E-Paper
Advertisement

బట్టలు ఉతకడం ఇక చిటికెలో పని.. తక్కువ టైంలోనే

బట్టలు ఉతకడం ఇక చిటికెలో పని.. తక్కువ టైంలోనే
Advertisement

Time saving washing machines: ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లే హడావిడి, పిల్లలను స్కూల్‌కి పంపే కంగారు.. వీటన్నింటి మధ్య రోజువారీ బట్టలు ఉతకడం.. ఒక పెద్ద టాస్క్‌లా మారుతుంది. సాంప్రదాయ పద్ధతుల్లో.. లేదా పాతకాలపు మెషీన్లలో బట్టలు ఉతకడం వల్ల సమయం వృధా అవ్వడమే కాకుండా అలసట కూడా పెరుగుతుంది. ప్రస్తుత బిజీ లైఫ్‌స్టైల్‌లో మనకు కావాల్సింది తక్కువ సమయంలో.. తక్కువ శ్రమతో బట్టలను నీట్‌గా క్లీన్ చేసే స్మార్ట్ హోమ్ అప్లయన్సెస్. మీ రోజువారీ పనిని చిటికెలో ముగించే.. 5 బెస్ట్ వాషింగ్ మెషీన్స్, వాటి ప్రత్యేకతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బెస్ట్ వాషింగ్ మెషీన్స్:

Advertisement

1. ఎల్‌జీ 7 కేజీ 5 స్టార్ ఇన్వర్టర్ ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ (LG 7 kg 5 Star Inverter Top Load):
దేశంలో నమ్మకమైన బ్రాండ్లలో LG ముందుంటుంది. ఈ మెషీన్ స్మార్ట్ ఇన్వర్టర్ టెక్నాలజీతో వస్తుంది. ఇది కరెంట్ వాడకాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.

సమయం ఎలా ఆదా అవుతుంది?: ఇందులో ఉన్న ‘టర్బో డ్రమ్’ ఫీచర్ కఠినమైన మరకలను సైతం చాలా వేగంగా తొలగిస్తుంది. కేవలం 30-40 నిమిషాల్లోనే వాషింగ్ పూర్తవుతుంది.

Advertisement

ఎవరికి బెస్ట్?: 3 నుంచి 4 గురు సభ్యులు ఉన్న చిన్న కుటుంబాలకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

2. శామ్‌సంగ్ 8 కేజీ ఏఐ కంట్రోల్ ఫ్రంట్ లోడ్ (Samsung 8 kg AI Control Front Load):

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌తో వచ్చే ఈ శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్ లేటెస్ట్ ఫీచర్లు కేరాఫ్ అడ్రస్. ఇది మీ వాషింగ్ అలవాట్లను గుర్తుపెట్టుకుని..దానికి తగిన సైకిల్‌ను సజెస్ట్ చేస్తుంది.

సమయం ఎలా ఆదా అవుతుంది?: ఇందులో ‘సూపర్ స్పీడ్’ ఆప్షన్ ఉంటుంది. దీని ద్వారా కేవలం 59 నిమిషాల్లోనే.. ఫుల్ లోడ్ బట్టలను క్లీన్ అండ్ డ్రై చేసుకోవచ్చు. దీని ‘ఇకో బబుల్’ టెక్నాలజీ బట్టల్లోకి.. డిటర్జెంట్‌ను వేగంగా పంపించి త్వరగా క్లీన్ చేస్తుంది.

ఎవరికి బెస్ట్?: ఎక్కువ బట్టలు ఉతకాల్సిన పెద్ద కుటుంబాలకు, లేటెస్ట్ టెక్నాలజీ ఇష్టపడేవారికి.

3. ఐఎఫ్‌బీ 7 కేజీ 5 స్టార్ ఫ్రంట్ లోడ్ (IFB 7 kg 5 Star Front Load):
ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్స్‌లో IFB బ్రాండ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. క్వాలిటీ వాషింగ్ , బట్టల లైఫ్ పెంచడంలో ఇది దిట్ట.

సమయం ఎలా ఆదా అవుతుంది?: ఇందులో ‘ఎక్స్‌ప్రెస్ వాష్’అనే ప్రత్యేక ఫీచర్ ఉంది. తక్కువ మురికి ఉన్న బట్టలు లేదా రోజువారీ ఆఫీస్ బట్టలను కేవలం 15 నుంచి 20 నిమిషాల్లోనే ఇది ఉతికేస్తుంది.

ఎవరికి బెస్ట్?: ప్రతిరోజూ తక్కువ బట్టలు, త్వరగా ఉతుక్కోవాలనుకునే వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కి ఇది బెస్ట్ ఆప్షన్.

