E-Paper

జియో బ్రాడ్‌బ్యాండ్ ధమాకా ఆఫర్.. ఒకసారి రీఛార్జ్ చేస్తే 13 నెలల పాటు నెట్, ఓటీటీలు ఫ్రీ!

జియో బ్రాడ్‌బ్యాండ్ ధమాకా ఆఫర్.. ఒకసారి రీఛార్జ్ చేస్తే 13 నెలల పాటు నెట్, ఓటీటీలు ఫ్రీ!

Jio Fiber Annual Plan: ఇంటర్నెట్ వాడకం పెరిగిపోయిన ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ హై-స్పీడ్ డేటాతో పాటు వినోదం కూడా కావాలి. అందుకే రిలయన్స్ జియో తమ కస్టమర్ల కోసం ఒక అదిరిపోయే వార్షిక ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా 100 Mbps వేగం ఉంటే ఇంట్లో ఎంతమంది ఉన్నా నెట్ హ్యాపీగా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇదే స్పీడ్‌తో పాటు బోలెడన్ని ఓటీటీ బెనిఫిట్స్ ఇచ్చే ప్లాన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

నెలకు ఖర్చు ఎంతంటే?

మనం మాట్లాడుకుంటున్న ఈ స్పెషల్ ప్లాన్ ధర నెలకు రూ.1,199గా ఉంది. దీనిని ఏడాది మొత్తానికి లెక్కేస్తే రూ.14,388తో పాటు అదనంగా జీఎస్‌టీ వర్తిస్తుంది. ఇది కాస్త ఖరీదైనదిగా అనిపించినప్పటికీ.. దీని ద్వారా లభించే ప్రయోజనాలు చూస్తే మాత్రం ప్రతి పైసా వసూల్ అనిపిస్తుంది. ముఖ్యంగా లాంగ్‌టర్మ్ ప్లాన్ తీసుకోవడం వల్ల యూజర్లకు మంచి లాభం చేకూరుతుంది.

మరో నెల రోజులు డేటా ఫ్రీ:

ఈ యాన్యువల్ ప్లాన్ ఎంచుకునే వారికి జియో ఒక సూపర్ ఆఫర్ ఇస్తోంది. ఈ ప్లాన్‌ను ఏడాది కాలానికి ఒకేసారి రీఛార్జ్ చేసుకుంటే.. కంపెనీ మరో 30 రోజుల పాటు అదనపు సర్వీస్‌ను ఎలాంటి ఎక్స్‌ట్రా ఛార్జీలు లేకుండా ఉచితంగా అందిస్తుంది. అంటే.. మీరు 12 నెలల డబ్బులు చెల్లిస్తే, ఏకంగా 13 నెలల పాటు ఇంటర్నెట్ సర్వీస్‌ను ఎంజాయ్ చేయవచ్చన్నమాట.

Also Read: భారీ బ్యాటరీ, పవర్‌ఫుల్ ఫీచర్లతో Redmi Turbo 5.. భారత్‌లో లాంచ్ డేట్ ఫిక్స్!

ఓటీటీల జాతర, టీవీ ఛానళ్లు:

సాధారణ 100 Mbps ప్లాన్లలో ఓటీటీ ప్రయోజనాలు ఉండవు. కానీ ఈ ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్ బేసిక్, అమెజాన్ ప్రైమ్ లైట్, యూట్యూబ్ ప్రీమియంతో పాటు జియోహాట్‌స్టార్, ప్యాన్‌కోడ్, సోనీలివ్, జీ5 వంటి మరెన్నో ప్రముఖ ఓటీటీల సబ్‌స్క్రిప్షన్లు లభిస్తాయి. వీటితో పాటు ఉచిత వాయిస్ కాలింగ్, జియో టీవీ ప్లస్ యాప్ ద్వారా వెయ్యికి పైగా టీవీ ఛానళ్లను కూడా ఉచితంగా చూడవచ్చు.

డేటా లిమిట్ వివరాలు:

ఈ ప్లాన్ అటు జియో ఫైబర్, ఇటు ఎయిర్ ఫైబర్ కస్టమర్లు ఇద్దరికీ అందుబాటులో ఉంది. అయితే రెండింటికీ డేటా లిమిట్‌లో స్వల్ప తేడా ఉంది. మీరు ఒకవేళ ఎయిర్ ఫైబర్ వాడుతుంటే నెలకు 1000 GB (1 TB) డేటా లభిస్తుంది. అదే హోమ్ ఫైబర్ కనెక్షన్ ఉన్నవారికైతే ఏకంగా 3300 GB (3.3 TB) డేటా సొంతమవుతుంది. నిరంతర వినోదం, హై-స్పీడ్ ఇంటర్నెట్ కోరుకునే వారికి ఇది నిజంగా బెస్ట్ ప్లాన్ అని చెప్పవచ్చు.

Also Read: రూ.8 వేల లోపే ఇలాంటి ఫోనా? Infinix Smart 20 ఎంట్రీతో మార్కెట్ షేకవ్వాల్సిందే!

Related News

Lenovo నుంచి భారత్‌లోనే తయారైన సరికొత్త AI Laptop లాంచ్.. ప్రైస్ ఎంతంటే?

ఫ్రిజ్ లేదా వాషింగ్ మెషీన్ కొంటున్నారా?

సింగిల్ ఛార్జ్‌తో మూడ్రోజులు నాన్‌స్టాఫ్‌గా వాడొచ్చు.. moto g37 POWER ఫోన్ ధర ఎంత తగ్గిందంటే?

కరెంట్ బిల్లు అస్సలు రాదు.. బ్యాచిలర్స్, చిన్న ఫ్యామిలీస్ కోసం బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్రిజ్‌లు

సామాన్యులకు గుడ్ న్యూస్.. ఇక ఏసీతో పనిలేదు.. కేవలం రూ.2 వేలతో ఇల్లంతా కూల్!

ఈ 5 పొరపాట్లు చేస్తున్నారా? అయితే ల్యాప్ టాప్ బాంబులా పేలొచ్చు.. జాగ్రత్త భయ్యో!

ప్రతి ఇంట్లో తప్పకుండా.. ఉండాల్సిన BLDC పెడెస్టల్ ఫ్యాన్స్!

బట్టలు ఉతకడం ఇక చిటికెలో పని.. తక్కువ టైంలోనే

×