E-Paper
Advertisement

కోమటిరెడ్డి బ్రదర్స్.. కాంగ్రెస్ మార్క్ మంత్రి మార్పు..!

కోమటిరెడ్డి బ్రదర్స్.. కాంగ్రెస్ మార్క్ మంత్రి మార్పు..!
Advertisement

క‌ర్ణాట‌కలో సీఎం మార్పైనా.. తెలంగాణ‌లో మంత్రుల మార్పైనా అందులో కాంగ్రెస్ త‌న‌దైన మార్కును క‌న‌బ‌రుస్తుంది. స‌గం ప‌రిపాల‌న కాలం ముగియ‌వ‌స్తుంటే.. ఇంకా మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ జపం జ‌రుగుతూనే ఉంది. ఈ నెలాఖ‌రు నాటికి అవుతుంద‌ని అంతా అనుకుంటున్నా.. అక్క‌డి నుంచి లీకులు ఇప్ప‌ట్లో కావ‌ని వ‌స్తున్నా.. సీఎం ఇచ్చిన సూచ‌న‌ల మేర‌కు అధిష్టానం ఓ క్లారిటీ నిర్ణ‌యానికి వ‌చ్చినట్టైతే ప్ర‌చారం జ‌రుగుతున్న‌ది.

ఖాళీగా ఉన్న రెండు బెర్తుల కోసం తీవ్ర పోటీ నెల‌కొన్న‌ది. కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. ఇక్క‌డ స‌ర్కార్‌ను కూడా అత‌ను చాలా సార్లు బెదిరించాడు. పాల‌న‌పై వ్య‌తిరేకంగా మాట్లాడాడు. త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌క‌పోతే ఇలాంటి ఇర‌కాటాలే ఉంటాయ‌నే సంకేతాలిచ్చాడు. అంతే కాదు.. ఆయ‌న త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌క‌పోతే.. తానే సీఎం ప‌ద‌వి గుంజుకుంటాన‌ని అన్న మాట‌లు క‌ల‌క‌లం రేపాయి. మొత్తానికి మొన్న రాహుల్‌గాంధీని క‌లిసి రావడంతో అత‌నికి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చింద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది.

Advertisement

కానీ ఇప్ప‌టికే అత‌ని అన్న కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి కేబినెట్ మంత్రిగా ఉన్న త‌రుణంలో.. ఇద్ద‌రికీ ఒకే ఇంటి నుంచి అవ‌కాశం ఇవ్వ‌డం క‌రెక్టు కాద‌ని మొద‌టి నుంచి కాంగ్రెస్ అనుకుంటున్న‌ది. అదే స‌మ‌యంలో ఇక‌పై రెడ్ల సంఖ్యను పెంచే చాన్స్ అక్క‌డ లేదు. ఇప్ప‌టికే రెడ్ల రాజ్యంగా రేవంత్ స‌ర్కార్‌కు ముద్ర ప‌డింది. దీంతో ఇచ్చిన హామీ నెర‌వేర్చ‌డంతో పాటు.. అన్న ప‌ద‌వి.. త‌మ్ముడికి క‌ట్ట‌బెడితే స‌మీక‌ర‌ణ‌లు సమాన‌మ‌వుతాయ‌నే భావ‌న‌లో అధిష్టానం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఇక కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డికి ఉద్వాస‌న ప‌లుకుతార‌న్న‌మాట‌. శాఖ‌లు అవే ఇవ్వ‌క‌పోవ‌చ్చు గానీ.. మంత్రి ప‌ద‌వి అయితే అన్నను తీసి త‌మ్ముడికి ఇస్తార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. దీంతో ఇప్ప‌టికే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి వ‌ర్గంలో పండుగ వాతావ‌ర‌ణం క‌నిపిస్తున్న‌ది. మ‌రి వెంక‌ట్‌రెడ్డి సీనియారిటీకి త‌గ్గ‌ట్టు ఎలాంటి ప‌ద‌వి ఇస్తారో అనే ప్ర‌చార‌మూ ఉంది. ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా, కేబినెట్ ర్యాంకుతో ఓ ప‌ద‌వి ఇచ్చినా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సింది లేదు. నిజామాబాద్ జిల్లా బోధ‌న్ ఎమ్మెల్యే పీ సుద‌ర్శ‌న్‌రెడ్డికి కూడా ఇదే ఇచ్చారు. అత‌ను మంత్రి ప‌ద‌వి కోసం చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. సీఎంపై తీవ్ర ఒత్తిడి పెంచినా అది సాధ్యం కాలేదు.

Advertisement

సీఎంకు ద‌గ్గ‌రి బంధువు కూడా. ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాకు మంత్రి ప‌దవే లేదు. అయినా అత‌నికి ప్ర‌భుత్వ స‌ల‌హాదారుతోనే సరిపెట్టారు. మంత్రిగా ట్రీట్ చేయాల‌ని మాత్రం అధికార యంత్రాగానికి సీఎంవో నుంచి ఆదేశాలు వెళ్లాయి. అయినా అసంతృప్తే ఉంది అత‌నిలో. ఇంకా మంత్రి ప‌ద‌వి కోసం ఒత్తిడి చేస్తున్నారు. సీఎం రేవంత్ ఆయ‌న్ను వెంట తిప్పుకుంటున్నాడు. అంత వ‌ర‌కే ఇక మ‌ర్యాద‌. అంత‌కు మించి చేసేది కూడా ఏం లేదు. ఇక వెంక‌ట్‌రెడ్డి ప‌రిస్థితి కూడా అలాగే అయ్యేలా ఉంది.

Related News

బొద్దింక‌ల ఎఫెక్ట్‌.. జంత‌ర్‌మంత‌ర్ ఎత్తేయ‌లేదు.. కానీ కండిష‌న్స్ అప్లై.. !

నన్ను మించిన‌ విద్యాశాఖ మంత్రి ఉన్న‌డా? పాస్ మార్కులు వేసిండ్రు.. ఇదే ప‌నితీరుకు గీటురాయి!

హైడ్రాను పీకి అవ‌త‌ల పాడేస్తాం.. బీఆరెస్ స్టాండ్ క‌రెక్టేనా? జ‌నామోదం ఎంత‌? సిటీ ఈ దుస్థితికి కార‌ణం ఎవ‌రు?

బీజేపీ నేత‌ల‌ది జెన్‌బీ మంత్రం… ఓటు బ్యాంకును సంతృప్తి ప‌రిచేందుకు తిక్క మాట‌లు త‌ప్ప‌వు మ‌రి!

మాకూ కావాలి బుల్డోజ‌ర్లు.. జిల్లాల నుంచి హైడ్రాకు డిమాండ్…! ఇదో కొత్త కోణం..

వాన‌ల మురిపెం.. వ‌రేసుకుంటే బ‌త‌కం! పెడచెవిన పెడుతున్న రైతు..

లేడీ సివంగులు.. ఆ ఇద్ద‌రు ఐఏఎస్ ఆఫీస‌ర్లు.. క‌బ్జాల‌పై బుల్డోజ‌ర్లు ఎక్కించి..!

హైడ్రా ఆగ‌దు.. మీ ఆట‌లు సాగ‌వు! రంగ‌నాథే ఉంట‌డు.. క‌బ్జాదారుల ప‌ని ప‌డ‌త‌డు!

Big Stories

Advertisement
×