4. వర్ల్‌పూల్ 7.5 కేజీ 5 స్టార్ రాయల్ ప్లస్ టాప్ లోడ్ (Whirlpool 7.5 kg Royal Plus):
బడ్జెట్ ధరలో ఎక్కువ ఫీచర్లు కోరుకునే వారికి వర్ల్‌పూల్ ఎల్లప్పుడూ బెస్ట్ ఆప్షన్. హార్డ్ వాటర్ (ఉప్పు నీరు) ఉన్న ప్రాంతాల్లో కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

సమయం ఎలా ఆదా అవుతుంది?: దీని ‘ఎక్స్‌ప్రెస్ వాష్’ ఫీచర్ సాధారణ సైకిల్ కంటే 30% తక్కువ సమయంలోనే వాషింగ్ పూర్తి చేస్తుంది. అలాగే ఇందులోని 12 వాష్ ప్రోగ్రామ్స్ బట్టల రకాన్ని బట్టి క్విక్ సెట్టింగ్స్ చేసుకోవడానికి వీలు కల్పిస్తాయి.

ఎవరికి బెస్ట్?: ఉప్పు నీటి సమస్య ఉన్న ఏరియాల్లో ఉండేవారికి, తక్కువ బడ్జెట్‌లో పెద్ద మెషీన్ కావాలనుకునే వారికి.

Also Read:  అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో.. హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న ప్రీమియం ఫ్రిజ్‌లు!

5. బాష్ 8 కేజీ 5 స్టార్ ఇన్వర్టర్ ఫ్రంట్ లోడ్ (Bosch 8 kg Inverter Front Load):

జర్మన్ టెక్నాలజీతో రూపొందిన బాష్ వాషింగ్ మెషీన్లు వాటి మన్నికకు, నిశ్శబ్ద పనితీరుకు ప్రసిద్ధి చెందాయి.

సమయం ఎలా ఆదా అవుతుంది?: దీని ‘స్పీడ్ పర్ఫెక్ట్’ టెక్నాలజీ వాషింగ్ టైమ్‌ను దాదాపు 65% వరకు తగ్గిస్తుంది. అంటే.. గంటన్నర పట్టే పనిని అరగంటలోనే ముగించేస్తుంది. అదీ వాష్ క్వాలిటీ తగ్గకుండా..

ఎవరికి బెస్ట్?: అస్సలు టైమ్ లేని బిజీ లైఫ్ లీడ్ చేసేవారికి , నిశ్శబ్దంగా పనిచేసే మెషీన్ కావాలనుకునే వారికి.

వాషింగ్ మెషీన్ కొనడం అనేది కేవలం ఒక ఖర్చు కాదు, అది మీ సమయాన్ని, శక్తిని ఆదా చేసే పెట్టుబడి. మీ బడ్జెట్, మీ ఇంట్లోని సభ్యుల సంఖ్యను బట్టి పై ఐదింటిలో ఒకదానిని ఎంచుకోవచ్చు. మీరు ఫాస్ట్ వాషింగ్ కోరుకుంటే శామ్‌సంగ్ లేదా బాష్ ఫ్రంట్ లోడ్ వైపు వెళ్ళవచ్చు. అదే తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ కావాలంటే ఎల్‌జీ లేదా వర్ల్‌పూల్ టాప్ లోడ్ మోడల్స్ చక్కగా సరిపోతాయి. స్మార్ట్‌గా ఆలోచించండి. మీ లాండ్రీ కష్టాలను తగ్గించుకోండి.

Related News

BSNL మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. జస్ట్ రూ. 39కే 20GB డేటా.. రూ.1కే ఉచిత సిమ్!

రూ.35వేలలోపు 50 ఇంచుల టీవీ..ఇంట్లోనే థియేటర్ ఫీల్

రాత్రి వేళ గణపయ్య ఫోటోలు బ్లర్ అవుతున్నాయా? ఈ టిప్స్‌తో క్లారిటీ అదుర్స్!

రొటేటింగ్ బెజెల్‌తో క్రేజీ స్మార్ట్ వాచ్..GOBOULT Saber విశేషాలివే

రూ.1000లోపు దబిడి దిబిడే..పార్టీ మోత మోగించే బ్లూటూత్ స్పీకర్!

మ్యూజిక్ లవర్స్ కోసం బెస్ట్ హెడ్ సెట్..మార్కెట్లో రచ్చ చేస్తున్న మోడల్

రూ.2,399కే క్రేజీ ఫీచర్లు..నథింగ్ నుంచి కొత్త ఇయర్‌బడ్స్

కొత్త ఫోన్ కొంటున్నారా? 128GB లేదా 256GB ఏది బెటర్?

Big Stories

Advertisement
×