జోనర్‌లోకి ‘రేజర్’ సినిమాతో తిరిగి వచ్చారు. ఇది హింస, ఉత్కంఠ కలగలిసిన ఒక సర్వైవల్ డ్రామా. కథ విషయానికొస్తే, రవిబాబు ఒక ‘పెట్ గ్రూమర్’ పాత్రలో కనిపిస్తారు. ఒక రాజకీయ హత్యకు సంబంధించిన సిసిటివి ఫుటేజ్ అనుకోకుండా ఒక చిన్న పాప వద్దకు చేరుతుంది. ఆ సాక్ష్యాన్ని చెరిపివేయాలని చూస్తున్న నేరగాళ్ల నుండి ఆ పాపను రక్షించడానికి ఈ పెట్ గ్రూమర్ ఎలా పోరాడాడు అనేదే ఈ సినిమా కథ.
రవిబాబు సినిమాల్లో సహజంగానే ఉండే డార్క్ సెటప్ ఈ సినిమాలోనూ కనిపిస్తుంది. ‘అనసూయ’, ‘అమరావతి’ వంటి సినిమాల స్థాయిలో కాకపోయినా, ఇందులో హింస, టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికే నేరుగా కథలోకి వెళ్ళిపోతుంది. కథలో పెద్దగా మలుపులు లేకపోయినా, సర్వైవల్ థ్రిల్లర్‌గా సాగుతుంది. ముఖ్యంగా రవిబాబుకి ఆ చిన్న పాపకి మధ్య ఉండే బాండింగ్ సినిమాకు ఎమోషనల్ అండగా నిలుస్తుంది. రవిబాబు తన నటనలో ఎక్కడా అతి చేయకుండా, ఒక సామాన్యుడు ఎదుర్కొనే శారీరక శ్రమను, ఒత్తిడిని చక్కగా ప్రదర్శించారు. తనీష్ తన పరిమితమైన పాత్రలో ఆకట్టుకున్నారు.
సినిమాలోని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉత్కంఠను పెంచడంలో సహాయపడింది. సినిమాటోగ్రఫీ కూడా సినిమా మూడ్‌కి తగ్గట్టుగా కాస్త మురికిగా, డార్క్ థీమ్‌తో బాగుంది. యాక్షన్ సన్నివేశాలు సహజంగా ఉన్నాయి.
మోత్తంగా.. యాక్షన్ డ్రామాలు, థ్రిల్లర్లు ఇష్టమైతే ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు. కథలో కొత్తదనం ఆశించే వారికి ఇది కాస్త నిరాశ కలిగించవచ్చు.