E-Paper
Advertisement

సామాన్యులకు గుడ్ న్యూస్.. ఇక ఏసీతో పనిలేదు.. కేవలం రూ.2 వేలతో ఇల్లంతా కూల్!

సామాన్యులకు గుడ్ న్యూస్.. ఇక ఏసీతో పనిలేదు.. కేవలం రూ.2 వేలతో ఇల్లంతా కూల్!
Advertisement

Roof Cooling: జూన్ నెల ఎంటర్ అయినప్పటికీ చాలా చోట్ల పగటి ఉష్ణోగ్రతలు భారీగానే నమోదవుతున్నాయి. రాత్రిళ్లు కొన్ని ప్రాంతాల్లో అడపాదడపా చినుకులు పడుతున్నప్పటికీ.. పగలు మాత్రం ఉక్కపోత చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా ఇళ్లల్లో పై అంతస్తులలో ఉండే వారికి మధ్యాహ్నం అయితే ఇల్లు నిప్పుల కుంపటిని తలపిస్తోంది. అలాగని రూ. వేలల్లో ఖర్చు పెట్టి ఏసీ కొనే స్థోమత తమకు లేదంటూ కొందరు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కేవలం రూ.2,000 లోపు బడ్జెట్‌లోనే ఇంటి పైకప్పును చల్లబరిచే 7 అద్భుతమైన చిట్కాలు ఈ కథనంలో అందించడం జరుగుతోంది. వాటిపై ఓ లుక్కేయండి

కూల్ రూఫ్ పెయింటింగ్

మార్కెట్‌లో దొరికే రిఫ్లెక్టివ్ కూల్ రూఫ్ కోటింగ్ లేదా తెల్లటి సున్నాన్ని పైకప్పుపై వేయాలి. సహజంగానే తెలుపు రంగు.. సూర్యకిరణాలను 80% పైగా తిరిగి వెనక్కి పంపేస్తుంది. దీనివల్ల ఇంటి లోపల ఉష్ణోగ్రత దాదాపు 4 నుండి 5 డిగ్రీల వరకు తగ్గుతుంది. దీనికి రూ.2000 లోపే ఖర్చు అవుతుంది.

ఖాళీ గొనె సంచులు

Advertisement

పాత జనపనార (గోనె) సంచులను తీసుకొచ్చి వాటిని పైకప్పు అంతా పరచండి. మధ్యాహ్న సమయంలో వాటిపై నీళ్లు చల్లండి. గొనె సంచులు నీటిని ఎక్కువసేపు పట్టి ఉంచుతాయి కాబట్టి రూఫ్ చల్లబడి, ఇల్లు ఏసీ లాగా మారుతుంది. దీనికి అయ్యే ఖర్చు రూ. 1000 లోపే ఉంటుంది.

టెర్రస్ గార్డెనింగ్

ఇంటి పైన వీలైనన్ని ఎక్కువ కుండీలను ఉంచి మొక్కలను పెంచండి. మొక్కల ఆకులు సూర్యరశ్మి నేరుగా సిమెంట్‌పై పడకుండా అడ్డుకుంటాయి. అలాగే మొక్కల నుండి వచ్చే తేమ.. వాతావరణాన్ని చల్లబరుస్తుంది.

మట్టి కుండల చిట్కా

Advertisement

మట్టి కుండలను బోర్లించి పైకప్పుపై వరుసగా అమర్చవచ్చు. కుండల మధ్య ఉండే చల్లగా ఉంటూ.. సూర్యరశ్మి ప్రభావం శ్లాబ్ పై పడకుండా చెక్ పెడతాయి. దీనివల్ల ఎండ వేడి కింది గదుల్లోకి ప్రసరించకుండా ఉంటుంది. ఫలితంగా ఇంట్లో చల్లగా ఉంటుంది. మట్టి కుండలు మార్కెట్లో చౌకగానే లభిస్తాయి కాబట్టి దీనికి కూడా రూ.2000 మించి అవ్వవని నిపుణులు సూచిస్తున్నారు.

వరి గడ్డి పరచడం

గ్రామీణ ప్రాంతాల్లో ఈ పద్ధతి బాగా పాపులర్. పైకప్పుపై 3-4 ఇంచుల మందంతో వరి గడ్డిని (Straw) పరిచి.. రోజుకు రెండుసార్లు నీళ్లు చల్లాలి. అలా చేస్తే ఎండ ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ.. ఇంటి లోపలి వాతారవరణం చాలా చల్లగా మారిపోతుంది.

గ్రీన్ షేడ్ నెట్స్

నర్సరీలలో వాడే గ్రీన్ షేడ్ నెట్స్‌ను రూ.1,500 లోపే కొనుగోలు చేయవచ్చు. దీన్ని పైకప్పుకు కాస్త ఎత్తులో కట్టడం వల్ల సూర్యకిరణాలు నేరుగా రూఫ్‌ను తాకవు. ఫలితంగా ఇంటిలోపలి ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటూ ఆహ్లాదకరంగా ఉంటాయి.

Also Read: ఈ 5 పొరపాట్లు చేస్తున్నారా? అయితే ల్యాప్ టాప్ బాంబులా పేలొచ్చు.. జాగ్రత్త భయ్యో!

తెల్లటి సిరామిక్ టైల్స్

బడ్జెట్ రూ.2,000 లోపు ఉంటే పాత తెల్లటి సిరామిక్ టైల్స్ ముక్కలను (Broken Tiles) తీసుకొచ్చి తెల్లటి సిమెంట్‌తో రూఫ్‌పై అతికించవచ్చు. అలా చేస్తే ఈ టైల్స్ శాశ్వతంగా ఎండ వేడిని ఇంట్లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటాయి. ఫలితంగా ఇల్లు ఎల్లప్పుడు చల్లగా.. ఏసీలో ఉన్నట్లుగా అనిపిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

Also Read:ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఇతనే.. 12 ఏళ్ల పరిశోధనలో తేలిన నిజం!

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×