E-Paper
Advertisement

సింగిల్ ఛార్జ్‌తో మూడ్రోజులు నాన్‌స్టాఫ్‌గా వాడొచ్చు.. moto g37 POWER ఫోన్ ధర ఎంత తగ్గిందంటే?

సింగిల్ ఛార్జ్‌తో మూడ్రోజులు నాన్‌స్టాఫ్‌గా వాడొచ్చు.. moto g37 POWER ఫోన్ ధర ఎంత తగ్గిందంటే?
Advertisement

Moto g37 POWER: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మోటరోలా మరోసారి తన మార్కును చూపెట్టింది. సరికొత్త ఫీచర్లు, భారీ బ్యాటరీతో తీసుకొచ్చిన moto g37 POWER ఫోన్‌పై తాజాగా అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. మిడ్‌రేంజ్ బడ్జెట్‌లో 5G ఫోన్ కొనాలనుకునే వారికి ఇదొక మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్, మోటరోలా అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంది.

ఆకట్టుకునే ధరలు, ఆఫర్లు:

పరిమితకాల ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. 4GB RAM+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999 కాగా.. 8GB RAM+128GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.21,999గా ఉంది. అయితే బ్యాంక్ ఆఫర్ కింద రూ.2,000 తగ్గింపు లభిస్తుండటంతో దీనిని రూ.19,999కే సొంతం చేసుకోవచ్చు. ఇంపెనెట్రబుల్, కాప్రి, నౌటికల్ బ్లూ అనే మూడు ఆకర్షణీయమైన కలర్స్‌లో ఈ ఫోన్ లభిస్తోంది.

భారీ బ్యాటరీ సామర్థ్యం:

Advertisement

ఈ ఫోన్‌లోని ప్రధాన ఆకర్షణ దీని 7000mAh బ్యాటరీ. గేమ్స్ ఆడినా, వీడియో కాల్స్ మాట్లాడినా, రోజంతా సినిమాలు చూసినా ఛార్జింగ్ గురించి అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సులభంగా మూడ్రోజుల పాటు వాడుకోవచ్చు. దీనికి తోడు 33W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. బ్యాటరీ లైఫ్ ఎక్కువ కాలం మన్నేలా దీనిలో ప్రత్యేక బ్యాటరీ కేర్ ఫీచర్లను కూడా చేర్చారు.

Also Read: సౌండ్‌బార్లపై ఉండే 2.1, 3.1, 5.1.2 నెంబర్ల అర్థం తెలుసా? ఇది తెలియకుండా కొంటే నష్టమే!

స్పీడ్ పర్ఫార్మెన్స్:

Advertisement

వేగవంతమైన 5G పర్ఫార్మెన్స్ కోసం ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. మల్టీటాస్కింగ్, గేమింగ్ సమయంలో ఫోన్ ఎక్కడా ల్యాగ్ అవ్వకుండా ఇది చూసుకుంటుంది. RAM బూస్ట్ ఫీచర్ ద్వారా ర్యామ్‌ను 24GB వరకు పెంచుకోవచ్చు. దీనివల్ల యాప్స్ చాలా స్పీడ్‌గా ఓపెన్ అవుతాయి. ఇక సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే.. గూగుల్ జెమిని, సర్కిల్ టు సెర్చ్ వంటి సరికొత్త ఏఐ (AI) ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

కింద పడినా పగలదు:

ఫోన్ కింద పడినా పాడవకుండా గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఇచ్చారు. అలాగే నీటి తుంపర్ల నుంచి రక్షణ కోసం IP64 రేటింగ్ ఉంది. అలాగే దీనిలో 6.7 అంగుళాల 120Hz డిస్‌ప్లే ఉండటం వల్ల స్క్రీన్ స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇక ఫొటోల కోసం 50MP ఏఐ కెమెరా, మంచి సౌండ్ కోసం డాల్బీ అట్మోస్ స్టీరియో స్పీకర్లను అందించారు. తక్కువ బడ్జెట్‌లో అన్ని హంగులున్న ఫోన్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

Also Read: లాంచ్‌కు ముందే లీకైన హానర్ కొత్త ఫోన్ ఫొటోలు.. ఏకంగా 11,000mAh బ్యాటరీతో!

Related News

BSNL మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. జస్ట్ రూ. 39కే 20GB డేటా.. రూ.1కే ఉచిత సిమ్!

రూ.35వేలలోపు 50 ఇంచుల టీవీ..ఇంట్లోనే థియేటర్ ఫీల్

రాత్రి వేళ గణపయ్య ఫోటోలు బ్లర్ అవుతున్నాయా? ఈ టిప్స్‌తో క్లారిటీ అదుర్స్!

రొటేటింగ్ బెజెల్‌తో క్రేజీ స్మార్ట్ వాచ్..GOBOULT Saber విశేషాలివే

రూ.1000లోపు దబిడి దిబిడే..పార్టీ మోత మోగించే బ్లూటూత్ స్పీకర్!

మ్యూజిక్ లవర్స్ కోసం బెస్ట్ హెడ్ సెట్..మార్కెట్లో రచ్చ చేస్తున్న మోడల్

రూ.2,399కే క్రేజీ ఫీచర్లు..నథింగ్ నుంచి కొత్త ఇయర్‌బడ్స్

కొత్త ఫోన్ కొంటున్నారా? 128GB లేదా 256GB ఏది బెటర్?

Big Stories

Advertisement
×