E-Paper
Advertisement

ఫ్యూచర్ కార్ల కోసం మారుతి AI వ్యూహం.. ఇక కొత్త మోడల్స్ తయారీ మరింత వేగవంతం!

ఫ్యూచర్ కార్ల కోసం మారుతి AI వ్యూహం.. ఇక కొత్త మోడల్స్ తయారీ మరింత వేగవంతం!
Advertisement

Maruti Suzuki AI Plan: దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తన వ్యూహాలను మార్చుకుంటోంది. ముఖ్యంగా ఎస్‌యూవీలు, ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో మరింత వేగంగా ముందుకు వెళ్లేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మరింతగా ఉపయోగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. కొత్త మోడళ్ల అభివృద్ధిని వేగవంతం చేయడంతో పాటు ఖర్చులను తగ్గించుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంటుంది.

ఒక్కో మోడల్ తయారీకి 48 నెలల సమయం

ప్రస్తుతం ఒక కొత్త కారును డిజైన్ చేయడం నుంచి మార్కెట్లోకి తీసుకురావడం వరకు మారుతికి సుమారు 48 నెలల సమయం పడుతోంది. అయితే AI, మెషిన్ లెర్నింగ్, అధునాతన డిజిటల్ సిమ్యులేషన్ టెక్నాలజీల సాయంతో ఈ కాలాన్ని 36 నెలలకు తగ్గించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. దాదాపు సంవత్సరం ముందుగానే కొత్త మోడళ్లను వినియోగదారులకు అందించే అవకాశం ఉంటుంది.

వర్చువల్ గానే కార్ల పరీక్షలు

Advertisement

AI ఆధారిత టెక్నాలజీ వల్ల వాహనాల భాగాలను ముందుగానే వర్చువల్‌ గా పరీక్షించవచ్చు. సాధారణంగా ప్రోటోటైప్ తయారు చేసిన తర్వాతే గుర్తించే కొన్ని లోపాలను ఇప్పుడు కంప్యూటర్ సిమ్యులేషన్ల ద్వారా ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుంది. దీంతో అభివృద్ధికి వేగవంతం కావడంతో పాటు ఖర్చులు కూడా తగ్గుతాయి. రాబోయే మూడు సంవత్సరాల్లో మారుతి భారీ స్థాయిలో కొత్త వాహనాలను మార్కెట్లోకి తీసుకురావాలని యోచిస్తోంది. కంపెనీ సుమారు తొమ్మిది కొత్త మోడళ్లను విడుదల చేసే అవకాశముందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. వీటిలో ఎక్కువ భాగం ఎస్‌యూవీ సెగ్మెంట్‌కు చెందినవే కావచ్చు.

ఈ కొత్త మోడళ్లలో పెట్రోల్, ఫ్లెక్స్ ఫ్యూయల్, హైబ్రిడ్, పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌లతో కూడిన వాహనాలు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఫ్రాంక్స్, బ్రెజ్జా, గ్రాండ్ విటారా వంటి ఎస్‌యూవీలు మార్కెట్లో మంచి ఆదరణ పొందుతున్నాయి. వీటి సక్సెస్ ను కొనసాగించేలా మరిన్ని కొత్త మోడళ్లను తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. ఇప్పటి వరకు వెహికల్ డిజైన్ పూర్తయిన తర్వాత విడిభాగాల అభివృద్ధి చేసేవాళ్లు. కానీ, ఇకపై డిజైన్, కాంపోనెంట్ ఇంజినీరింగ్, తయారీ సన్నాహాలు, టూలింగ్ లాంటి పనులను ఒకేసారి నిర్వహించే విధానాన్ని అమలు చేయాలని కంపెనీ భావిస్తోంది.  ఈ విధానం వల్ల అభివృద్ధి ఆలస్యం తగ్గడంతో పాటు కొత్త మోడళ్లను వేగంగా ఉత్పత్తి దశకు రానుంది.

స్వదేశీ విడిభాగాలపై ఎక్కువ ఫోకస్

Advertisement

భవిష్యత్ మోడళ్ల కోసం ఇండియాలోనే విడి భాగాలను తయారు చేయాలని భావిస్తోంది. 80 శాతానికి పైగా స్థానిక విడిభాగాలను ఉపయోగించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల ఉత్పత్తి ఖర్చు తగ్గడంతో పాటు దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది.

ఇటీవల మారుతి తన చరిత్రలోనే అత్యధిక నెలవారీ అమ్మకాలను సాధించింది. దేశీయ మార్కెట్‌ తో పాటు ఎగుమతుల్లో కూడా మంచి వృద్ధిని సాధిస్తోంది. ఈ నేపథ్యంలో AI సాంకేతికత,  ఎక్కువ స్థానికీకరణ, కొత్త ఎస్‌యూవీలు, ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెట్టడం ద్వారా భవిష్యత్ మరింత సత్తా చాటాలని భావిస్తోంది.

Read Also: కొత్త హ్యుందాయ్ i20 లీక్.. క్రాసోవర్ లుక్‌ లో సూపరో సూపరు!

Related News

బైక్‌పై వెళ్తూ పాటలు వింటున్నారా? అయితే మీ డ్రైవింగ్ లైసెన్స్ గోవిందా!

హ్యుందాయ్‌కు బిగ్ షాక్.. ఏప్రిల్-జూన్‌లో కుప్పకూలిన లాభాలు.. ఎగుమతులు సైతం డౌన్!

కారు పార్కింగ్ తిప్పలకు చెక్.. రూ.2,000 లోపే టాప్-5 రివర్స్ కెమెరాలు!

కొత్త ఈ-స్కూటర్ కావాలా? మార్కెట్‌ను షేక్ ఆడించే మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

నీటిలోనూ దూసుకెళ్లే.. బెస్ట్ ‘హై గ్రౌండ్ క్లియరెన్స్’ కార్లు.. వర్షాకాలం అస్సలు తగ్గేదేలే!

ఇంధన ధరలతో విసిగిపోయారా? మైలేజ్‌తో కేక పుట్టిస్తున్న.. ఈ CNG కార్లు మీకోసమే!

New Car Buying Tips: కారు కొనాలనుకుంటున్నారా? ముందుగా ఈ 5 విషయాలు చెక్ చేయండి!

ఫెస్టివల్ సీజన్‌ లో మారుతి మాస్టర్ ప్లాన్.. బాలెనో, ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్‌లు వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×