E-Paper
Advertisement

ఈ 5 పొరపాట్లు చేస్తున్నారా? అయితే ల్యాప్ టాప్ బాంబులా పేలొచ్చు.. జాగ్రత్త భయ్యో!

ఈ 5 పొరపాట్లు చేస్తున్నారా? అయితే ల్యాప్ టాప్ బాంబులా పేలొచ్చు.. జాగ్రత్త భయ్యో!
Advertisement

Laptop Tips: ఒకప్పుడు ఉద్యోగులకు మాత్రమే పరిమితమైన ల్యాప్ టాప్స్ ను ఇప్పుడు చాలా మంది వినియోగిస్తున్నారు. ఆఫీస్ పని అయినా, చదువులకైనా దీనినే వాడుతున్నారు. అయితే కొందరు చేసే చిన్న చిన్న తప్పులు ల్యాప్‌టాప్ లైఫ్ ను సగానికి తగ్గించేస్తున్నాయని నిపుణులు అంటున్నారు. లేదంటే రిపేర్లకు వచ్చి వేల రూపాయలు ఖర్చయ్యేలా చేస్తున్నాయని పేర్కొంటున్నాయి. ల్యాప్ టాప్ ఎక్కువ రోజులు మన్నికగా ఉండాలంటే తక్షణమే మార్చుకోవాల్సిన 5 అలవాట్లు, లేదంటే దాని వల్ల కలిగే నష్టం ఏంటో ఈ కథనంలో చూద్దాం.

బెడ్‌పై లేదా సోఫాపై పెట్టి వాడటం

చాలామంది మంచం మీదో, సోఫా మీదో కూర్చుని ల్యాప్‌టాప్ వాడుతుంటారు. ఇలా చేయడం వల్ల ల్యాప్‌టాప్ కింద ఉండే గాలి వెళ్లే రంధ్రాలు మూసుకుపోతాయి. ఫలితంగా లోపల వేడి పెరిగిపోయి, మదర్‌బోర్డ్, ప్రాసెసర్ దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎల్లప్పుడూ ల్యాప్‌టాప్‌ను ఫ్లాట్‌గా ఉండే టేబుల్‌పై లేదా ల్యాప్‌టాప్ స్టాండ్‌పై మాత్రమే ఉంచి వాడాలని హితవు పలుకుతున్నారు.

స్క్రీన్‌ను పట్టుకుని ల్యాప్‌టాప్ ఎత్తడం

Advertisement

ల్యాప్‌టాప్‌ను ఒక చోటు నుండి మరోచోటుకి జరిపేటప్పుడు చాలామంది స్క్రీన్ (డిస్‌ప్లే) పట్టుకుని పైకి లేపుతుంటారు. దీనివల్ల స్క్రీన్‌ను బేస్‌కు కలిపే హింజెస్‌ పై తీవ్రమైన ఒత్తిడి పడి అవి విరిగిపోవచ్చని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా డిస్‌ప్లే ప్యానెల్‌ కూడా పాడైపోయే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఎప్పుడైనా ల్యాప్‌టాప్‌ను కింద భాగం పట్టుకుని మాత్రమే ఎత్తాలని హితవు పలుకుతున్నారు.

కీబోర్డ్ పక్కన టీ, కాఫీలు తాగడం

పని ఒత్తిడిలో ల్యాప్‌టాప్ పక్కనే కాఫీ, టీ, వాటర్ బాటిల్స్ పెట్టుకోవడం ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారిపోయింది. అయితే అవి పొరపాటున కీబోర్డ్‌పై వొలికితే, లిక్విడ్ నేరుగా లోపల ఉన్న సర్క్యూట్‌ల వరకు వెళ్లి ల్యాప్‌టాప్ పూర్తిగా డెడ్ అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎల్లప్పుడూ ఛార్జింగ్‌లోనే ఉంచడం

Advertisement

ల్యాప్‌టాప్ 100% ఛార్జ్ అయిన తర్వాత కూడా కొందరు ప్లగ్ తీయకుండా అలాగే వాడేస్తుంటారు. ఇది చాలా పెద్ద తప్పు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల బ్యాటరీ వేడెక్కి కాలక్రమేణా దాని సామర్థ్యం తగ్గిపోతుందని పేర్కొంటున్నారు. బ్యాటరీ ఉబ్బిపోయే ప్రమాదం కూడా ఉందని తెలియజేస్తున్నారు. కాబట్టి ఛార్జింగ్ 20% కి వచ్చినప్పుడు ప్లగ్ ఇన్ చేయడం, 85-90% అవ్వగానే తీసేయడం బెస్ట్ అని హితవు పలుకుతున్నారు.

Also Read: ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఇతనే.. 12 ఏళ్ల పరిశోధనలో తేలిన నిజం!

ఆన్‌లో ఉండగానే బ్యాగ్‌లో పెట్టడం

కొంతమంది వర్క్ అవ్వగానే ల్యాప్‌టాప్‌ను పూర్తిగా ‘షట్‌డౌన్’ చేయకుండానే బ్యాగులో పెడుతుంటారు. ఇది కరెక్ట్ కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా బ్యాగ్ క్లోజ్ గా ఉండటం వల్ల అందులో గాలి ఉండదు. అలాంటప్పుడు రన్నింగ్ ల్యాప్ టాప్ ను బ్యాగులో పెడితే ప్రాసెసర్ రన్ అవుతూ.. మరింత హీట్ ఎక్కే ఛాన్స్ ఉంది. దీనివల్ల ల్యాప్ టాప్ హార్డ్ వేర్ విపరీతంగా వేడెక్కి దెబ్బతినే ప్రమాదముందని నిపుణులు పేర్కొంటున్నారు. కొన్ని సందర్భాల్లో పేలిపోవచ్చని కూడా హెచ్చరిస్తున్నారు.

Also Read: Nindu Noorella Saavasam Serial Today Episode June 13th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: బుజ్జమ్మను జాగ్రత్తగా ఉండమని హెచ్చరించిన గుప్త

Related News

BSNL మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. జస్ట్ రూ. 39కే 20GB డేటా.. రూ.1కే ఉచిత సిమ్!

రూ.35వేలలోపు 50 ఇంచుల టీవీ..ఇంట్లోనే థియేటర్ ఫీల్

రాత్రి వేళ గణపయ్య ఫోటోలు బ్లర్ అవుతున్నాయా? ఈ టిప్స్‌తో క్లారిటీ అదుర్స్!

రొటేటింగ్ బెజెల్‌తో క్రేజీ స్మార్ట్ వాచ్..GOBOULT Saber విశేషాలివే

రూ.1000లోపు దబిడి దిబిడే..పార్టీ మోత మోగించే బ్లూటూత్ స్పీకర్!

మ్యూజిక్ లవర్స్ కోసం బెస్ట్ హెడ్ సెట్..మార్కెట్లో రచ్చ చేస్తున్న మోడల్

రూ.2,399కే క్రేజీ ఫీచర్లు..నథింగ్ నుంచి కొత్త ఇయర్‌బడ్స్

కొత్త ఫోన్ కొంటున్నారా? 128GB లేదా 256GB ఏది బెటర్?

Big Stories

Advertisement
×